Leviticus · chapter 26 · verse 33
Leviticus 26:33 in Telugu
జనములలోనికి మిమ్మును చెదరగొట్టి మీవెంట కత్తి దూసెదను, మీ దేశము పాడైపోవును, మీ పట్టములు పాడుపడును.
Janamulaloniki mimmunu chedaragotti meeventa katti doosedanu, mee deshamu paadaipovunu, mee pattamulu paadupadunu.
Leviticus 26:33 in English
- King James Version (KJV)
- And I will scatter you among the heathen, and will draw out a sword after you: and your land shall be desolate, and your cities waste.
- World English Bible (WEB)
- I will scatter you among the nations, and I will draw out the sword after you. Your land will be a desolation, and your cities shall be a waste.
- American Standard Version (ASV)
- And you will I scatter among the nations, and I will draw out the sword after you: and your land shall be a desolation, and your cities shall be a waste.
- Bible in Basic English (BBE)
- And I will send you out in all directions among the nations, and my sword will be uncovered against you, and your land will be without any living thing, and your towns will be made waste.
- Darby Translation (DBY)
- And I will scatter you among the nations, and will draw out the sword after you; and your land shall be desolation, and your cities waste.
- Webster's Bible (WBS)
- And I will scatter you among the heathen, and will draw out a sword after you: and your land shall be desolate, and your cities waste.
- Young's Literal Translation (YLT)
- And you I scatter among nations, and have drawn out after you a sword, and your land hath been a desolation, and your cities are a waste.
Read in context
- 31నా మనస్సు మీయందు అసహ్యపడును, నేను మీ పట్టణ ములను పాడు చేసెదను; మీ పరిశుద్ధస్థలములను పాడు చేసెదను; మీ సువాసనగల వాటి సువాసనను ఆఘ్రాణింపను.
- 32నేనే మీ దేశమును పాడుచేసిన తరువాత దానిలో కాపురముండు మీ శత్రువులు దాని చూచి ఆశ్చర్యపడెదరు.
- 33జనములలోనికి మిమ్మును చెదరగొట్టి మీవెంట కత్తి దూసెదను, మీ దేశము పాడైపోవును, మీ పట్టములు పాడుపడును.
- 34మీరు మీ శత్రువుల దేశములో ఉండగా మీ దేశము పాడైయున్న దినము లన్నియు అది తన విశ్రాంతికాలములను అనుభవించును.
- 35అది పాడైయుండు దినములన్నియు అది విశ్రమించును. మీరు దానిలో నివసించినప్పుడు అది విశ్రాంతికాలములో పొందకపోయిన విశ్రాంతిని అది పాడైయుండు దినములలో అనుభవించును.
Cross references
- Ezekiel 20:23 యెహెజ్కేలు 20:23మరియు వారు నా విధుల ననుసరింపక నా కట్టడలను తృణీకరించి, నేను విధించిన విశ్రాంతిదినములను అపవిత్ర పరచి,
- Deuteronomy 4:27 ద్వితీయోపదేశకాండము 4:27మరియు యెహోవా జనములలో మిమ్మును చెదరగొట్టును; యెహోవా ఎక్కడికి మిమ్మును తోలివేయునో అక్కడి జనములలో మీరు కొద్దిమందే మిగిలియుందురు.
- Zechariah 7:14 జెకర్యా 7:14మరియు వారెరుగని అన్య జనులలో నేను వారిని చెదరగొట్టుదును. వారు తమ దేశమును విడిచినమీదట అందులో ఎవరును సంచరింపకుండ అది పాడగును; ఈలాగున వారు మనోహరమైన తమ దేశమునకు నాశనము కలుగజేసియున్నారు.
- Deuteronomy 28:64–66 ద్వితీయోపదేశకాండము 28:64–66దేశముయొక్క యీ కొనమొదలు కొని ఆ కొనవరకును సమస్తజనములలోనికి యెహోవా నిన్ను చెదరగొట్టును. అక్కడ నీవైనను నీ పితరులైనను ఎరుగని కొయ్యవియు రాతివియునైన అన్యదేవతలను పూజింతువు. ఆ జనములలో నీకు నెమ్మది కలుగదు; నీ అరకాలికి విశ్రాంతి కలుగదు. అక్కడ యెహోవా హృదయ కంపమును నేత్రక్షీణతయు మనోవేదనయు నీకు కలుగజేయును. నీకు ఎల్లప్పుడు ప్రాణభయము కలిగి యుండును.
- Ezekiel 22:15 యెహెజ్కేలు 22:15అన్యజనులలో నిన్ను చెదరగొట్టుదును, ఇతర దేశములకు నిన్ను వెళ్లగొట్టుదును.
- Psalm 44:11 కీర్తనలు 44:11భోజనపదార్థముగా ఒకడు గొఱ్ఱెలను అప్పగించునట్లు నీవు మమ్మును అప్పగించియున్నావు అన్యజనులలోనికి మమ్మును చెదరగొట్టి యున్నావు
- Jeremiah 9:16 యిర్మీయా 9:16తామైనను తమ పితరులైనను ఎరుగని జనములలోనికి వారిని చెదరగొట్టు దును, వారిని నిర్మూలముచేయువరకు వారి వెంబడి ఖడ్గ మును పంపుదును.
- Lamentations 4:15 విలాపవాక్యములు 4:15పొమ్ము అపవిత్రుడా, పొమ్ము పొమ్ము ముట్టవద్దని జనులు వారితో ననిరి. వారు పారిపోయి తిరుగులాడుచుండగా అన్యజనులైన వారు ఇకను వారిక్కడ కాపురముండకూడదని చెప్పు కొనిరి
- Ezekiel 12:14–16 యెహెజ్కేలు 12:14–16మరియు వారికి సహాయులై వచ్చినవారినందరిని అతని దండు వారినందరిని నేను నలుదిక్కుల చెదరగొట్టి కత్తిదూసి వారిని తరిమెదను నేను వారిని అన్యజనులలో చెదరగొట్టి ఆ యా దేశములలో వారిని వెళ్లగొట్టిన తరువాత నేనే యెహోవానైయున్నానని వారు తెలిసికొందురు అయితే నేను యెహోవానై యున్నానని అన్యజనులు తెలిసికొనునట్లు తాము చేరిన అన్యజనులలో తమ హేయకృత్యములన్నిటిని వారు వివరించి తెలియజెప్పుటకై ఖడ్గముచేత కూలకుండను క్షామమునకు చావకుండను తెగులు తగులకుండను నేను వారిలో కొందరిని తప్పించెదను.
- Luke 21:24 లూకా 21:24వారు కత్తివాత కూలుదురు; చెరపట్టబడిన వారై సమస్తమైన అన్యజనముల మధ్యకు పోవుదురు; అన్యజనముల కాలములు సంపూర్ణమగువరకు యెరూష లేము అన్యజనములచేత త్రొక్కబడును.
- Lamentations 1:3 విలాపవాక్యములు 1:3యూదా బాధనొంది దాసురాలై చెరలోనికి పోయియున్నది అన్యజనులలో నివసించుచున్నది విశ్రాంతినొందక పోయెను దానితరుమువారందరు ఇరుకుచోట్లదాని కలిసికొందురు. నియామక కూటములకు ఎవరును రారు గనుక
- James 1:1 యాకోబు 1:1దేవునియొక్కయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు అన్యదేశములయందు చెదిరియున్న పండ్రెండు గోత్రములవారికి శుభమని చెప్పి వ్రాయునది.