Psalms · chapter 21 · verse 8
Psalm 21:8 in Telugu
నీ హస్తము నీ శత్రువులందరిని చిక్కించుకొనును నీ దక్షిణహస్తము నిన్ను ద్వేషించువారిని చిక్కించుకొనును.
Nee hastamu nee shatruvulandarini chikkinchukonunu nee dakshinahastamu ninnu dveshinchuvaarini chikkinchukonunu.
Psalm 21:8 in English
- King James Version (KJV)
- Thine hand shall find out all thine enemies: thy right hand shall find out those that hate thee.
- World English Bible (WEB)
- Your hand will find out all of your enemies. Your right hand will find out those who hate you.
- American Standard Version (ASV)
- Thy hand will find out all thine enemies; Thy right hand will find out those that hate thee.
- Bible in Basic English (BBE)
- Your hand will make a search for all your haters; your right hand will be hard on all those who are against you.
- Darby Translation (DBY)
- Thy hand shall find out all thine enemies; thy right hand shall find out those that hate thee.
- Webster's Bible (WBS)
- Thy hand shall find out all thy enemies: thy right hand shall find out those that hate thee.
- Young's Literal Translation (YLT)
- Thy hand cometh to all Thine enemies, Thy right hand doth find Thy haters.
Read in context
- 6నిత్యము ఆశీర్వాద కారకుడుగా నుండునట్లు నీవతని నియమించియున్నావు నీ సన్నిధిని సంతోషముతో అతని నుల్లసింపజేసియున్నావు.
- 7ఏలయనగా రాజు యెహోవాయందు నమ్మిక యుంచు చున్నాడు సర్వోన్నతుని కృపచేత అతడు కదలకుండ నిలుచును.
- 8నీ హస్తము నీ శత్రువులందరిని చిక్కించుకొనును నీ దక్షిణహస్తము నిన్ను ద్వేషించువారిని చిక్కించుకొనును.
- 9నీవు ప్రత్యక్షమైనప్పుడు వారు అగ్నిగుండమువలె అగుదురుతన కోపమువలన యెహోవా వారిని నిర్మూలముచేయును అగ్ని వారిని దహించును.
- 10భూమిమీద నుండకుండ వారి గర్భఫలమును నీవు నాశనము చేసెదవు నరులలో నుండకుండ వారి సంతానమును నశింపజేసెదవు.
Cross references
- Psalm 110:1–2 కీర్తనలు 110:1–2ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చినవాక్కు నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయువరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. యెహోవా నీ పరిపాలనదండమును సీయోనులోనుండి సాగజేయుచున్నాడు నీ శత్రువులమధ్యను నీవు పరిపాలన చేయుము.
- Luke 19:27 లూకా 19:27మరియు నేను తమ్మును ఏలు టకు ఇష్టములేని నా శత్రువులను ఇక్కడికి తీసికొనివచ్చి నాయెదుట సంహరించుడని చెప్పెను.
- 1 Corinthians 15:25 1 కొరింథీయులకు 15:25ఎందుకనగా తన శత్రువులనందరిని తన పాదముల క్రింద ఉంచువరకు ఆయన రాజ్యపరిపాలన చేయుచుండవలెను.
- Revelation 19:15 ప్రకటన 19:15జనములను కొట్టుటకై ఆయన నోటనుండి వాడిగల ఖడ్గము బయలు వెడలు చున్నది. ఆయన యినుపదండముతో వారిని ఏలును; ఆయనే సర్వాధికారియగు దేవుని తీక్షణమైన ఉగ్రత అను మద్యపుతొట్టి త్రొక్కును.
- Hebrews 10:28–29 హెబ్రీయులకు 10:28–29ఎవడైనను మోషే ధర్మశాస్త్రమును నిరాకరించినయెడల ఇద్దరు ముగ్గురు సాక్షుల మాటమీద, కనికరింపకుండ వాని చంపించుదురు. ఇట్లుండగా దేవుని కుమారుని, పాదములతో త్రొక్కి, తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి, కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించినవాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచును?
- Psalm 72:9 కీర్తనలు 72:9అరణ్యవాసులు అతనికి లోబడుదురు. అతని శత్రువులు మన్ను నాకెదరు.
- Luke 19:14 లూకా 19:14అయితే అతని పట్టణస్థులతని ద్వేషించిఇతడు మమ్ము నేలుట మా కిష్టము లేదని అతని వెనుక రాయబారము పంపిరి.
- Psalm 18:1 కీర్తనలు 18:1యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించు చున్నాను.
- Amos 9:2–3 ఆమోసు 9:2–3వారు పాతాళములో చొచ్చి పోయినను అచ్చటనుండి నా హస్తము వారిని బయటికి లాగును; ఆకాశమునకెక్కి పోయినను అచ్చటనుండి వారిని దింపి తెచ్చెదను. వారు కర్మెలు పర్వతశిఖరమున దాగినను నేను వారిని వెదకిపట్టి అచ్చటనుండి తీసికొని వచ్చెదను; నా కన్నులకు కనబడకుండ వారు సముద్రములో మునిగినను అచ్చటి సర్పమునకు నేనాజ్ఞ ఇత్తును, అది వారిని కరచును.
- Psalm 2:9 కీర్తనలు 2:9ఇనుపదండముతో నీవు వారిని నలుగగొట్టెదవు కుండను పగులగొట్టినట్టు వారిని ముక్క చెక్కలుగా పగులగొట్టెదవు
- Psalm 89:22–23 కీర్తనలు 89:22–23ఏ శత్రువును అతనిమీద జయము నొందడు దోషకారులు అతని బాధపరచరు. అతనియెదుట నిలువకుండ అతని విరోధులను నేను పడగొట్టెదను. అతనిమీద పగపట్టువారిని మొత్తెదను.
- 1 Samuel 31:3 1 సమూయేలు 31:3యుద్ధములో సౌలు ఓడిపోవుచుండగా అతడు అంబులువేయువారి కంటబడి వారిచేత బహు గాయముల నొందెను. అప్పుడు సౌలు