Revelation · chapter 2 · verse 26
Revelation 2:26 in Telugu
నేను నా తండ్రివలన అధికారము పొందినట్టు జయించుచు, అంతమువరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనులమీద అధికారము ఇచ్చెదను.
Nenu naa tandrivalana adhikaaramu pondinattu jayinchuchu, antamuvaraku naa kriyalu jaagrattagaa cheyuvaaniki janulameeda adhikaaramu ichchedanu.
Revelation 2:26 in English
- King James Version (KJV)
- And he that overcometh, and keepeth my works unto the end, to him will I give power over the nations:
- World English Bible (WEB)
- He who overcomes, and he who keeps my works to the end, to him I will give authority over the nations.
- American Standard Version (ASV)
- And he that overcometh, and he that keepeth my works unto the end, to him will I give authority over the nations:
- Bible in Basic English (BBE)
- He who overcomes, and keeps my works to the end, to him I will give rule over the nations,
- Darby Translation (DBY)
- And he that overcomes, and he that keeps unto the end my works, to him will I give authority over the nations,
- Webster's Bible (WBS)
- And he that overcometh, and keepeth my works to the end, to him will I give power over the nations:
- Young's Literal Translation (YLT)
- and he who is overcoming, and who is keeping unto the end my works, I will give to him authority over the nations,
Read in context
- 24అయితే తుయతైరలో కడమవారైన మీతో, అనగా ఈ బోధను అంగీకరింపక సాతానుయొక్క గూఢమైన సంగ తులను ఎరుగమని చెప్పుకొనువారందరితో నేను చెప్పుచున్నదేమనగా మీపైని మరి ఏ భారమును పెట్టను.
- 25నేను వచ్చువరకు మీకు కలిగియున్నదానిని గట్టిగా పట్టుకొనుడి.
- 26నేను నా తండ్రివలన అధికారము పొందినట్టు జయించుచు, అంతమువరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనులమీద అధికారము ఇచ్చెదను.
- 27అతడు ఇనుపదండముతో వారిని ఏలును; వారు కుమ్మరవాని పాత్రలవలె పగులగొట్టబడుదురు;
- 28మరియు అతనికి వేకువ చుక్కను ఇచ్చెదను.
Cross references
- Revelation 3:21 ప్రకటన 3:21నేను జయించి నా తండ్రితోకూడ ఆయన సింహాసనమునందు కూర్చుండి యున్న ప్రకారము జయించువానిని నాతోకూడ నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను.
- Revelation 2:7 ప్రకటన 2:7చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్నమాట వినునుగాక. జయించు వానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్షఫలములు భుజింప నిత్తును.
- Daniel 7:27 దానియేలు 7:27ఆకాశమంతటి క్రిందనున్న రాజ్యమును అధికారమును రాజ్య మహాత్మ్యమును మహోన్నతుని పరిశుద్ధులకు చెందును. ఆయన రాజ్యము నిత్యము నిలుచును, అధికారులందరును దానికి దాసులై విధేయులగుదురు. ఇంతలో సంగతి సమాప్తమాయెను అని చెప్పెను.
- Psalm 2:8 కీర్తనలు 2:8నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతములవరకు సొత్తుగాను ఇచ్చెదను.
- Revelation 20:4 ప్రకటన 20:4అంతట సింహాసనములను చూచితిని; వాటిమీద ఆసీనులై యుండువారికి విమర్శచేయుటకు అధికారము ఇయ్యబడెను. మరియు క్రూరమృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారముచేయ తమ నొసళ్లయందు గాని చేతులయందు గాని దాని ముద్రవేయించుకొనని వారిని, యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని. వారు బ్రదికినవారై, వెయ్యి సంవత్సరములు క్రీస్తుతోకూడ రాజ్యము చేసిరి
- Revelation 22:5 ప్రకటన 22:5రాత్రి యికనెన్నడు ఉండదు; దీపకాంతియైనను సూర్య కాంతియైనను వారికక్కరలేదు; దేవుడైన ప్రభువే వారిమీద ప్రకాశించును. వారు యుగయుగములు రాజ్యము చేయుదురు.
- Matthew 24:13 మత్తయి 24:13అంతమువరకు సహించినవా డెవడో వాడే రక్షింపబడును.
- 1 John 5:5 1 యోహాను 5:5యేసు దేవుని కుమారుడని నమ్ము వాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు?
- John 6:29 యోహాను 6:29యేసు ఆయన పంపిన వానియందు మీరు విశ్వాసముంచుటయే దేవుని క్రియయని వారితో చెప్పెను.
- Revelation 2:11 ప్రకటన 2:11సంఘములతో ఆత్మచెప్పుచున్న మాట చెవిగలవాడు వినును గాక. జయించువాడు రెండవ మరణమువలన ఏ హానియుచెందడు.
- Daniel 7:22 దానియేలు 7:22ఆ మహావృద్ధుడు వచ్చి మహోన్నతుని పరిశుద్ధుల విషయములో తీర్పు తీర్చువరకు ఆలాగు జరుగును గాని సమయము వచ్చినప్పుడు ఆ పరిశుద్ధులు రాజ్యము నేలుదురను సంగతి నేను గ్రహించితిని.
- Daniel 7:18 దానియేలు 7:18అయితే మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యాధికారము నొందుదురు; వారు యుగయుగములు యుగయుగాంత ములవరకు రాజ్యమేలుదురు.