Revelation · chapter 4 · verse 2
Revelation 4:2 in Telugu
వెంటనే నేను ఆత్మవశుడనైతిని. అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి యుండెను. సింహాసనమునందు ఒకడు ఆసీసుడై యుండెను,
Ventane nenu aatmavashudanaitini. Adigo paralokamandu oka sinhaasanamu veyabadi yundenu. Sinhaasanamunandu okadu aaseesudai yundenu,
Revelation 4:2 in English
- King James Version (KJV)
- And immediately I was in the spirit: and, behold, a throne was set in heaven, and [one] sat on the throne.
- World English Bible (WEB)
- Immediately I was in the Spirit. Behold, there was a throne set in heaven, and one sitting on the throne
- American Standard Version (ASV)
- Straightway I was in the Spirit: and behold, there was a throne set in heaven, and one sitting upon the throne;
- Bible in Basic English (BBE)
- Straight away I was in the Spirit: and I saw a high seat in heaven, and one was seated on it;
- Darby Translation (DBY)
- Immediately I became in [the] Spirit; and behold, a throne stood in the heaven, and upon the throne one sitting,
- Webster's Bible (WBS)
- And immediately I was in the spirit: and behold, a throne was set in heaven, and [one] sat on the throne.
- Young's Literal Translation (YLT)
- and immediately I was in the Spirit, and lo, a throne was set in the heaven, and upon the throne is [one] sitting,
Read in context
- 1ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా, అదిగో పరలోకమందు ఒక తలుపు తెరువబడియుండెను. మరియు నేను మొదట వినిన స్వరము బూరధ్వనివలె నాతో మాటలాడగా వింటిని. ఆ మాటలాడినవాడు ఇక్కడికి ఎక్కిరమ్ము; ఇకమీదట జరుగవలసినవాటిని నీకు కనుపరచెదననెను
- 2వెంటనే నేను ఆత్మవశుడనైతిని. అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి యుండెను. సింహాసనమునందు ఒకడు ఆసీసుడై యుండెను,
- 3ఆసీనుడైనవాడు, దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు; మరకతమువలె ప్రకాశించు ఇంద్రధనుస్సు సింహాసనమును ఆవరించియుండెను.
- 4సింహాసనముచుట్టు ఇరువది నాలుగు సింహాసనములుండెను, ఈ సింహాసనములందు ఇరువదినలుగురు పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని, తమ తలలమీద సువర్ణ కిరీటములు పెట్టుకొన్నవారై కూర్చుండిరి.
Cross references
- Revelation 1:10 ప్రకటన 1:10ప్రభువు దినమందు ఆత్మ వశుడనై యుండగా బూరధ్వనివంటి గొప్పస్వరము
- 1 Kings 22:19 1 రాజులు 22:19మీకాయా యిట్లనెనుయెహోవా సెలవిచ్చిన మాట ఆలకించుము; యెహోవా సింహాసనాసీనుడై యుండగా పరలోకసైన్యమంతయు ఆయన కుడి పార్శ్వమునను ఎడమపార్శ్వమునను నిలిచి యుండుట నేను చూచితిని
- Isaiah 6:1 యెషయా 6:1రాజైన ఉజ్జియా మృతినొందిన సంవత్సరమున అత్యు న్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడైయుండగా నేను చూచితిని; ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను.
- Ezekiel 3:12–14 యెహెజ్కేలు 3:12–14అంతలో ఆత్మ నన్నెత్తికొనిపోగా యెహోవా ప్రభావమునకు స్తోత్రము కలుగునుగాక అను శబ్దమొకటి ఆయన యున్న స్థలమునుండి ఆర్భాటముతో నా వెనుక పలుకుట నేను వింటిని. మరియు ఆ జంతువుల రెక్కలు ఒక దానికొకటి తగులుటవలన కలుగు చప్పుడును వాటి ప్రక్కనున్న చక్రముల ధ్వనియు గొప్ప సందడి జరుగు చున్నట్లుగా నాకు వినబడెను ఆత్మ నన్నెత్తి తోడు కొనిపోగా నా మనస్సునకు కలిగిన రౌద్రాగ్నిచేత బహుగా వ్యాకులపడుచు కొట్టుకొనిపోయినప్పుడు, యెహోవా హస్తము నా మీద బలముగా వచ్చెను.
- Ezekiel 1:26 యెహెజ్కేలు 1:26వాటి తలల పైనున్న ఆ మండలముపైన నీల కాంతమయమైన సింహాసనమువంటి దొకటి కనబడెను; మరియు ఆ సింహాసనమువంటి దానిమీద నరస్వరూపియగు ఒకడు ఆసీనుడైయుండెను.
- Revelation 5:1 ప్రకటన 5:1మరియు లోపటను వెలుపటను వ్రాతకలిగి, యేడు ముద్రలు గట్టిగా వేసియున్న యొక గ్రంథము సింహాసనమునందు ఆసీసుడైయుండువాని కుడిచేత చూచితిని.
- Revelation 4:5 ప్రకటన 4:5ఆ సింహాసనములో నుండి మెరుపులును ధ్వనులును ఉరుములును బయలు దేరుచున్నవి. మరియు ఆ సింహాసనము ఎదుట ఏడు దీపములు ప్రజ్వలించుచున్నవి; అవి దేవుని యేడు ఆత్మలు.
- Daniel 7:9 దానియేలు 7:9ఇంక సింహాసనములను వేయుట చూచితిని; మహా వృద్ధుడొకడు కూర్చుండెను. ఆయన వస్త్రము హిమము వలె ధవళముగాను, ఆయన తలవెండ్రుకలు శుద్ధమైన గొఱ్ఱెబొచ్చువలె తెల్లగాను ఉండెను. ఆయన సింహాసనము అగ్నిజ్వాలలవలె మండుచుండెను; దాని చక్ర ములు అగ్నివలె ఉండెను.
- Revelation 4:9 ప్రకటన 4:9ఆ సింహాసనము నందు ఆసీనుడైయుండి యుగయుగములు జీవించుచున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులును కలుగునుగాకని ఆ జీవులు కీర్తించుచుండగా
- Revelation 5:13 ప్రకటన 5:13అంతట పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము, అనగా వాటిలోనున్న సర్వమును - సింహాసనాసీనుడై యున్నవానికిని గొఱ్ఱపిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాకని చెప్పుట వింటిని.
- Hebrews 8:1 హెబ్రీయులకు 8:1మేము వివరించుచున్న సంగతులలోని సారాంశ మేదనగా.
- Revelation 21:10 ప్రకటన 21:10ఆత్మవశుడనైయున్న నన్ను యెత్తయిన గొప్ప పర్వతముమీదికి కొనిపోయి, యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమగలదై పరలోక మందున్న దేవుని యొద్దనుండి దిగివచ్చుట నాకు చూపెను.
Original words (Greek)
- And · G2532καί kaí
- immediately · G2112εὐθέως euthéōs
- was · G1096γίνομαι gínomai
- in · G1722ἐν en
- spirit · G4151πνεῦμα pneûma
- and · G2532καί kaí
- behold · G2400ἰδού idoú
- throne · G2362θρόνος thrónos
- set · G2749κεῖμαι keîmai
- in · G1722ἐν en
- heaven · G3772οὐρανός ouranós
- and · G2532καί kaí
- sat · G2521κάθημαι káthēmai
- on · G1909ἐπί epí
- throne · G2362θρόνος thrónos