Revelation · chapter 4 · verse 3
Revelation 4:3 in Telugu
ఆసీనుడైనవాడు, దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు; మరకతమువలె ప్రకాశించు ఇంద్రధనుస్సు సింహాసనమును ఆవరించియుండెను.
Aaseenudainavaadu, drushtiki sooryakaanta padmaraagamulanu polinavaadu; marakatamuvale prakaashinchu indradhanussu sinhaasanamunu aavarinchiyundenu.
Revelation 4:3 in English
- King James Version (KJV)
- And he that sat was to look upon like a jasper and a sardine stone: and [there was] a rainbow round about the throne, in sight like unto an emerald.
- World English Bible (WEB)
- that looked like a jasper stone and a sardius. There was a rainbow around the throne, like an emerald to look at.
- American Standard Version (ASV)
- and he that sat [was] to look upon like a jasper stone and a sardius: and [there was] a rainbow round about the throne, like an emerald to look upon.
- Bible in Basic English (BBE)
- And to my eyes he was like a jasper and a sardius stone: and there was an arch of light round the high seat, like an emerald.
- Darby Translation (DBY)
- and he [that was] sitting like in appearance to a stone [of] jasper and a sardius, and a rainbow round the throne like in appearance to an emerald.
- Webster's Bible (WBS)
- And he that sat was in appearance like a jasper and a sardine stone: and [there was] a rainbow around the throne in sight like an emerald.
- Young's Literal Translation (YLT)
- and He who is sitting was in sight like a stone, jasper and sardine: and a rainbow was round the throne in sight like an emerald.
Read in context
- 1ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా, అదిగో పరలోకమందు ఒక తలుపు తెరువబడియుండెను. మరియు నేను మొదట వినిన స్వరము బూరధ్వనివలె నాతో మాటలాడగా వింటిని. ఆ మాటలాడినవాడు ఇక్కడికి ఎక్కిరమ్ము; ఇకమీదట జరుగవలసినవాటిని నీకు కనుపరచెదననెను
- 2వెంటనే నేను ఆత్మవశుడనైతిని. అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి యుండెను. సింహాసనమునందు ఒకడు ఆసీసుడై యుండెను,
- 3ఆసీనుడైనవాడు, దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు; మరకతమువలె ప్రకాశించు ఇంద్రధనుస్సు సింహాసనమును ఆవరించియుండెను.
- 4సింహాసనముచుట్టు ఇరువది నాలుగు సింహాసనములుండెను, ఈ సింహాసనములందు ఇరువదినలుగురు పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని, తమ తలలమీద సువర్ణ కిరీటములు పెట్టుకొన్నవారై కూర్చుండిరి.
- 5ఆ సింహాసనములో నుండి మెరుపులును ధ్వనులును ఉరుములును బయలు దేరుచున్నవి. మరియు ఆ సింహాసనము ఎదుట ఏడు దీపములు ప్రజ్వలించుచున్నవి; అవి దేవుని యేడు ఆత్మలు.
Cross references
- Ezekiel 1:28 యెహెజ్కేలు 1:28వర్ష కాలమున కనబడు ఇంద్ర ధనుస్సుయొక్క తేజస్సువలె దాని చుట్టునున్న తేజస్సు కనబడెను. ఇది యెహోవా ప్రభావ స్వరూప దర్శనము. నేను చూచి సాగిలపడగా నాతో మాటలాడు ఒకని స్వరము నాకు వినబడెను.
- Genesis 9:13–16 ఆదికాండము 9:13–16మేఘములో నా ధనుస్సును ఉంచితిని; అది నాకును భూమికిని మధ్య నిబంధనకు గురుతుగా నుండును. భూమిపైకి నేను మేఘమును రప్పించునప్పుడు ఆ ధనుస్సు మేఘములో కనబడును. అప్పుడు నాకును మీకును సమస్త జీవరాసులకును మధ్యనున్న నా నిబంధనను జ్ఞాపకము చేసికొందును గనుక సమస్త శరీరులను నాశనము చేయుటకు ఆలాగు ప్రవాహముగా నీళ్లు రావు. ఆ ధనుస్సు మేఘములో నుండును. నేను దాని చూచి దేవునికిని భూమిమీదనున్న సమస్త శరీరులలో ప్రాణముగల ప్రతి దానికిని మధ్యనున్న నిత్య నిబంధనను జ్ఞాపకము చేసికొందుననెను.
- Revelation 21:11 ప్రకటన 21:11దానియందలి వెలుగు ధగధగ మెరయు సూర్యకాంతమువంటి అమూల్య రత్నమును పోలియున్నది.
- Revelation 10:1 ప్రకటన 10:1బలిష్ఠుడైన వేరొక దూత పరలోకమునుండి దిగివచ్చుట చూచితిని. ఆయన మేఘము ధరించుకొని యుండెను, ఆయన శిరస్సుమీద ఇంద్రధనుస్సుండెను; ఆయన ముఖము సూర్యబింబమువలెను ఆయన పాదములు అగ్నిస్తంభములవలెను ఉండెను.
- Ezekiel 28:13 యెహెజ్కేలు 28:13దేవుని తోటయగు ఏదెనులో నీవుంటివి, మాణిక్యము గోమేధికము సూర్యకాంతమణి రక్తవర్ణపురాయి సులిమాని రాయి మరకతము నీలము పద్మరాగము మాణిక్యము అను అమూల్య రత్మములతోను బంగారముతోను నీవు అలంకరింపబడి యున్నావు; నీవు నియమింపబడిన దినమున పిల్లన గ్రోవులు వాయించువారును నీకు సిద్ధమైరి.
- Ezekiel 1:26 యెహెజ్కేలు 1:26వాటి తలల పైనున్న ఆ మండలముపైన నీల కాంతమయమైన సింహాసనమువంటి దొకటి కనబడెను; మరియు ఆ సింహాసనమువంటి దానిమీద నరస్వరూపియగు ఒకడు ఆసీనుడైయుండెను.
- Revelation 21:19–20 ప్రకటన 21:19–20ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడియుండెను. మొదటి పునాది సూర్యకాంతపురాయి, రెండవది నీలము, మూడవది యమునారాయి, నాలుగవది పచ్చ, అయిదవది వైడూర్యము, ఆరవది కెంపు, ఏడవది సువర్ణరత్నము, ఎనిమిదవది గోమేధికము, తొమ్మిదవది పుష్యరాగము, పదియవది సువర్ణల శునీయము, పదకొండవది పద్మరాగము, పండ్రెండవది సుగంధము.
- Exodus 24:10 నిర్గమకాండము 24:10ఇశ్రాయేలీయుల దేవుని చూచిరి. ఆయన పాద ములక్రింద నిగనిగలాడు నీలమయమైన వస్తువువంటిదియు ఆకాశ మండలపు తేజమువంటిదియు ఉండెను.
- Exodus 39:11 నిర్గమకాండము 39:11పద్మరాగ నీల సూర్యకాంత మణులుగల పంక్తి రెండవది;
- Isaiah 54:9–10 యెషయా 54:9–10నోవహు కాలమున జలప్రళయమునుగూర్చి నేను చేసినట్లు చేయుదును జలములు భూమిమీదికి ఇకను పొర్లుచురావని నోవహుకాలమున నేను ఒట్టుపెట్టుకొనినట్లు నీమీద కోపముగా నుండననియు నిన్ను గద్దింపననియు నేను ఒట్టు పెట్టుకొనియున్నాను. పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు సమాధానవిషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీయందు జాలిపడు యెహోవా సెలవిచ్చు చున్నాడు.
- Exodus 28:18 నిర్గమకాండము 28:18పద్మరాగ నీల సూర్యకాంతములుగల పంక్తి రెండవది;
Original words (Greek)
- And · G2532καί kaí
- he · G3588ὁ ho
- sat · G2521κάθημαι káthēmai
- was · G2258ἦν ēn
- upon · G3706ὅρασις hórasis
- like · G3664ὅμοιος hómoios
- jasper · G2393ἴασπις íaspis
- and · G2532καί kaí
- sardine · G4555σάρδινος sárdinos
- stone · G3037λίθος líthos
- and · G2532καί kaí
- rainbow · G2463ἶρις îris
- about · G2943κυκλόθεν kyklóthen
- throne · G2362θρόνος thrónos
- sight · G3706ὅρασις hórasis
- unto · G3664ὅμοιος hómoios
- emerald · G4664σμαράγδινος smarágdinos