Romans · chapter 1 · verse 31
Romans 1:31 in Telugu
మాట తప్పువారును అనురాగ రహితులును, నిర్దయులునైరి.
Maata tappuvaarunu anuraaga rahitulunu, nirdayulunairi.
Romans 1:31 in English
- King James Version (KJV)
- Without understanding, covenantbreakers, without natural affection, implacable, unmerciful:
- World English Bible (WEB)
- without understanding, covenant breakers, without natural affection, unforgiving, unmerciful;
- American Standard Version (ASV)
- without understanding, covenant-breakers, without natural affection, unmerciful:
- Bible in Basic English (BBE)
- Without knowledge, not true to their undertakings, unkind, having no mercy:
- Darby Translation (DBY)
- void of understanding, faithless, without natural affection, unmerciful;
- Webster's Bible (WBS)
- Without understanding, covenant-breakers, without natural affection, implacable, unmerciful:
- Young's Literal Translation (YLT)
- unintelligent, faithless, without natural affection, implacable, unmerciful;
Read in context
- 29అట్టివారు సమస్తమైన దుర్నీతిచేతను, దుష్టత్వముచేతను, లోభముచేతను, ఈర్ష్యచేతను నిండుకొని, మత్సరము నరహత్య కలహము కపటము వైరమనువాటితో నిండినవారై
- 30కొండెగాండ్రును అపవాదకులును, దేవద్వేషులును, హింసకులును, అహంకారులును, బింకములాడువారును, చెడ్డవాటిని కల్పించువారును, తలిదండ్రులకవిధేయులును, అవివేకులును
- 31మాట తప్పువారును అనురాగ రహితులును, నిర్దయులునైరి.
- 32ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగినవారు అను దేవుని న్యాయ విధిని వారు బాగుగ ఎరిగియుండియు, వాటిని చేయు చున్నారు. ఇది మాత్రమే గాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు.
Cross references
- 2 Timothy 3:3 2 తిమోతికి 3:3అనురాగరహితులు అతిద్వేషులు అపవాదకులు అజితేంద్రియులు క్రూరులు సజ్జనద్వేషులు
- Proverbs 18:2 సామెతలు 18:2తన అభిప్రాయములను బయలుపరచుటయందు సంతో షించును.
- Romans 3:11 రోమీయులకు 3:11గ్రహించువాడెవడును లేడు దేవుని వెదకువాడెవడును లేడు
- Jeremiah 4:22 యిర్మీయా 4:22నా జనులు అవివేకులు వారు నన్నెరుగరు, వారుమూఢు లైన పిల్లలు వారికి తెలివిలేదు, కీడుచేయుటకు వారికి తెలియును గాని మేలు చేయుటకు వారికి బుద్ది చాలదు.
- Isaiah 33:8 యెషయా 33:8రాజమార్గములు పాడైపోయెను త్రోవను నడచువారు లేకపోయిరి అష్షూరు నిబంధన మీరెను పట్టణములను అవమానపరచెను నరులను తృణీకరించెను.
- Matthew 15:16 మత్తయి 15:16ఆయనమీరును ఇంతవరకు అవివేకులైయున్నారా?
- Isaiah 27:11 యెషయా 27:11దానికొమ్మలు ఎండినవై విరిచివేయబడును స్త్రీలు వచ్చి వాటిని తగలబెట్టుదురు. వారు బుద్ధిగల జనులు కారు వారిని సృజించినవాడు వారియందు జాలిపడడు. వారిని పుట్టించినవాడు వారికి దయచూపడు.
- 2 Kings 18:14–37 2 రాజులు 18:14–37యూదారాజైన హిజ్కియా లాకీషు పట్టణమందున్న అష్షూరు రాజునొద్దకు దూతలను పంపినావలన తప్పు వచ్చినది;నాయొద్దనుండి తిరిగి నీవు వెళ్లిపోయినయెడల నామీద నీవు మోపినదానిని నేను భరించుదునని వర్తమానముచేయగా, అష్షూరురాజు యూదా రాజైన హిజ్కియాకు ఆరు వందల మణుగుల వెండియు అరువది మణుగుల బంగారమును జుల్మానాగా నియ మించెను. కావున హిజ్కియా యెహోవా మందిర మందును రాజనగరునందున్న పదార్థములలో కనబడిన వెండియంతయు అతనికిచ్చెను. మరియు ఆ కాలమందు హిజ్కియా దేవాలయపు తలుపులకున్న బంగారమును తాను కట్టించిన స్తంభములకున్న బంగారమును తీయించి అష్షూరు రాజునకిచ్చెను. అంతట అష్షూరురాజు తర్తానును రబ్సారీసును రబ్షా కేనును లాకీషు పట్టణమునుండి యెరూష లేమునందున్న రాజైన హిజ్కియామీదికి బహు గొప్ప సమూహముతో పంపెను. వారు యెరూషలేముమీదికి వచ్చి చాకిరేవు మార్గమందున్న మెరకకొలను కాలువ యొద్ద ప్రవేశించి నిలిచి రాజును పిలువనంపగా హిల్కీయా కుమారుడును గృహనిర్వాహకుడునైన ఎల్యా కీమును, శాస్త్రియగు షెబ్నాయును, రాజ్యపుదస్తావేజుల మీద నున్న ఆసాపు కుమారుడైన యోవాహును వారి యొద్దకు పోయిరి. అప్పుడు రబ్షాకే వారితో ఇట్లనెనుఈ మాట హిజ్కియాతో తెలియజెప్పుడుమహా రాజైన అష్షూరురాజు సెలవిచ్చినదేమనగానీవు ఈలాగు చెప్పవలెను. నీవు నమ్ముకొను ఈ ఆశ్రయాస్పదము ఏపాటి ప్రయోజనకారి? యుద్ధ విషయములో నీ యోచనయు నీ బలమును వట్టి మాటలే. ఎవని నమ్ముకొని నామీద తిరుగుబాటు చేయుచున్నావు? నలిగిన రెల్లువంటి యీ ఐగుప్తును నీవు నమ్ముకొనుచున్నావు గదా ఒకడు దానిమీద ఆనుకొన్నయెడల అది వానిచేతికి గుచ్చు కొని దూసి పోవును. ఐగుప్తురాజైన ఫరో అతని నమ్ముకొను వారి కందరికిని అట్టివాడే. మా దేవుడైన యెహోవాను మేము నమ్ముకొనుచున్నామని మీరు నాతో చెప్పెద రేమో సరే. - యెరూషలేమందున్న యీ బలిపీఠమునొద్ద మాత్రమే మీరు నమస్కారము చేయవలెనని యూదా వారికిని యెరూషలేమువారికిని ఆజ్ఞ ఇచ్చి హిజ్కియా యెవని ఉన్నతస్థలములను బలిపీఠములను పడగొట్టెనో ఆయనేగదా యెహోవా? కావున చిత్తగించి అష్షూరు రాజైన నా యేలినవానితో పందెము వేయుము; రెండువేల గుఱ్ఱములమీద రౌతులను ఎక్కించుటకు నీకు శక్తియున్న యెడల నేను వాటిని నీకిచ్చెదను. అట్లయితే నా యజ మానుని సేవకులలో అత్యల్పుడైన అధిపతియగు ఒకనిని నీవేలాగు ఎదిరింతువు? రథములను రౌతులను పంపునని ఐగుప్తురాజును నీవు ఆశ్రయించుకొంటివే. యెహోవా సెలవు నొందకయే ఈ దేశమును పాడుచేయుటకు నేను వచ్చితినా? లేదు; ఆ దేశముమీదికి పోయి దాని పాడు చేయుమని యెహోవా నాకు ఆజ్ఞ ఇచ్చెను అనెను. హిల్కీయా కుమారుడైన ఎల్యాకీము షెబ్నాయు యోవాహు అనువారుచిత్తగించుము, నీ దాసులమైన మాకు సిరియా భాష తెలియును గనుక దానితో మాట లాడుము; ప్రాకారముమీద నున్న ప్రజల వినికిడిలో యూదుల భాషతో మాటలాడకుమని రబ్షాకేతో అనగా రబ్షాకే ఈ మాటలు చెప్పుటకై నా యజమానుడు నీ యజమానుని యొద్దకును నీయొద్దకును నన్ను పంపెనా? తమమలమును తినునట్లును తమ మూత్రమును త్రాగునట్లును మీతోకూడ ప్రాకారముమీద కూర్చున్నవారియొద్దకును నన్ను పంపెనుగదా అని చెప్పి గొప్పశబ్దముతో యూదాభాషతో ఇట్లనెనుమహారాజైన అష్షూరురాజు సెలవిచ్చిన మాటలు వినుడి. రాజు సెలవిచ్చినదేమనగా హిజ్కియాచేత మోసపోకుడి; నా చేతిలోనుండి మిమ్మును విడిపింప శక్తి వానికి చాలదు. యెహోవాను బట్టి మిమ్మును నమ్మించియెహోవా మనలను విడిపించును, ఈ పట్టణము అష్షూరురాజు చేతిలో చిక్కకపోవునని హిజ్కియా చెప్పుచున్నాడే. హిజ్కియా చెప్పిన మాట మీరంగీకరింపవద్దు; అష్షూరురాజు సెలవిచ్చినదేమ నగానాతో సంధిచేసికొని నాయొద్దకు మీరు బయటికి వచ్చినయెడల మీలో ప్రతిమనిషి తన ద్రాక్షచెట్టుఫలమును తన అంజూరపుచెట్టు ఫలమును తినుచు తన బావి నీళ్లు త్రాగుచు ఉండును. అటుపిమ్మట మీరుచావక బ్రదుకునట్లుగా మేము వచ్చి మీ దేశమువంటి దేశమునకు, అనగా గోధుమలును ద్రాక్షారసమును గల దేశమునకును, ఆహారమును ద్రాక్షచెట్లును గల దేశమున కును, ఒలీవతైలమును తేనెయునుగల దేశమునకును మిమ్మును తీసికొని పోవుదును, అచ్చట మీరు సుఖముగా నుందురు. కావునయెహోవా మిమ్మును విడిపించునని చెప్పి హిజ్కియా మీకు బోధించు మాటలను వినవద్దు. ఆయా జనముల దేవతలలో ఏదైనను తన దేశమును అష్షూరురాజు చేతిలోనుండి విడిపించెనా? హమాతు దేవతలు ఏమా యెను? అర్పాదు దేవతలు ఏమాయెను? సెపర్వయీము దేవతలు ఏమాయెను? హేన ఇవ్వా అనువారి దేవతలు ఏమాయెను? (షోమ్రోను దేశపు) దేవత మా చేతిలోనుండి షోమ్రోనును విడిపించెనా? యెహోవా మా చేతిలోనుండి యెరూషలేమును విడిపించుననుటకు ఆయా దేశముల దేవతలలో ఏదైనను తన దేశమును మా చేతిలోనుండి విడిపించినది కలదా అని చెప్పెను. అయితే అతనికి ప్రత్యుత్తరమియ్యవద్దని రాజు సెలవిచ్చి యుండుటచేత జనులు ఎంతమాత్రమును ప్రత్యుత్తరమియ్యక ఊరకుండిరి. గృహ నిర్వాహకుడును హిల్కీయా కుమారుడు నైన ఎల్యాకీ మును, శాస్త్రియగు షెబ్నాయును, రాజ్యపు దస్తావేజులమీదనున్న ఆసాపు కుమారుడైన యోవాహును, బట్టలు చింపుకొని హిజ్కియాయొద్దకు వచ్చి, రబ్షాకే పలికిన మాటలన్నియు తెలియజెప్పిరి.
- Romans 1:20–21 రోమీయులకు 1:20–21ఆయన అదృశ్య లక్షణములు, అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుటవలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులై యున్నారు. మరియు వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచ లేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపనులేదు గాని తమ వాదములయందు వ్యర్థులైరి.