Romans · chapter 1 · verse 32
Romans 1:32 in Telugu
ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగినవారు అను దేవుని న్యాయ విధిని వారు బాగుగ ఎరిగియుండియు, వాటిని చేయు చున్నారు. ఇది మాత్రమే గాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు.
Itti kaaryamulanu abhyasinchuvaaru maranamunaku taginavaaru anu devuni nyaaya vidhini vaaru baaguga erigiyundiyu, vaatini cheyu chunnaaru. Idi maatrame gaaka vaatini abhyasinchu vaarito santoshamugaa sammatinchuchunnaaru.
Romans 1:32 in English
- King James Version (KJV)
- Who knowing the judgment of God, that they which commit such things are worthy of death, not only do the same, but have pleasure in them that do them.
- World English Bible (WEB)
- who, knowing the ordinance of God, that those who practice such things are worthy of death, not only do the same, but also approve of those who practice them.
- American Standard Version (ASV)
- who, knowing the ordinance of God, that they that practise such things are worthy of death, not only do the same, but also consent with them that practise them.
- Bible in Basic English (BBE)
- Who, though they have knowledge of the law of God, that the fate of those who do these things is death, not only go on doing these things themselves, but give approval to those who do them.
- Darby Translation (DBY)
- who knowing the righteous judgment of God, that they who do such things are worthy of death, not only practise them, but have fellow delight in those who do [them].
- Webster's Bible (WBS)
- Who, knowing the judgment of God, that they who commit such things are worthy of death; not only do the same, but have pleasure in them that do them.
- Young's Literal Translation (YLT)
- who the righteous judgment of God having known — that those practising such things are worthy of death — not only do them, but also have delight with those practising them.
Read in context
- 30కొండెగాండ్రును అపవాదకులును, దేవద్వేషులును, హింసకులును, అహంకారులును, బింకములాడువారును, చెడ్డవాటిని కల్పించువారును, తలిదండ్రులకవిధేయులును, అవివేకులును
- 31మాట తప్పువారును అనురాగ రహితులును, నిర్దయులునైరి.
- 32ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగినవారు అను దేవుని న్యాయ విధిని వారు బాగుగ ఎరిగియుండియు, వాటిని చేయు చున్నారు. ఇది మాత్రమే గాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు.
Cross references
- Romans 2:1–5 రోమీయులకు 2:1–5కాబట్టి తీర్పు తీర్చు మనుష్యుడా, నీ వెవడవైనను సరే నిరుత్తరుడవై యున్నావు. దేనివిషయములో ఎదుటి వానికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయములో నీవే నేరస్థుడవని తీర్పు తీర్చుకొనుచున్నావు; ఏలయనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములనే చేయుచున్నావు కావా? అట్టి కార్యములు చేయువారిమీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినదే అని యెరుగుదుము. అట్టి కార్యములు చేయువారికి తీర్పు తీర్చుచు వాటినే చేయుచున్న మనుష్యుడా, నీవు దేవుని తీర్పు తప్పించు కొందువని అను కొందువా? లేదా, దేవుని అనుగ్రహము మారు మనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని యెరుగక, ఆయన అనుగ్రహైశ్వర్యమును సహనమును దీర్ఘ శాంతమును తృణీకరించుదువా? నీ కాఠిన్యమును, మార్పు పొందని నీ హృదయమును అనుసరించి, ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలు పరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చు కొనుచున్నావు.
- Romans 1:21 రోమీయులకు 1:21మరియు వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచ లేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపనులేదు గాని తమ వాదములయందు వ్యర్థులైరి.
- Romans 6:21 రోమీయులకు 6:21అప్పటి క్రియలవలన మీకేమి ఫలము కలిగెను? వాటినిగురించి మీరిప్పుడు సిగ్గుపడుచున్నారు కారా? వాటి అంతము మరణమే,
- Psalm 50:18 కీర్తనలు 50:18నీవు దొంగను చూచినప్పుడు వానితో ఏకీభవించెదవు వ్యభిచారులతో నీవు సాంగత్యము చేసెదవు.
- Romans 1:18 రోమీయులకు 1:18దుర్నీతిచేత సత్యమును అడ్డగించు మనుష్యులయొక్క సమస్త భక్తిహీనతమీదను, దర్నీతిమీదను దేవుని కోపము పరలోకమునుండి బయలుపరచబడుచున్నది.
- Romans 2:21–23 రోమీయులకు 2:21–23ఎదుటివానికి బోధించు నీవు నీకు నీవే బోధించుకొనవా? దొంగిలవద్దని ప్రకటించు నీవు దొంగిలెదవా? వ్యభిచరింపవద్దని చెప్పు నీవు వ్యభిచరించెదవా? విగ్రహములను అసహ్యించుకొను నీవు గుళ్లను దోచెదవా? ధర్మశాస్త్రమందు అతిశయించు నీవు ధర్మశాస్త్రము మీరుటవలన దేవుని అవమానపర చెదవా?
- Luke 11:48 లూకా 11:48కావున మీరు సాక్షులై మీ పితరుల కార్యములకు సమ్మతించు చున్నారు; వారు ప్రవక్తలను చంపిరి, మీరు వారి సమాధులు కట్టించుదురు.
- Acts 22:20 అపొస్తలుల కార్యములు 22:20మరియు నీ సాక్షియైన స్తెఫను రక్తము చిందింపబడినప్పుడు నేనుకూడ దగ్గర నిలిచి అందుకు సమ్మతించి అతని చంపినవారి వస్త్రములకు కావలియుంటినని చెప్పితిని.
- Mark 14:10–11 మార్కు 14:10–11పండ్రెండుమందిలో నొకడగు ఇస్కరియోతు యూదా, ప్రధానయాజకుల చేతికి ఆయనను అప్పగింప వలెనని వారియొద్దకు పోగా వారు విని, సంతోషించి వానికి ద్రవ్యమిత్తుమని వాగ్దానము చేసిరి గనుక వాడు ఆయనను అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టు చుండెను.
- Hosea 7:3 హోషేయ 7:3వారు చేయు చెడు తనమును చూచి రాజు సంతోషించును; వారు కల్లలాడుట అధిపతులు విని సంతోషింతురు.
- Acts 8:1 అపొస్తలుల కార్యములు 8:1ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున, అపొస్తలులు తప్ప అందరు యూదయ సమరయ దేశములయందు చెదరిపోయిరి.
Original words (Greek)
- Who · G3748ὅστις hóstis
- knowing · G1921ἐπιγινώσκω epiginṓskō
- judgment · G1345δικαίωμα dikaíōma
- God · G2316θεός theós
- that · G3754ὅτι hóti
- which · G3588ὁ ho
- commit · G4238πράσσω prássō
- things · G5108τοιοῦτος toioûtos
- are · G1526εἰσί eisí
- worthy · G514ἄξιος áxios
- death · G2288θάνατος thánatos
- not · G3756οὐ ou
- only · G3440μόνον mónon
- do · G4160ποιέω poiéō
- same · G846αὐτός autós
- but · G235ἀλλά allá
- in · G4909συνευδοκέω syneudokéō
- that · G3588ὁ ho
- them · G4238πράσσω prássō