Romans · chapter 12 · verse 15
Romans 12:15 in Telugu
సంతోషించు వారితో సంతోషించుడి;
Santoshinchu vaarito santoshinchudi;
Romans 12:15 in English
- King James Version (KJV)
- Rejoice with them that do rejoice, and weep with them that weep.
- World English Bible (WEB)
- Rejoice with those who rejoice. Weep with those who weep.
- American Standard Version (ASV)
- Rejoice with them that rejoice; weep with them that weep.
- Bible in Basic English (BBE)
- Take part in the joy of those who are glad, and in the grief of those who are sorrowing.
- Darby Translation (DBY)
- Rejoice with those that rejoice, weep with those that weep.
- Webster's Bible (WBS)
- Rejoice with them that rejoice, and weep with them that weep.
- Young's Literal Translation (YLT)
- to rejoice with the rejoicing, and to weep with the weeping,
Read in context
- 13పరిశుద్ధుల అవసరములలో పాలుపొందుచు, శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండుడి.
- 14మిమ్మును హింసించువారిని దీవించుడి; దీవించుడి గాని శపింపవద్దు.
- 15సంతోషించు వారితో సంతోషించుడి;
- 16ఏడ్చువారితో ఏడువుడి; ఒకనితో నొకడు మనస్సుకలిసి యుండుడి. హెచ్చు వాటియందు మనస్సుంచక తగ్గువాటియందు ఆసక్తులై యుండుడి. మీకు మీరే బుద్ధిమంతులమని అనుకొనవద్దు.
- 17కీడుకు ప్రతి కీడెవనికిని చేయవద్దు; మనుష్యు లందరి దృష్టికి యోగ్యమైనవాటినిగూర్చి ఆలోచన కలిగి యుండుడి.
Cross references
- 1 Corinthians 12:26 1 కొరింథీయులకు 12:26కాగా ఒక అవయవము శ్రమపడునప్పుడు అవయవములన్నియు దానితోకూడ శ్రమపడును; ఒక అవయవము ఘనత పొందునప్పుడు అవయవములన్నియు దానితోకూడ సంతో షించును.
- Hebrews 13:3 హెబ్రీయులకు 13:3మీరును వారితోకూడ బంధింపబడినట్టు బంధకములోనున్న వారిని జ్ఞాపకము చేసికొనుడి. మీరును శరీరముతో ఉన్నారు గనుక కష్టముల ననుభవించుచున్న వారిని జ్ఞాపకము చేసికొనుడి.
- Psalm 35:13–14 కీర్తనలు 35:13–14వారు వ్యాధితో నున్నప్పుడు గోనెపట్ట కట్టుకొంటిని ఉపవాసముచేత నా ప్రాణమును ఆయాసపరచు కొంటిని అయినను నా ప్రార్థన నా యెదలోనికే తిరిగి వచ్చి యున్నది. అతడు నాకు చెలికాడైనట్టును సహోదరుడైనట్టును నేను నడుచుకొంటిని తన తల్లి మృతినొందినందున దుఃఖవస్త్రములు ధరించు వానివలె క్రుంగుచుంటిని.
- John 11:33–36 యోహాను 11:33–36ఆమె ఏడ్చుటయు, ఆమెతో కూడ వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతని నెక్కడ నుంచితిరని అడుగగా, వారుప్రభువా, వచ్చి చూడుమని ఆయనతో చెప్పిరి. యేసు కన్నీళ్లు విడిచెను. కాబట్టి యూదులు అతనిని ఏలాగు ప్రేమించెనో చూడుడని చెప్పుకొనిరి.
- Job 30:25 యోబు 30:25బాధలోనున్నవారి నిమిత్తము నేను ఏడవలేదా?దరిద్రుల నిమిత్తము నేను దుఖింపలేదా?
- Luke 1:58 లూకా 1:58అప్పుడు ప్రభువు ఆమెమీద మహాకనికరముంచెనని ఆమె పొరుగువారును బంధువులును విని ఆమెతో కూడ సంతోషించిరి.
- Philippians 2:17–18 ఫిలిప్పీయులకు 2:17–18మరియు మీ విశ్వాసయాగములోను దాని సంబంధమైన సేవలోను నేను పానార్పణముగా పోయబడినను, నేనా నందించి మీ యందరితోకూడ సంతోషింతును. ఇటువలెనే మీరును ఆనందించి నాతోకూడ సంతోషించుడి.
- Acts 11:23 అపొస్తలుల కార్యములు 11:23అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి, ప్రభువును స్థిరహృదయముతో హత్తుకొనవలెనని అందరిని హెచ్చరించెను.
- Jeremiah 9:1 యిర్మీయా 9:1నా జనులలో హతమైనవారినిగూర్చి నేను దివారాత్రము కన్నీరు విడుచునట్లు నా తల జలమయము గాను నా కన్ను కన్నీళ్ల ఊటగాను ఉండును గాక.
- John 11:19 యోహాను 11:19గనుక యూదులలో అనేకులు వారి సహోదరునిగూర్చి మార్తను మరియను ఓదార్చుటకై వారి యొద్దకు వచ్చియుండిరి.
- Isaiah 66:10–14 యెషయా 66:10–14యెరూషలేమును ప్రేమించువారలారా, మీరందరు ఆమెతో సంతోషించుడి ఆనందించుడి. ఆమెనుబట్టి దుఃఖించువారలారా, మీరందరు ఆమెతో ఉత్సహించుడి ఆదరణకరమైన ఆమె స్తన్యమును మీరు కుడిచి తృప్తి నొందెదరు ఆమె మహిమాతిశయము అనుభవించుచు ఆనందించె దరు. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు ఆలకించుడి, నదివలె సమాధానమును ఆమెయొద్దకు పారజేయుదును మీరు జనముల ఐశ్వర్యము అనుభవించునట్లు ఒడ్డుమీద పొర్లిపారు జలప్రవాహమువలె మీయొద్దకు దానిని రాజేతును మీరు చంకను ఎత్తికొనబడెదరు మోకాళ్లమీద ఆడింపబడెదరు. ఒకని తల్లి వానిని ఆదరించునట్లు నేను మిమ్మును ఆద రించెదను యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు. మీరు చూడగా మీ హృదయము ఉల్లసించును మీ యెముకలు లేతగడ్డివలె బలియును యెహోవా హస్తబలము ఆయన సేవకులయెడల కను పరచబడును ఆయన తన శత్రువులయెడల కోపము చూపును.
- 2 Corinthians 2:3 2 కొరింథీయులకు 2:3నేను వచ్చి నప్పుడు ఎవరివలన నేను సంతోషము పొందతగినదో, వారివలన నాకు దుఃఖము కలుగకుండవలెనని యీ సంగతి మీకు వ్రాసితిని. మరియు నా సంతోషము మీ అందరి సంతోషమేయని మీ అందరియందు నమ్మకము కలిగి యీలాగు వ్రాసితిని.