Romans · chapter 12 · verse 9
Romans 12:9 in Telugu
మీ ప్రేమ నిష్కపటమైనదై యుండవలెను. చెడ్డదాని నసహ్యించుకొని మంచిదానిని హత్తుకొని యుండుడి.
Mee prema nishkapatamainadai yundavalenu. Cheddadaani nasahyinchukoni manchidaanini hattukoni yundudi.
Romans 12:9 in English
- King James Version (KJV)
- [Let] love be without dissimulation. Abhor that which is evil; cleave to that which is good.
- World English Bible (WEB)
- Let love be without hypocrisy. Abhor that which is evil. Cling to that which is good.
- American Standard Version (ASV)
- Let love be without hypocrisy. Abhor that which is evil; cleave to that which is good.
- Bible in Basic English (BBE)
- Let love be without deceit. Be haters of what is evil; keep your minds fixed on what is good.
- Darby Translation (DBY)
- Let love be unfeigned; abhorring evil; cleaving to good:
- Webster's Bible (WBS)
- [Let] love be without dissimulation. Abhor that which is evil; cleave to that which is good.
- Young's Literal Translation (YLT)
- The love unfeigned: abhorring the evil; cleaving to the good;
Read in context
- 7ప్రవచనవరమైతే విశ్వాస పరిమాణముచొప్పున ప్రవచింతము;పరిచర్యయైతే పరిచర్యలోను,
- 8బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పనికలిగియుందము. పంచిపెట్టువాడు శుద్ధమనస్సుతోను, పైవిచారణ చేయువాడు జాగ్రత్తతోను, కరుణించు వాడు సంతోషముతోను పని జరిగింపవలెను.
- 9మీ ప్రేమ నిష్కపటమైనదై యుండవలెను. చెడ్డదాని నసహ్యించుకొని మంచిదానిని హత్తుకొని యుండుడి.
- 10సహోదర ప్రేమ విషయములో ఒకనియందొకడు అనురాగముగల వారై, ఘనతవిషయములో ఒకని నొకడు గొప్పగా ఎంచుకొనుడి.
- 11ఆసక్తి విషయములో మాంద్యులు కాక, ఆత్మయందు తీవ్రతగలవారై ప్రభువును సేవించుడి.
Cross references
- Psalm 34:14 కీర్తనలు 34:14కీడు చేయుట మాని మేలు చేయుము సమాధానము వెదకి దాని వెంటాడుము.
- 1 Peter 4:8 1 పేతురు 4:8ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటె ముఖ్యముగా ఒకనియెడల ఒకడు మిక్కటమైన ప్రేమగలవారై యుండుడి.
- 1 Timothy 1:5 1 తిమోతికి 1:5ఉపదేశసారమేదనగా, పవిత్ర హృదయమునుండియు, మంచి మనస్సాక్షినుండియు, నిష్కపటమైన విశ్వాసము నుండియు కలుగు ప్రేమయే.
- 1 John 3:18–20 1 యోహాను 3:18–20చిన్న పిల్లలారా, మాటతోను నాలుకతోను కాక క్రియతోను సత్యముతోను ప్రేమింతము. ఇందు వలన మనము సత్యసంబంధులమని యెరుగుదుము. దేవుడు మన హృదయముకంటె అధికుడై, సమస్తమును ఎరిగి యున్నాడు గనుక మన హృదయము ఏ యే విషయములలో మనయందు దోషారోపణ చేయునో ఆ యా విషయములలో ఆయన యెదుట మన హృదయములను సమ్మతి పరచుకొందము. ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయనియెడల దేవుని యెదుట ధైర్యముగలవారమగుదుము.
- 1 Peter 3:10–11 1 పేతురు 3:10–11జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరు వాడు చెడ్డదాని పలుకకుండ తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండ తన పెదవులను కాచుకొనవలెను. అతడు కీడునుండి తొలగి మేలుచేయవలెను, సమాధానమును వెదకి దాని వెంటాడవలెను.
- 1 Thessalonians 5:21 1 థెస్సలొనీకయులకు 5:21సమస్తమును పరీక్షించి మేలైనదానిని చేపట్టుడి.
- Psalm 101:3 కీర్తనలు 101:3నా కన్నులయెదుట నేను ఏ దుష్కార్యమును ఉంచు కొనను భక్తిమార్గము తొలగినవారి క్రియలు నాకు అసహ్యములు అవి నాకు అంటనియ్యను
- Amos 5:15 ఆమోసు 5:15కీడును ద్వేషించి మేలును ప్రేమించుచు, గుమ్మములలో న్యాయము స్థిరపరచుడి; ఒక వేళ దేవుడును సైన్యముల కధిపతియునగు యెహోవా యోసేపు సంతతిలో శేషించినవారియందు కనికరించును.
- 1 Peter 1:22 1 పేతురు 1:22మీరు సత్యమునకు విధేయులవుటచేత మీ మనస్సులను పవిత్రపరచుకొనిన వారైయుండి, యొకనినొకడు హృదయపూర్వకముగాను మిక్కటము గాను ప్రేమించుడి.
- Hebrews 12:14 హెబ్రీయులకు 12:14అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి యుండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధతలేకుండ ఎవడును ప్రభువును చూడడు.
- Psalm 97:10 కీర్తనలు 97:10యెహోవాను ప్రేమించువారలారా, చెడుతనమును అసహ్యించుకొనుడి తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు. భక్తిహీనులచేతిలోనుండి ఆయన వారిని విడిపించును.
- Proverbs 8:13 సామెతలు 8:13యెహోవాయందు భయభక్తులు గలిగియుండుట చెడుతనము నసహ్యించుకొనుటయే. గర్వము అహంకారము దుర్మార్గత కుటిలమైన మాటలు నాకు అసహ్యములు.