Song of Solomon · chapter 6 · verse 4
Song of Solomon 6:4 in Telugu
నా సఖీ, నీవు తిర్సాపట్టణమువలె సుందరమైన దానవు. యెరూషలేమంత సౌందర్యవంతురాలవు టెక్కెముల నెత్తిన సైన్యమువలె భయము పుట్టించు దానవు
Naa sakhee, neevu tirsaapattanamuvale sundaramaina daanavu. Yerooshalemanta saundaryavanturaalavu tekkemula nettina sainyamuvale bhayamu puttinchu daanavu
Song of Solomon 6:4 in English
- King James Version (KJV)
- Thou [art] beautiful, O my love, as Tirzah, comely as Jerusalem, terrible as [an army] with banners.
- World English Bible (WEB)
- You are beautiful, my love, as Tirzah, lovely as Jerusalem, awesome as an army with banners.
- American Standard Version (ASV)
- Thou art fair, O my love, as Tirzah, Comely as Jerusalem, Terrible as an army with banners.
- Bible in Basic English (BBE)
- You are beautiful, O my love, as Tirzah, as fair as Jerusalem; you are to be feared like an army with flags.
- Darby Translation (DBY)
- Thou art fair, my love, as Tirzah, Comely as Jerusalem, Terrible as troops with banners:
- Webster's Bible (WBS)
- Thou [art] beautiful, O my love, as Tirzah, comely as Jerusalem, terrible as [an army] with banners.
- Young's Literal Translation (YLT)
- Fair [art] thou, my friend, as Tirzah, Comely as Jerusalem, Awe-inspiring as bannered hosts.
Read in context
- 2ఉద్యానవనమునందు మేపుటకును పద్మములను ఏరుకొనుటకును. నా ప్రియుడు తన ఉద్యానవనమునకు పోయెను పరిమళ పుష్పస్థానమునకు పోయెను.
- 3నేను పద్మములలో మేపుచున్న నా ప్రియునిదానను అతడును నావాడు.
- 4నా సఖీ, నీవు తిర్సాపట్టణమువలె సుందరమైన దానవు. యెరూషలేమంత సౌందర్యవంతురాలవు టెక్కెముల నెత్తిన సైన్యమువలె భయము పుట్టించు దానవు
- 5నీ కనుదృష్టి నామీద ఉంచకుము అది నన్ను వశపరచుకొనును నీ తలవెండ్రుకలు గిలాదు పర్వతముమీది మేకలమందను పోలియున్నవి.
- 6నీ పలువరుస కత్తెర వేయబడినవియు కడుగబడి యప్పుడే పైకి వచ్చినవియునై జోడుజోడు పిల్లలు కలిగి ఒకదానినైన పోగొట్టు కొనక సుఖముగానున్న గొఱ్ఱెల కదుపులను పోలియున్నవి.
Cross references
- Song of Solomon 6:10 పరమగీతము 6:10సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంత అందముగలదై సూర్యుని అంత స్వచ్ఛమును కళలునుగలదై వ్యూహితసైన్య సమభీకర రూపిణియునగు ఈమె ఎవరు?
- Psalm 48:2 కీర్తనలు 48:2ఉత్తరదిక్కున మహారాజు పట్టణమైన సీయోను పర్వతము రమ్యమైన యెత్తుగల చోట నుంచబడి సర్వభూమికి సంతోషకరముగా నున్నది
- 1 Kings 14:17 1 రాజులు 14:17అప్పుడు యరొ బాము భార్య లేచి వెళ్లిపోయి తిర్సా పట్టణమునకు వచ్చెను; ఆమె లోగిటి ద్వారపు గడపయొద్దకు రాగానే ఆ చిన్నవాడు చని పోయెను.
- Revelation 21:2 ప్రకటన 21:2మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధపట్టణము తన భర్తకొరకు అలంకరింపబడిన పెండ్లికుమార్తెవలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్దనుండి దిగి వచ్చుట చూచితిని.
- Lamentations 2:15 విలాపవాక్యములు 2:15త్రోవను వెళ్లువారందరు నిన్ను చూచి చప్పట్లు కొట్టెదరు వారు యెరూషలేము కుమారిని చూచి పరిపూర్ణ సౌందర్యముగల పట్టణమనియు సర్వ భూనివాసులకు ఆనందకరమైన నగరియనియు జనులు ఈ పట్టణమును గూర్చియేనా చెప్పిరి? అని యనుకొనుచు గేలిచేసి తల ఊచెదరు
- Psalm 50:2 కీర్తనలు 50:2పరిపూర్ణ సౌందర్యముగల సీయోనులోనుండి దేవుడు ప్రకాశించుచున్నాడు
- Song of Solomon 2:14 పరమగీతము 2:14బండసందులలో ఎగురు నా పావురమా, పేటుబీటల నాశ్రయించు నా పావురమా, నీ స్వరము మధురము నీ ముఖము మనోహరము నీ ముఖము నాకు కనబడనిమ్ము నీ స్వరము నాకు వినబడనిమ్ము.
- Song of Solomon 4:7 పరమగీతము 4:7నా ప్రియురాలా, నీవు అధికసుందరివి నీయందు కళంకమేమియు లేదు.
- Zechariah 12:3 జెకర్యా 12:3ఆ దినమందు నేను యెరూషలేమును సమస్తమైన జనులకు బరువైన రాయిగా చేతును, దానిని ఎత్తి మోయువారందరు మిక్కిలి గాయ పడుదురు, భూజనులందరును దానికి విరోధులై కూడు దురు.
- Song of Solomon 1:5 పరమగీతము 1:5యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లనిదాననైనను సౌందర్యవంతురాలను కేదారువారి గుడారములవలెను సొలొమోను నగరు తెరలవలెను నేను సౌందర్యవంతురాలను
- Psalm 144:4–8 కీర్తనలు 144:4–8నరులు వట్టి ఊపిరిని పోలియున్నారు వారి దినములు దాటిపోవు నీడవలె నున్నవి. యెహోవా, నీ ఆకాశమును వంచి దిగి రమ్ము పర్వతములు పొగ రాజునట్లు నీవు వాటిని ముట్టుము మెరుపులు మెరిపించి వారిని చెదరగొట్టుము నీ బాణములు వేసి వారిని ఓడగొట్టుము. పైనుండి నీ చెయ్యి చాచి నన్ను తప్పింపుము మహా జలములలోనుండి అన్యులచేతిలోనుండి నన్ను విడిపింపుము. వారి నోరు వట్టి మాటలాడుచున్నది వారి కుడిచేయి అబద్ధముతో కూడియున్నది.
- 1 Kings 15:21 1 రాజులు 15:21అది బయెషాకు వర్తమానము కాగా రామాపట్టణము కట్టుట మాని తిర్సాకు పోయి నివాసము చేసెను.