Zechariah · chapter 1 · verse 11
Zechariah 1:11 in Telugu
అవి గొంజిచెట్లమధ్యను నిలువబడిన యెహోవా దూతను చూచిమేము లోకమంతట తిరుగులాడివచ్చి యున్నాము; ఇదిగో లోకులందరు శాంతముకలిగి నిమ్మళ ముగా ఉన్నారని చెప్పెను.
Avi gonjichetlamadhyanu niluvabadina yehovaa dootanu choochimemu lokamantata tirugulaadivachchi yunnaamu; idigo lokulandaru shaantamukaligi nimmala mugaa unnaarani cheppenu.
Zechariah 1:11 in English
- King James Version (KJV)
- And they answered the angel of the LORD that stood among the myrtle trees, and said, We have walked to and fro through the earth, and, behold, all the earth sitteth still, and is at rest.
- World English Bible (WEB)
- They reported to the LORD’s angel who stood among the myrtle trees, and said, “We have walked back and forth through the earth, and behold, all the earth is at rest and in peace.”
- American Standard Version (ASV)
- And they answered the angel of Jehovah that stood among the myrtle-trees, and said, We have walked to and fro through the earth, and, behold, all the earth sitteth still, and is at rest.
- Bible in Basic English (BBE)
- And the man who was between the mountains, answering, said to the angel of the Lord, We have gone up and down through the earth, and all the earth is quiet and at rest.
- Darby Translation (DBY)
- And they answered the angel of Jehovah that stood among the myrtle-trees, and said, We have walked to and fro through the earth, and behold, all the earth sitteth still and is at rest.
- Webster's Bible (WBS)
- And they answered the angel of the LORD that stood among the myrtle-trees, and said, We have walked to and fro through the earth, and behold, all the earth sitteth still, and is at rest.
- Young's Literal Translation (YLT)
- And they answer the messenger of Jehovah who is standing between the myrtles, and say, 'We have walked up and down in the land, and lo, all the land is sitting still, and at rest.'
Read in context
- 9అప్పుడునా యేలినవాడా, యివి ఏమని నేనడుగగా నాతో మాటలాడు దూతఇవి ఏమి యైనది నేను నీకు తెలియజేతుననెను.
- 10అప్పుడు గొంజి చెట్లలో నిలువబడియున్నవాడు ఇవి లోకమంతటను తిరుగులాడుటకు యెహోవా పంపించిన గుఱ్ఱములని చెప్పెను.
- 11అవి గొంజిచెట్లమధ్యను నిలువబడిన యెహోవా దూతను చూచిమేము లోకమంతట తిరుగులాడివచ్చి యున్నాము; ఇదిగో లోకులందరు శాంతముకలిగి నిమ్మళ ముగా ఉన్నారని చెప్పెను.
- 12అందుకు యెహోవా దూతసైన్యములకధిపతియగు యెహోవా, డెబ్బది సంవత్సరములనుండి నీవు యెరూషలేముమీదను యూదా పట్టణములమీదను కోపముంచియున్నావే; యిక ఎన్నాళ్లు కనికరింపకయుందువు అని మనవిచేయగా
- 13యెహోవా నాతో మాటలాడిన దూతకు ఆదరణయైన మధుర వచనములతో ఉత్తరమిచ్చెను.
Cross references
- Zechariah 1:10 జెకర్యా 1:10అప్పుడు గొంజి చెట్లలో నిలువబడియున్నవాడు ఇవి లోకమంతటను తిరుగులాడుటకు యెహోవా పంపించిన గుఱ్ఱములని చెప్పెను.
- Psalm 103:20–21 కీర్తనలు 103:20–21యెహోవా దూతలారా, ఆయన ఆజ్ఞకులోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలశూరులారా, ఆయనను సన్నుతించుడి. యెహోవా సైన్యములారా, ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా, మీరందరు ఆయనను సన్నుతించుడి.
- Zechariah 1:8 జెకర్యా 1:8రాత్రి ఎఱ్ఱని గుఱ్ఱమునెక్కిన మనుష్యు డొకడు నాకు కనబడెను; అతడు లోయలోనున్న గొంజి చెట్లలో నిలువబడియుండగా అతని వెనుక ఎఱ్ఱని గుఱ్ఱము లును చుక్కలు చుక్కలుగల గుఱ్ఱములును తెల్లని గుఱ్ఱము లును కనబడెను.
- Zechariah 1:15 జెకర్యా 1:15నిమ్మళముగా ఉన్న అన్యజనులమీద నేను బహుగా కోపించుచున్నాను; ఏలయనగా నేను కొంచెము కోపపడగా కీడుచేయవలెనన్న తాత్పర్యముతో వారు సహాయులైరి.
- Matthew 24:30–31 మత్తయి 24:30–31అప్పుడు మనుష్యకుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్యకుమారుడు ప్రభావముతోను మహా మహిమతోను ఆకాశ మేఘారూఢుడై వచ్చుట చూచి, భూమిమీదనున్న సకల గోత్రములవారు రొమ్ము కొట్టుకొందురు. మరియు ఆయన గొప్పబూరతో తన దూతలను పంపును. వారు ఆకాశము యొక్క ఈ చివరనుండి ఆ చివరవరకు నలుదిక్కులనుండి ఆయన ఏర్పరచుకొనినవారిని పోగుచేతురు.
- Matthew 13:49 మత్తయి 13:49ఆలాగే యుగసమాప్తియందు జరుగును. దేవదూతలు వచ్చి నీతిమంతులలోనుండి దుష్టులను వేరుపరచి,
- Psalm 68:17 కీర్తనలు 68:17దేవుని రథములు సహస్రములు సహస్రసహస్రములు ప్రభువు వాటిలో నున్నాడు సీనాయి పరిశుద్ధమైనట్టు ఆ కొండ పరిశుద్ధమాయెను.
- Matthew 25:31 మత్తయి 25:31తన మహిమతో మనుష్యకుమారుడును ఆయనతో కూడ సమస్త దూతలును వచ్చునప్పుడు ఆయన తన మహిమగల సింహాసనముమీద ఆసీనుడై యుండును.
- Zechariah 6:7 జెకర్యా 6:7బలమైన గుఱ్ఱములు బయలువెళ్లి లోకమంతట సంచరింప ప్రయత్నింపగా, పోయి లోక మందంతట సంచరించుడని అతడు సెలవిచ్చెను గనుక అవి లోకమందంతట సంచరించుచుండెను.
- 1 Thessalonians 5:3 1 థెస్సలొనీకయులకు 5:3లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమియులేదని చెప్పుకొను చుండగా, గర్భిణిస్త్రీకి ప్రసవవేదన వచ్చునట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును గనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు
- Isaiah 14:7 యెషయా 14:7భూలోకమంతయు నిమ్మళించి విశ్రమించుచున్నది జనములు పాడసాగుదురు. నీవు పండుకొనినప్పటినుండి నరుకువాడెవడును మా మీదికి రాలేదని
- Matthew 13:41 మత్తయి 13:41మనుష్యకుమారుడు తన దూతలను పంపును; వారాయన రాజ్యములోనుండి ఆటంకములగు సకలమైనవాటిని దుర్నీతిపరులను సమకూర్చి అగ్నిగుండములో పడవేయుదురు.