Zechariah · chapter 1 · verse 17
Zechariah 1:17 in Telugu
నీవు ఇంకను ప్రకటన చేయవలసినదేమనగా ఇక నా పట్టణములు భాగ్యముతో మరి ఎక్కువగా నింపబడును, ఇంకను యెహోవా సీయోనును ఓదార్చును, యెరూషలేమును ఆయన ఇకను కోరుకొనును.
Neevu inkanu prakatana cheyavalasinademanagaa ika naa pattanamulu bhaagyamuto mari ekkuvagaa nimpabadunu, inkanu yehovaa seeyonunu odaarchunu, yerooshalemunu aayana ikanu korukonunu.
Zechariah 1:17 in English
- King James Version (KJV)
- Cry yet, saying, Thus saith the LORD of hosts; My cities through prosperity shall yet be spread abroad; and the LORD shall yet comfort Zion, and shall yet choose Jerusalem.
- World English Bible (WEB)
- “Proclaim further, saying, ‘The LORD of Armies says: “My cities will again overflow with prosperity, and the LORD will again comfort Zion, and will again choose Jerusalem.”’”
- American Standard Version (ASV)
- Cry yet again, saying, Thus saith Jehovah of hosts: My cities shall yet overflow with prosperity; and Jehovah shall yet comfort Zion, and shall yet choose Jerusalem.
- Bible in Basic English (BBE)
- And again let your voice be loud and say, This is what the Lord of armies has said: My towns will again be overflowing with good things, and again the Lord will give comfort to Zion and take Jerusalem for himself.
- Darby Translation (DBY)
- Cry further, saying, Thus saith Jehovah of hosts: My cities shall yet overflow with prosperity, and Jehovah shall yet comfort Zion, and shall yet choose Jerusalem.
- Webster's Bible (WBS)
- Cry yet, saying, Thus saith the LORD of hosts; My cities through prosperity shall yet be spread abroad; and the LORD shall yet comfort Zion, and shall yet choose Jerusalem.
- Young's Literal Translation (YLT)
- Again call, saying: Thus said Jehovah of Hosts, Again do my cities overflow from good, And Jehovah hath again comforted Zion, And He hath fixed again on Jerusalem.'
Read in context
- 15నిమ్మళముగా ఉన్న అన్యజనులమీద నేను బహుగా కోపించుచున్నాను; ఏలయనగా నేను కొంచెము కోపపడగా కీడుచేయవలెనన్న తాత్పర్యముతో వారు సహాయులైరి.
- 16కాబట్టి యెహోవా సెలవిచ్చున దేమనగావాత్సల్యముగలవాడనై నేను యెరూషలేము తట్టు తిరిగియున్నాను; అందులో నా మందిరము కట్ట బడును; యెరూషలేముమీద శిల్పకారులు నూలు సాగ లాగుదురు; ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు.
- 17నీవు ఇంకను ప్రకటన చేయవలసినదేమనగా ఇక నా పట్టణములు భాగ్యముతో మరి ఎక్కువగా నింపబడును, ఇంకను యెహోవా సీయోనును ఓదార్చును, యెరూషలేమును ఆయన ఇకను కోరుకొనును.
- 18అప్పుడు నేను తేరిచూడగా నాలుగు కొమ్ములు కన బడెను.
- 19ఇవి ఏమిటివని నేను నాతో మాటలాడు చున్న దూతనడుగగా అతడుఇవి యూదావారిని ఇశ్రా యేలువారిని యెరూషలేము నివాసులను చెదరగొట్టిన కొమ్ములనెను.
Cross references
- Isaiah 51:3 యెషయా 51:3యెహోవా సీయోనును ఆదరించుచున్నాడు దాని పాడైన స్థలములన్నిటిని ఆదరించి దాని అరణ్యస్థలములను ఏదెనువలె చేయుచున్నాడు దాని యెడారి భూములు యెహోవా తోటవలె నగు నట్లు చేయుచున్నాడు ఆనంద సంతోషములును కృతజ్ఞతాస్తుతియు సంగీతగానమును దానిలో వినబడును
- Zechariah 2:12 జెకర్యా 2:12మరియు తనకు స్వాస్థ్యమని యెహోవా ప్రతిష్ఠితమైన దేశములో యూదాను స్వతంత్రించు కొనును, యెరూషలేమును ఆయన ఇకను కోరుకొనును.
- 2 Chronicles 6:6 2 దినవృత్తాంతములు 6:6ఇప్పుడు నా నామముండుటకై యెరూషలేమును కోరుకొంటిని, నా జనులైన ఇశ్రాయేలీ యులమీద అధిపతిగా నుండుటకై దావీదును కోరుకొంటిని.
- Isaiah 14:1 యెషయా 14:1ఏలయనగా యెహోవా యాకోబునందు జాలిపడును ఇంకను ఇశ్రాయేలును ఏర్పరచుకొనును వారిని స్వదేశములో నివసింపజేయును పరదేశులు వారిని కలిసికొందురు వారు యాకోబు కుటుంబమును హత్తుకొనియుందురు
- Jeremiah 32:43–44 యిర్మీయా 32:43–44ఇది పాడై పోయెను, దానిలో నరులు లేరు, పశువులు లేవు, ఇది కల్దీయులచేతికి ఇయ్యబడియున్నదని మీరు చెప్పుచున్న ఈ దేశమున పొలములు విక్రయింపబడును. నేను వారిలో చెరపోయినవారిని రప్పింపబోవుచున్నాను గనుక బెన్యామీను దేశములోను యెరూషలేము ప్రాంతములలోను యూదా పట్టణములలోను మన్యములోని పట్టణములలోను దక్షిణదేశపు పట్టణములలోను మనుష్యులు క్రయమిచ్చి పొలములు కొందురు, క్రయపత్రములు వ్రాయించుకొందురు, ముద్రవేయుదురు, సాక్షులను పెట్టుదురు; ఇదే యెహోవా వాక్కు.
- Isaiah 54:8 యెషయా 54:8మహోద్రేకము కలిగి నిమిషమాత్రము నీకు విముఖుడ నైతిని నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును అని నీ విమోచకుడగు యెహోవా సెలవిచ్చు చున్నాడు.
- Psalm 69:35 కీర్తనలు 69:35దేవుడు సీయోనును రక్షించును ఆయన యూదా పట్టణములను కట్టించును జనులు అక్కడ నివసించెదరు అది వారివశమగును.
- Isaiah 61:4–6 యెషయా 61:4–6చాలకాలమునుండి పాడుగానున్న స్థలములను వారు కట్టుదురు పూర్వమున పాడైన స్థలములను కట్టుదురు పాడైన పట్టణములను నూతనముగా స్థాపింతురు తరతరములనుండి శిథిలములైయున్న పురములను బాగు చేయుదురు. అన్యులు నిలువబడి మీ మందలను మేపెదరు పరదేశులు మీకు వ్యవసాయకులును మీ ద్రాక్షతోట కాపరులును అగుదురు మీరు యెహోవాకు యాజకులనబడుదురు వారు మా దేవుని పరిచారకులని మనుష్యులు మిమ్మును గూర్చి చెప్పుదురు జనముల ఐశ్వర్యమును మీరు అనుభవింతురు వారి ప్రభావమును పొంది అతిశయింతురు
- Zephaniah 3:15–17 జెఫన్యా 3:15–17తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసియున్నాడు; మీ శత్రువులను ఆయన వెళ్లగొట్టి యున్నాడు; ఇశ్రాయేలుకు రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు, ఇక మీదట మీకు అపాయము సంభవింపదు. ఆ దినమున జనులు మీతో ఇట్లందురు యెరూషలేమూ, భయపడ కుము, సీయోనూ, ధైర్యము తెచ్చుకొనుము; నీ దేవుడైన యెహోవా నీమధ్య ఉన్నాడు; ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును, ఆయన బహు ఆనందముతో నీయందు సంతోషించును, నీయందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీయందలి సంతోషముచేత ఆయన హర్షించును.
- Isaiah 44:26 యెషయా 44:26నేనే నా సేవకుని మాట రూఢిపరచువాడను నా దూతల ఆలోచన నెరవేర్చువాడను యెరూషలేము నివాసస్థలమగుననియు యూదా నగరులనుగూర్చి అవి కట్టబడుననియు నేను ఆజ్ఞ ఇచ్చియున్నాను, దాని పాడైన స్థలములను బాగుచేయువాడను నేనే.
- Isaiah 66:13 యెషయా 66:13ఒకని తల్లి వానిని ఆదరించునట్లు నేను మిమ్మును ఆద రించెదను యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు.
- Ezekiel 36:10–11 యెహెజ్కేలు 36:10–11మీ మీద మానవ జాతిని, అనగా ఇశ్రాయేలీయులనందరిని, విస్తరింప జేసెదను, నా పట్టణములకు నివాసులు వత్తురు, పాడై పోయిన పట్టణములు మరల కట్టబడును. మీ మీద మనుష్యులను పశువులను విస్తరింపజేసెదను, అవి విస్తరించి అభివృద్ధి నొందును, పూర్వమున్నట్టు మిమ్మును నివాస స్థలముగా చేసి, మునుపటికంటె అధికమైన మేలు మీకు కలుగజేసెదను, అప్పుడు నేను యెహోవానై యున్నానని మీరు తెలిసికొందురు.