Zechariah · chapter 10 · verse 12
Zechariah 10:12 in Telugu
నేను వారిని యెహోవాయందు బలశాలురగా చేయుదును, ఆయన నామము స్మరించుచు వారు వ్యవహరింతురు;ఇదే యెహోవా వాక్కు.
Nenu vaarini yehovaayandu balashaaluragaa cheyudunu, aayana naamamu smarinchuchu vaaru vyavaharinturu;ide yehovaa vaakku.
Zechariah 10:12 in English
- King James Version (KJV)
- And I will strengthen them in the LORD; and they shall walk up and down in his name, saith the LORD.
- World English Bible (WEB)
- I will strengthen them in the LORD. They will walk up and down in his name,” says the LORD.
- American Standard Version (ASV)
- And I will strengthen them in Jehovah; and they shall walk up and down in his name, saith Jehovah.
- Bible in Basic English (BBE)
- And their strength will be in the Lord; and their pride will be in his name, says the Lord.
- Darby Translation (DBY)
- And I will strengthen them in Jehovah; and they shall walk in his name, saith Jehovah.
- Webster's Bible (WBS)
- And I will strengthen them in the LORD; and they shall walk up and down in his name, saith the LORD.
- Young's Literal Translation (YLT)
- And I have made them mighty in Jehovah, And in His name they walk up and down, An affirmation of Jehovah!
Read in context
- 10ఐగుప్తు దేశములోనుండి వారిని మరల రప్పించి అష్షూరు దేశ ములోనుండి సమకూర్చి, యెక్కడను చోటు చాలనంత విస్తారముగా గిలాదు దేశములోనికిని లెబానోను దేశము లోనికిని వారిని తోడుకొని వచ్చెదను.
- 11యెహోవా దుఃఖసముద్రమునుదాటి సముద్రతరంగములను అణచి వేయును, నైలునదియొక్క లోతైన స్థలములను ఆయన ఎండజేయును, అష్షూరీయుల అతిశయాస్పదము కొట్టివేయ బడును, ఐగుప్తీయులు రాజదండమును పోగొట్టుకొందురు.
- 12నేను వారిని యెహోవాయందు బలశాలురగా చేయుదును, ఆయన నామము స్మరించుచు వారు వ్యవహరింతురు;ఇదే యెహోవా వాక్కు.
Cross references
- Isaiah 41:10 యెషయా 41:10నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక యేర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పియున్నాను నీకు తోడైయున్నాను భయపడకుము నేను నీ దేవుడనై యున్నాను దిగులుపడకుము నేను నిన్ను బలపరతును నీకు సహాయము చేయువాడను నేనే నీతియను నా దక్షిణహస్తముతో నిన్ను ఆదుకొం దును.
- Isaiah 2:5 యెషయా 2:5యాకోబు వంశస్థులారా, రండి మనము యెహోవా వెలుగులో నడుచుకొందము.
- Zechariah 10:6 జెకర్యా 10:6నేను యూదా వారిని బలశాలురుగా చేసెదను, యోసేపు సంతతివారికి రక్షణ కలుగజేసి వారికి నివాసస్థలము ఇచ్చెదను, నేను వారియెడల జాలిపడుదును, నేను వారి దేవుడనైన యెహోవాను, నేను వారి మనవి ఆలకింపగా నేను వారిని విడిచిపెట్టిన సంగతి వారు మరచిపోవుదురు.
- Micah 4:5 మీకా 4:5సకల జనములు తమ తమ దేవతల నామము స్మరించుచు నడుచుకొందురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామము నెల్లప్పుడును స్మరించు కొందుము.
- 2 Timothy 2:1 2 తిమోతికి 2:1నా కుమారుడా, క్రీస్తుయేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము.
- Philippians 4:13 ఫిలిప్పీయులకు 4:13నన్ను బలపరచువానియందే నేను సమస్తమును చేయగలను.
- Colossians 3:17 కొలొస్సయులకు 3:17మరియు మాటచేత గాని క్రియచేత గాని, మీరేమి చేసినను ప్రభువైన యేసుద్వారా తండ్రియైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు, సమస్తమును ఆయన పేరట చేయుడి.
- Colossians 2:6 కొలొస్సయులకు 2:6కావున మీరు ప్రభువైన క్రీస్తుయేసును అంగీకరించిన విధముగా ఆయనయందు వేరుపారినవారై, యింటివలె కట్టబడుచు,
- 1 John 1:6–7 1 యోహాను 1:6–7ఆయనతోకూడ సహవాసముగలవారమని చెప్పుకొని చీకటిలో నడిచినయెడల మనమబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచినయెడల. మనము అన్యోన్యసహవాసము గలవారమై యుందుము; అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపమునుండి మనలను పవిత్రులనుగా చేయును.
- Isaiah 45:24 యెషయా 45:24యెహోవాయందే నీతి బలములున్నవని జనులు నన్ను గూర్చి చెప్పుదురు ఆయనయొద్దకే మనుష్యులు వచ్చెదరు ఆయనమీద కోపపడినవారందరు సిగ్గుపడుదురు
- Psalm 68:34–35 కీర్తనలు 68:34–35దేవునికి బలాతిశయము నారోపించుడి మహిమోన్నతుడై ఆయన ఇశ్రాయేలుమీద ఏలు చున్నాడు అంతరిక్షమున ఆయన బలాతిశయమున్నది తన పరిశుద్ధ స్థలములలో దేవుడు భీకరుడు ఇశ్రాయేలు దేవుడే తన ప్రజలకు బలపరాక్రమ ముల ననుగ్రహించుచున్నాడు దేవుడు స్తుతినొందును గాక.
- Genesis 24:40 ఆదికాండము 24:40అతడు ఎవని సన్నిధిలో నేను జీవించుచున్నానో ఆ యెహోవా నీతో కూడ తన దూతను పంపి నీ ప్రయాణము సఫలము చేయును గనుక నీవు నా వంశస్థులలో నా తండ్రి యింటనుండి నా కుమారునికి భార్యను తీసికొని వచ్చెదవు.