Zechariah · chapter 14 · verse 11
Zechariah 14:11 in Telugu
పట్టణము ఎత్తుగా కనబడును, జనులు అక్కడ నివసింతురు, శాపము ఇకను కలుగదు, యెరూష లేము నివాసులు నిర్భయముగా నివసింతురు.
Pattanamu ettugaa kanabadunu, janulu akkada nivasinturu, shaapamu ikanu kalugadu, yeroosha lemu nivaasulu nirbhayamugaa nivasinturu.
Zechariah 14:11 in English
- King James Version (KJV)
- And [men] shall dwell in it, and there shall be no more utter destruction; but Jerusalem shall be safely inhabited.
- World English Bible (WEB)
- Men will dwell therein, and there will be no more curse; but Jerusalem will dwell safely.
- American Standard Version (ASV)
- And men shall dwell therein, and there shall be no more curse; but Jerusalem shall dwell safely.
- Bible in Basic English (BBE)
- And there will be no more curse; but Jerusalem will be living without fear of danger.
- Darby Translation (DBY)
- And [men] shall dwell in it, and there shall be no more utter destruction; and Jerusalem shall dwell safely.
- Webster's Bible (WBS)
- And [men] shall dwell in it, and there shall be no more utter destruction; but Jerusalem shall be safely inhabited.
- Young's Literal Translation (YLT)
- And they have dwelt in her, And destruction is no more, And Jerusalem hath dwelt confidently.
Read in context
- 9యెహోవా సర్వలోక మునకు రాజైయుండును, ఆ దినమున యెహోవా ఒక్కడే అనియు, ఆయనకు పేరు ఒక్కటే అనియు తెలియ బడును.
- 10యెరూషలేము బెన్యామీను గుమ్మమునుండి మూల గుమ్మమువరకును, అనగా మొదటి గుమ్మపు కొన వరకును, హనన్యేలు గుమ్మమునుండి రాజు గానుగులవరకును వ్యాపించును, మరియు గెబనుండి యెరూషలేము దక్షిణపు తట్టుననున్న రిమ్మోనువరకు దేశమంతయు మైదానముగా ఉండును,
- 11పట్టణము ఎత్తుగా కనబడును, జనులు అక్కడ నివసింతురు, శాపము ఇకను కలుగదు, యెరూష లేము నివాసులు నిర్భయముగా నివసింతురు.
- 12మరియు యెహోవా తెగుళ్లుపుట్టించి యెరూషలేముమీద యుద్ధము చేసిన జనములనందరిని ఈలాగున మొత్తును; వారు నిలిచి యున్నపాటుననే వారి దేహములు కుళ్లిపోవును, వారి కన్నులు కను తొఱ్ఱలలోఉండియే కుళ్లిపోవును వారి నాలు కలు నోళ్లలో ఉండియే కుళ్లిపోవును.
- 13ఆ దినమున యెహోవా వారిలో గొప్ప కల్లోలము పుట్టింపగా వారందరు ఒకరి కొకరు విరోధులై ఒకరిమీదనొకరు పడుదురు.
Cross references
- Revelation 22:3 ప్రకటన 22:3ఇకమీదట శాపగ్రస్తమైనదేదియు దానిలో ఉండదు, దేవునియొక్కయు గొఱ్ఱెపిల్లయొక్కయు సింహాసనము దానిలో ఉండును.
- Jeremiah 23:5–6 యిర్మీయా 23:5–6యెహోవా ఈలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు రాబోవు దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించెదను; అతడు రాజై పరిపాలన చేయును, అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును, భూమిమీద నీతి న్యాయములను జరిగించును. అతని దినములలో యూదా రక్షణనొందును, ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును, యెహోవా మనకు నీతియని అతనికి పేరు పెట్టుదురు.
- Amos 9:15 ఆమోసు 9:15వారి దేశమందు నేను వారిని నాటుదును, నేను వారికిచ్చిన దేశములోనుండి వారు ఇక పెరికివేయబడరని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు.
- Revelation 21:4 ప్రకటన 21:4ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించి పోయెనని సింహాసనములోనుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని.
- Zechariah 8:8 జెకర్యా 8:8యెరూషలేములో నివసించుటకై వారిని తోడుకొని వచ్చెదను, వారు నా జనులై యుందురు, నేను వారికి దేవుడనై యుందును; ఇది నీతి సత్యములనుబట్టి జరుగును.
- Zechariah 2:4 జెకర్యా 2:4రెండవ దూతపరుగెత్తిపోయి యెరూషలేములో మనుష్యులును పశువులును విస్తార మైనందున అది ప్రాకారములు లేని మైదానముగా ఉండునని ఈ ¸యౌవనునికి తెలియజేయుమని మొదటి దూతకు ఆజ్ఞ ఇచ్చెను.
- Isaiah 26:1 యెషయా 26:1ఆ దినమున యూదాదేశములో జనులు ఈ కీర్తన పాడుదురు బలమైన పట్టణమొకటి మనకున్నది రక్షణను దానికి ప్రాకారములుగాను బురుజులుగాను ఆయన నియమించియున్నాడు.
- Jeremiah 31:40 యిర్మీయా 31:40శవములును బూడిదయు వేయబడు లోయ అంతయు కిద్రోను వాగువరకును గుఱ్ఱముల గవినివరకును తూర్పుదిశనున్న పొలములన్నియు యెహోవాకు ప్రతిష్ఠితములగును. అది మరి ఎన్నడును పెల్లగింపబడదు, పడద్రోయబడదు.
- Zechariah 8:4 జెకర్యా 8:4సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా అందరును వృద్ధత్వముచేత కఱ్ఱపట్టుకొని, వృద్ధులేమి వృద్ధురాండ్రేమి ఇంకను యెరూషలేము వీధు లలో కూర్చుందురు.
- Joel 3:20 యోవేలు 3:20ఈలాగున నేను ఇంతకుముందు ప్రతికారము చేయని ప్రాణదోషమునకై ప్రతికారము చేయుదును.
- Isaiah 66:22 యెషయా 66:22నేను సృజింపబోవు క్రొత్త ఆకాశమును క్రొత్త భూమియు లయముకాక నా సన్నిధిని నిలుచునట్లు నీ సంతతియు నీ నామమును నిలిచియుండును ఇదే యెహోవా వాక్కు.
- Numbers 21:3 సంఖ్యాకాండము 21:3యెహోవా ఇశ్రాయేలీయుల మాట ఆలకించి ఆ కానానీయులను అప్పగింపగా ఇశ్రాయేలీయులు వారిని వారి పట్టణములను నిర్మూలము చేసిరి. అందువలన ఆ చోటికి హోర్మా అను పేరు పెట్టబడెను.