Zechariah · chapter 8 · verse 17
Zechariah 8:17 in Telugu
తన పొరుగువాని మీద ఎవడును దుర్యోచన యోచింపకూడదు, అబద్ద ప్రమాణముచేయ నిష్టపడ కూడదు, ఇట్టివన్నియు నాకు అసహ్యములు; ఇదే యెహోవా వాక్కు.
Tana poruguvaani meeda evadunu duryochana yochimpakoodadu, abadda pramaanamucheya nishtapada koodadu, ittivanniyu naaku asahyamulu; ide yehovaa vaakku.
Zechariah 8:17 in English
- King James Version (KJV)
- And let none of you imagine evil in your hearts against his neighbour; and love no false oath: for all these [are things] that I hate, saith the LORD.
- World English Bible (WEB)
- and let none of you devise evil in your hearts against his neighbor, and love no false oath; for all these are things that I hate,” says the LORD.
- American Standard Version (ASV)
- and let none of you devise evil in your hearts against his neighbor; and love no false oath: for all these are things that I hate, saith Jehovah.
- Bible in Basic English (BBE)
- Let no one have any evil thought in his heart against his neighbour; and have no love for false oaths: for all these things are hated by me, says the Lord.
- Darby Translation (DBY)
- and let none of you imagine evil in your hearts against his neighbour; and love no false oath: for all these are [things] that I hate, saith Jehovah.
- Webster's Bible (WBS)
- And let none of you imagine evil in your hearts against his neighbor; and love no false oath: for all these [are things] that I hate, saith the LORD.
- Young's Literal Translation (YLT)
- And each the evil of his neighbour ye do not devise in your heart, And a false oath ye do not love, For all these [are] things that I have hated, An affirmation of Jehovah.'
Read in context
- 15ఈ కాలమున యెరూషలేమునకును యూదావారికిని మేలు చేయ నుద్దేశించుచున్నాను గనుక భయపడకుడి.
- 16మీరు చేయవలసిన కార్యము లేవనగా, ప్రతివాడు తన పొరుగు వానితో సత్యమే మాటలాడవలెను, సత్యమునుబట్టి సమాధానకరమైన న్యాయమునుబట్టి మీ గుమ్మములలో తీర్పు తీర్చవలెను.
- 17తన పొరుగువాని మీద ఎవడును దుర్యోచన యోచింపకూడదు, అబద్ద ప్రమాణముచేయ నిష్టపడ కూడదు, ఇట్టివన్నియు నాకు అసహ్యములు; ఇదే యెహోవా వాక్కు.
- 18మరియు సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను.
- 19సైన్యములకు అధిపతియగు యెహోవా ఆజ్ఞ ఇచ్చున దేమనగా నాలుగవ నెలలోని ఉపవాసము, అయిదవ నెలలోని ఉపవాసము, ఏడవ నెలలోని ఉపవాసము, పదియవ నెలలోని ఉపవాసము యూదా యింటివారికి సంతోషమును ఉత్సాహమును పుట్టించు మనోహరములైన పండుగలగును. కాబట్టి సత్యమును సమాధానమును ప్రియ ముగా ఎంచుడి.
Cross references
- Proverbs 6:16–19 సామెతలు 6:16–19యెహోవాకు అసహ్యములైనవి ఆరు గలవు ఏడును ఆయనకు హేయములు అవేవనగా, అహంకారదృష్టియు కల్లలాడు నాలుకయు నిరపరాధులను చంపు చేతులును దుర్యోచనలు యోచించు హృదయమును కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములును లేనివాటిని పలుకు అబద్ధసాక్షియు అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును.
- Proverbs 3:29 సామెతలు 3:29నీ పొరుగువాడు నీయొద్ద నిర్భయముగా నివసించునపుడు వానికి అపకారము కల్పింపవద్దు.
- Jeremiah 44:4 యిర్మీయా 44:4మరియు నేను పెందలకడ లేచి ప్రవక్తలైన నా సేవకులందరిని మీయొద్దకు పంపుచు, నాకసహ్యమైన యీ హేయకార్యమును మీరు చేయకుండుడి అని నేను చెప్పుచువచ్చితిని గాని
- Malachi 3:5 మలాకీ 3:5తీర్పు తీర్చుటకై నేను మీయొద్దకు రాగా, చిల్లంగివాండ్ర మీదను వ్యభిచారులమీదను అప్ర మాణికులమీదను, నాకు భయపడక వారి కూలివిషయ ములో కూలివారిని విధవరాండ్రను తండ్రిలేనివారిని బాధ పెట్టి పరదేశులకు అన్యాయము చేయువారిమీదను దృఢ ముగా సాక్ష్యము పలుకుదునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.
- Psalm 10:3 కీర్తనలు 10:3దుష్టులు తమ మనోభిలాషనుబట్టి అతిశయపడుదురు లోభులు యెహోవాను తిరస్కరింతురు
- Micah 2:1–3 మీకా 2:1–3మంచములమీద పరుండి మోసపు క్రియలు యోచించుచు దుష్కార్యములు చేయువారికి శ్రమ; ఆలాగు చేయుట వారి స్వాధీనములో నున్నది గనుక వారు ప్రొద్దు పొడవగానే చేయుదురు. వారు భూములు ఆశించి పట్టుకొందురు, ఇండ్లు ఆశించి ఆక్రమించు కొందురు, ఒక మనిషిని వాని కుటుంబమును ఇంటివానిని వాని స్వాస్థ్యమును అన్యాయముగా ఆక్రమింతురు. కాబట్టి యెహోవా సెలవిచ్చునదేమనగా - గొప్ప అపాయ కాలము వచ్చుచున్నది. దాని క్రిందనుండి తమ మెడ లను తప్పించుకొనలేకుండునంతగాను, గర్వముగా నడువ లేకుండునంతగాను ఈ వంశమునకు కీడుచేయ నుద్దేశించు చున్నాను.
- Psalm 5:5–6 కీర్తనలు 5:5–6డాంబికులు నీ సన్నిధిని నిలువలేరు పాపము చేయువారందరు నీకసహ్యులు అబద్ధమాడువారిని నీవు నశింపజేయుదువు కపటము చూపి నరహత్య జరిగించువారు యెహోవాకు అసహ్యులు.
- Jeremiah 4:14 యిర్మీయా 4:14యెరూషలేమా, నీవు రక్షింపబడునట్లు నీ హృదయములోనుండి చెడుతనము కడిగివేసికొనుము, ఎన్నాళ్లవరకు నీ దుష్టాభి ప్రాయములు నీకు కలిగియుండును?
- Habakkuk 1:13 హబక్కూకు 1:13నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కళంకమైనది గదా; బాధించువారుచేయు బాధను నీవు దృష్టింపజాలవు గదా; కపటులను నీవు చూచియు, దుర్మార్గులు తమకంటె ఎక్కువ నీతిపరులను నాశనము చేయగా నీవు చూచియు ఎందుకు ఊరకున్నావు?
- Matthew 12:35 మత్తయి 12:35సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను తెచ్చును; దుర్జనుడు తన చెడ్డ ధననిధిలోనుండి దుర్విషయములను తెచ్చును.
- Zechariah 5:3–4 జెకర్యా 5:3–4అందుకతడు నాతో ఇట్లనెనుఇది భూమియంతటిమీదికి బయలువెళ్లు శాపమే; దానికి ఒక ప్రక్కను వ్రాసియున్న దానినిబట్టి దొంగిలువారందరును కొట్టివేయబడుదురు; రెండవ ప్రక్కను వ్రాసియున్న దానినిబట్టి అప్రమాణికులందరును కొట్టివేయబడుదురు. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు నేనే దాని బయలుదేరజేయుచున్నాను; అది దొంగల యిండ్లలోను, నా నామమునుబట్టి అబద్ధప్రమాణము చేయువారి యిండ్లలోను ప్రవేశించి వారి యిండ్లలో ఉండి వాటిని వాటి దూలములను రాళ్లను నాశనము చేయును.
- Proverbs 6:14 సామెతలు 6:14వాని హృదయము అతిమూర్ఖ స్వభావముగలది వాడెల్లప్పుడు కీడు కల్పించుచు జగడములు పుట్టించును.