Zechariah · chapter 9 · verse 17
Zechariah 9:17 in Telugu
వారు ఎంతో క్షేమముగా ఉన్నారు, ఎంతో సొగసుగా ఉన్నారు; ధాన్యముచేత ¸యౌవనులును క్రొత్త ద్రాక్షా రసముచేత ¸యౌవన స్త్రీలును వృద్ధి నొందుదురు.
Vaaru ento kshemamugaa unnaaru, ento sogasugaa unnaaru; dhaanyamucheta ¸yauvanulunu krotta draakshaa rasamucheta ¸yauvana streelunu vruddhi nonduduru.
Zechariah 9:17 in English
- King James Version (KJV)
- For how great [is] his goodness, and how great [is] his beauty! corn shall make the young men cheerful, and new wine the maids.
- World English Bible (WEB)
- For how great is his goodness, and how great is his beauty! Grain will make the young men flourish, and new wine the virgins.
- American Standard Version (ASV)
- For how great is his goodness, and how great is his beauty! grain shall make the young men flourish, and new wine the virgins.
- Bible in Basic English (BBE)
- For how good it is and how beautiful! grain will make the young men strong and new wine the virgins.
- Darby Translation (DBY)
- For how great is his goodness, and how great is his beauty! Corn shall make the young men flourish, and new wine the maidens.
- Webster's Bible (WBS)
- For how great [is] his goodness, and how great [is] his beauty! corn shall make the young men cheerful, and new wine the maids.
- Young's Literal Translation (YLT)
- For what His goodness! and what His beauty! Corn the young men, And new wine the virgins — make fruitful!
Read in context
- 15సైన్యములకు అధిపతియగు యెహోవా వారిని కాపాడును గనుక వారు భక్షించుచు, వడిసెలరాళ్లను అణగద్రొక్కుచు త్రాగుచు, ద్రాక్షారసము త్రాగువారి వలె బొబ్బలిడుచు, బలిపశురక్త పాత్రలును బలిపీఠపు మూలలును నిండునట్లు రక్తముతో నిండియుందురు.
- 16నా జనులు యెహోవా దేశములో కిరీటమందలి రత్నములవలె నున్నారు గనుక కాపరి తన మందను రక్షించునట్లు వారి దేవుడైన యెహోవా ఆ దినమున వారిని రక్షించును.
- 17వారు ఎంతో క్షేమముగా ఉన్నారు, ఎంతో సొగసుగా ఉన్నారు; ధాన్యముచేత ¸యౌవనులును క్రొత్త ద్రాక్షా రసముచేత ¸యౌవన స్త్రీలును వృద్ధి నొందుదురు.
Cross references
- Isaiah 33:17 యెషయా 33:17అలంకరింపబడిన రాజును నీవు కన్నులార చూచె దవు బహు దూరమునకు వ్యాపించుచున్న దేశము నీకు కన బడును.
- Isaiah 62:8–9 యెషయా 62:8–9యెహోవా ఈలాగున ప్రమాణము చేసెను నిశ్చయముగా ఇకను నీ ధాన్యమును నీ శత్రువులకు ఆహారముగా నేనియ్యను నీవు ప్రయాసపడి తీసిన ద్రాక్షారసమును అన్యులు త్రాగరు. ధాన్యము కూర్చినవారే దాని భుజించి యెహోవాకు స్తుతి చెల్లింతురు పండ్లు కోసినవారే నా పరిశుద్ధాలయమంటపములలో దాని త్రాగుదురు.
- Revelation 5:12–14 ప్రకటన 5:12–14వారువధింపబడిన గొఱ్ఱెపిల్ల, శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. అంతట పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము, అనగా వాటిలోనున్న సర్వమును - సింహాసనాసీనుడై యున్నవానికిని గొఱ్ఱపిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాకని చెప్పుట వింటిని. ఆ నాలుగు జీవులు ఆమేన్ అని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కారము చేసిరి.
- Titus 3:4–7 తీతుకు 3:4–7మన రక్షకుడైన దేవునియొక్క దయయు, మానవులయెడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియలమూలముగా కాక, తన కనికరముచొప్పుననే పునర్జన్మసంబంధమైన స్నానము ద్వారాను, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను. మనమాయన కృపవలన నీతిమంతులమని తీర్చబడి, నిత్యజీవమునుగూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసులమగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మనమీద సమృద్ధిగా కుమ్మరించెను.
- 1 John 4:8–11 1 యోహాను 4:8–11దేవుడు ప్రేమాస్వరూపి, ప్రేమలేని వాడు దేవుని ఎరుగడు. మనము ఆయన ద్వారా జీవించు నట్లు, దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను; దీనివలన దేవుడు మనయందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి, మన పాపములకు ప్రాయశ్చిత్తమై యుండుటకు తన కుమారుని పంపెను; ఇందులో ప్రేమయున్నది. ప్రియులారా, దేవుడు మనలను ఈలాగు ప్రేమింపగా మనమొకనినొకడు ప్రేమింప బద్ధులమై యున్నాము.
- Psalm 50:2 కీర్తనలు 50:2పరిపూర్ణ సౌందర్యముగల సీయోనులోనుండి దేవుడు ప్రకాశించుచున్నాడు
- Exodus 15:11 నిర్గమకాండము 15:11యెహోవా, వేల్పులలో నీవంటివాడెవడు పరిశుద్ధతనుబట్టి నీవు మహానీయుడవు స్తుతికీర్తనలనుబట్టి పూజ్యుడవు అద్భుతములు చేయువాడవు నీవంటివాడెవడు
- Psalm 36:7 కీర్తనలు 36:7దేవా, నీ కృప యెంతో అమూల్యమైనది నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు.
- Psalm 31:19 కీర్తనలు 31:19నీయందు భయభక్తులుగలవారి నిమిత్తము నీవు దాచి యుంచిన మేలు యెంతో గొప్పది నరులయెదుట నిన్ను ఆశ్రయించువారి నిమిత్తము నీవు సిద్ధపరచిన మేలు ఎంతో గొప్పది.
- Song of Solomon 5:10 పరమగీతము 5:10నా ప్రియుడు ధవళవర్ణుడు రత్నవర్ణుడు పదివేలమంది పురుషులలో అతని గుర్తింపవచ్చును
- Psalm 90:17 కీర్తనలు 90:17మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద నుండును గాక మా చేతిపనిని మాకు స్థిరపరచుము మా చేతిపనిని స్థిరపరచుము.
- Song of Solomon 7:9 పరమగీతము 7:9నీ నోరు శ్రేష్టద్రాక్షారసమువలె నున్నది ఆ శ్రేష్ఠద్రాక్షారసము నా ప్రియునికి మధుర పానీయము అది నిద్రితుల యధరములు ఆడజేయును.