Skip to content
ThuthiThuthiThuthi

Betlehem Puramuna Chitrambu Kalige Song Lyricsబేత్లేహేం పురమున చిత్రంబు కలిగె

Betlehem Puramuna Chitrambu Kalige Lyrics in Telugu & English

Present

Chorus

బేత్లేహేం పురమున చిత్రంబు కలిగె

కర్తాది యేసు జన్మించినపుడు

అంధకారంపు పృథివి వీధులలో

మోదంపు మహిమ చోద్యంబుగానరే

ఉదయంపు తారల్ ముదమున బాడే

ఉదయించ యేసు ఈ పృథివిలోన

ముదమును గలిగె మరి సమాధానం

పదిలంబుతోడ పూజించ రండి

||బేత్లేహేం||

Betlehem Puramuna Chitrambu Kalige

Kartaadi Yesu Janminchinapudu

Andhakaarampu Pruthivi Veedhulalo

Modampu Mahima Chodyambugaanare

Udayampu Taaral Mudamuna Baade

Udayincha Yesu Ee Pruthivilona

Mudamunu Galige Mari Samaadhaanam

Padilambutoda Poojincha Randi

||Betlehen||

Verse 1

పరమును విడచి నరరూపమెత్తి

అరుదెంచి యేసు పరమ వైద్యుండై

నరుల దుఃఖములన్ తొలగించివేసి

పరలోక శాంతి స్థిరపరచె ప్రభువు

||బేత్లేహేం||

Paramunu Vidachi Nararoopametti

Arudenchi Yesu Parama Vaidyundai

Narula Duhkhamulan Tolaginchivesi

Paraloka Shaanti Sthiraparache Prabhuvu

||Betlehen||

Verse 2

నీదు చిత్తమును నాదు హృదయమున

ముదమున జేయ మదినెంతో యాశ

నీదు పాలనము పరమందు వలెనె

ఈ ధరణియందు జరుగంగ జూడ

||బేత్లేహేం||

Needu Chittamunu Naadu Hrudayamuna

Mudamuna Jeya Madinento Yaasha

Needu Paalanamu Paramandu Valene

Ee Dharaniyandu Jaruganga Jooda

||Betlehen||

Verse 3

దేవుని సన్నిధి దీనత నుండ

పావనయాత్మ పవిత్ర పరచున్

పావనుడేసు ప్రకాశమిచ్చి

జీవంబు నొసగి జీవించు నెదలో

||బేత్లేహేం||

Devuni Sannidhi Deenata Nunda

Paavanayaatma Pavitra Parachun

Paavanudesu Prakaashamichchi

Jeevambu Nosagi Jeevinchu Nedalo

||Betlehen||

Verse 4

గతించె రాత్రి ప్రకాశించె కాంతి

వితానముగ వికసించె నెల్ల

దూతల ధ్వనితో పతి యేసు క్రీస్తు

అతి ప్రేమతోడ అరుదెంచె నోహో

||బేత్లేహేం||

Gatinche Raatri Prakaashinche Kaanti

Vitaanamuga Vikasinche Nella

Dootala Dhvanito Pati Yesu Kreestu

Ati Prematoda Arudenche Noho

||Betlehen||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with B