Skip to content
ThuthiThuthiThuthi

Devaadi Devaa Prabhuvula Prabhoo Song Lyricsదేవాది దేవా ప్రభువుల ప్రభూ

Also searched as: devadi deva

Devaadi Devaa Prabhuvula Prabhoo Lyrics in Telugu & English

Present

Verse 1

దేవాది దేవా ప్రభువుల ప్రభూ

రాజుల రాజా హల్లెలూయ

Devaadi Devaa Prabhuvula Prabhoo

Raajula Raajaa Hallelooya

Verse 2

నీ రక్తముతో విమోచించి - నీ రక్తముతో సంపాదించి

పరలోక రాజ్య ప్రజలతో జేర్చి - పరలోక పాటన్ నా కొసగితివి

Nee Raktamuto Vimochinchi - Nee Raktamuto Sampaadinchi

Paraloka Raajya Prajalato Jerchi - Paraloka Paatan Naa Kosagitivi

Verse 3

జీవిత నావలో తుఫాను రేగ - భయపడకుడని అభయము నిచ్చి

జయప్రదముగా నన్ను నడిపించి - జయజీవితము నా కొసగుచున్న

Jeevita Naavalo Tuphaanu Rega - Bhayapadakudani Abhayamu Nichchi

Jayapradamugaa Nannu Nadipinchi - Jayajeevitamu Naa Kosaguchunna

Verse 4

పేరు పెట్టి నన్ ప్రేమతో పిలచి - కరుణతో నీ సొత్తుగా నన్ను జేసి

అరమర లేక నన్నాదరించి - పరలోక దర్శనంబిచ్చితివి

Peru Petti Nan Premato Pilachi - Karunato Nee Sottugaa Nannu Jesi

Aramara Leka Nannaadarinchi - Paraloka Darshanambichchitivi

Verse 5

మరణ పాత్రులం యిద్ధరణిలోన - దురిత ఋణముల స్మరణను మాన్పి

ఏర్పరచుకొంటివి నేర్పుతో మమ్ము - నీ రాజ్యమందు రాజులన్ జేసి

Marana Paatrulam Yiddharanilona - Durita Runamula Smarananu Maanpi

Erparachukontivi Nerputo Mammu - Nee Raajyamandu Raajulan Jesi

Verse 6

శోధనగాధల కష్టములలో - నా దుఃఖములలో నే నేడ్వకుండా

నీ దయ నాపై నిండార నింపి - ఓదార్చి నన్ను నీ దారినడుపు

Shodhanagaadhala Kashtamulalo - Naa Duhkhamulalo Ne Nedvakundaa

Nee Daya Naapai Nindaara Nimpi - Odaarchi Nannu Nee Daarinadupu

Verse 7

ప్రతి వత్సరము దయతోడ నింపున్ - ప్రభు జాడలు సారము జల్లున్

ప్రతి బీడునూ సారము చిలకన్ - ప్రతి పర్వతము ఆనందించున్

Prati Vatsaramu Dayatoda Nimpun - Prabhu Jaadalu Saaramu Jallun

Prati Beedunoo Saaramu Chilakan - Prati Parvatamu Aanandinchun

Verse 8

పరలోక పరశుద్ధ సంఘంబు యెదుట - సర్వశక్తిగల క్రీస్తుని యెదుట

పరలోక నూతన గీతము పాడ - జేర్చితివి నన్ నీ జనమునందు

Paraloka Parashuddha Sanghambu Yeduta - Sarvashaktigala Kreestuni Yeduta

Paraloka Nootana Geetamu Paada - Jerchitivi Nan Nee Janamunandu

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with D