Skip to content
ThuthiThuthiThuthi

Devara Nee Deevenalu Song Lyricsదేవర నీ దీవెనలు

పాట రచయిత: అల్లారి పెద్ద వీరాస్వామి

Devara Nee Deevenalu Lyrics in Telugu & English

Present

Verse 1

దేవర నీ దీవెనలు

ధారాళముగను వీరలపై

బాగుగ వేగమే దిగనిమ్ము

పావన యేసుని ద్వారగను (2)

Devara Nee Deevenalu

Dhaaraalamuganu Veeralapai

Baaguga Vegame Diganimmu

Paavana Yesuni Dvaaraganu (2)

Verse 2

దంపతులు దండిగ నీ

ధాత్రిలో వెలయుచు సంపదలన్

సొంపుగ నింపుగ పెంపగుచు

సహింపున వీరు సుఖించుటకై //దేవర నీ//

Dampatulu Dandiga Nee

Dhaatrilo Velayuchu Sampadalan

Sompuga Nimpuga Pempaguchu

Sahimpuna Veeru Sukhinchutakai //devara Nee//

Verse 3

ఈ కవను నీ కరుణన్

ఆకరు వరకును లోకములో

శోకము లేకయే ఏకముగా

బ్రాకటముగను జేకొనుము //దేవర నీ//

Ee Kavanu Nee Karunan

Aakaru Varakunu Lokamulo

Shokamu Lekaye Ekamugaa

Braakatamuganu Jekonumu //devara Nee//

Verse 4

ఇప్పగిది నెప్పుడును

గొప్పగు ప్రేమతో నొప్పుచు దా

మొప్పిన చొప్పున దప్పకను

మెప్పుగ బ్రతుకగ బంపు కృపన్ //దేవర నీ//

Ippagidi Neppudunu

Goppagu Premato Noppuchu Daa

Moppina Choppuna Dappakanu

Meppuga Bratukaga Bampu Krupan //devara Nee//

Verse 5

తాపములు పాపములు

మోపుగ వీరిపై రాకుండగా

గాపుగ బ్రాపుగ దాపునుండి

యాపదలన్నియు బాపుచును //దేవర నీ//

Taapamulu Paapamulu

Mopuga Veeripai Raakundagaa

Gaapuga Braapuga Daapunundi

Yaapadalanniyu Baapuchunu //devara Nee//

Verse 6

సాధులుగన్ జేయుటకై

శోధనలచే నీవు శోధింపగా

కదలక వదలక ముదమున నీ

పాదము దాపున బాదుకొనన్ //దేవర నీ//

Saadhulugan Jeyutakai

Shodhanalache Neevu Shodhimpagaa

Kadalaka Vadalaka Mudamuna Nee

Paadamu Daapuna Baadukonan //devara Nee//

Verse 7

మెండుగ భూమండలపు

గండములలో వీరుండగను

తండ్రిగ దండిగ నండనుండి

వెండియు వానిని ఖండించావే //దేవర నీ//

Menduga Bhoomandalapu

Gandamulalo Veerundaganu

Tandriga Dandiga Nandanundi

Vendiyu Vaanini Khandinchaave //devara Nee//

Verse 8

యిద్దరు వీరిద్దరును

శుద్ధులై నిన్ను సేవించుటకై

శ్రద్ధతో బుద్ధిగ సిధ్ధపడన్

దిద్దుము నీ ప్రియ బిడ్డలుగాన్ //దేవర నీ//

Yiddaru Veeriddarunu

Shuddhulai Ninnu Sevinchutakai

Shraddhato Buddhiga Sidhdhapadan

Diddumu Nee Priya Biddalugaan //devara Nee//

Verse 9

వాసిగ నీ దాసులము

చేసిన ఈ మొఱ్ఱల్ దీసికొని

మా సకలేశ్వర నీ సుతుడ

యేసుని పేరిట బ్రోవుమామేన్ //దేవర నీ//

Vaasiga Nee Daasulamu

Chesina Ee Morral Deesikoni

Maa Sakaleshvara Nee Sutuda

Yesuni Perita Brovumaamen //devara Nee//

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with D