Devuni Stutincha Randi Gata Sanvatsaramuna Kaapaaden Lyrics in Telugu & English
Chorus
దేవుని స్తుతించ రండి
గత సంవత్సరమున కాపాడెన్
కీడు మనలను చేరకను – కోటి
కీడుల నుండి కాపాడినట్టి – మహా
||దేవుని||
Devuni Stutincha Randi
Gata Sanvatsaramuna Kaapaaden
Keedu Manalanu Cherakanu – Koti
Keedula Nundi Kaapaadinatti – Mahaa
||Devuni||
Verse 1
కోట్లకొలది మరణించిరి
మన మిచ్చట చేరియున్నాము
కష్టముల బాపి మనల నింక
జగమున జీవితులుగా నుంచినట్టి – మహా
||దేవుని||
Kotlakoladi Maraninchiri
Mana Michchata Cheriyunnaamu
Kashtamula Baapi Manala Ninka
Jagamuna Jeevitulugaa Nunchinatti – Mahaa
||Devuni||
Verse 2
ఎన్ని కీడుల మనము చేసిన
నన్ని మెల్లను చేసెనుగా
నిరతము కాచి చక్కగాను
ప్రభు ప్రేమతో కాచినందున స్తుతిచేసి
||దేవుని||
Enni Keedula Manamu Chesina
Nanni Mellanu Chesenugaa
Niratamu Kaachi Chakkagaanu
Prabhu Premato Kaachinanduna Stutichesi
||Devuni||
Verse 3
ఏకముగా పాడి హర్షముతో
లెక్కలేని మేలులకై
ఆత్మ దేహములను బలిగా
నిపుడేసు కర్పించెద మేకముగా – చేరి
||దేవుని||
Ekamugaa Paadi Harshamuto
Lekkaleni Melulakai
Aatma Dehamulanu Baligaa
Nipudesu Karpincheda Mekamugaa – Cheri
||Devuni||
Verse 4
వత్సారంభముననిను
మే మొక్కటిగా నారాధింప
దైవ కుమారా కృపనిమ్ము
మా జీవిత కాలమంతయు పాడి – మహా
||దేవుని||
Vatsaarambhamunaninu
Me Mokkatigaa Naaraadhimpa
Daiva Kumaaraa Krupanimmu
Maa Jeevita Kaalamantayu Paadi – Mahaa
||Devuni||
Verse 5
భూమి యందలి మాయల నుండి
సైతానుని వలలో నుండి
ఆత్మతో నిను సేవింప
నిపు డేలుమనుచు బ్రతిమాలెదము – కూడి
||దేవుని||
Bhoomi Yandali Maayala Nundi
Saitaanuni Valalo Nundi
Aatmato Ninu Sevimpa
Nipu Delumanuchu Bratimaaledamu – Koodi
||Devuni||
Verse 6
ప్రతి సంవత్సరమును మము జూడుము
దుర్గములో మము చేర్చుమయ్యా
దాటునప్పుడు నీ సన్నిధిని – చూపి
ధైర్యమునిచ్చి ఓదార్చుమయ్యా – మహా
||దేవుని||
Prati Sanvatsaramunu Mamu Joodumu
Durgamulo Mamu Cherchumayyaa
Daatunappudu Nee Sannidhini – Choopi
Dhairyamunichchi Odaarchumayyaa – Mahaa
||Devuni||
Verse 7
స్తోత్రింతుము ప్రభువా నీ పదముల
సకలాశీర్వాదముల నిమ్ము
ప్రేమతో ప్రభుతో నుండ
నెట్టి యాపద లేక బ్రోవుమామెన్ – ప్రభు
||దేవుని||
Stotrintumu Prabhuvaa Nee Padamula
Sakalaasheervaadamula Nimmu
Premato Prabhuto Nunda
Netti Yaapada Leka Brovumaamen – Prabhu
||Devuni||
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.