Skip to content
ThuthiThuthiThuthi

Ennenno Melulu Chesina Devaa Naakenno Melulu Chesina Song Lyricsఎన్నెన్నో మేలులు చేసిన దేవా నాకెన్నో మేలులు చేసిన

Ennenno Melulu Chesina Devaa Naakenno Melulu Chesina Lyrics in Telugu & English

Present

Verse 1

ఎన్నెన్నో మేలులు చేసిన దేవా - నాకెన్నో మేలులు చేసిన దేవా (2)

నీ కేమి చెల్లింతును - నిన్నెలా పూజింతును (2)

నా స్తుతులనే ధూపముగా - ఈ స్తుతులనే ధూపముగా

మా స్తుతులనే ధూపముగా - చేసి అర్పింతు కానుకగా

||ఎన్నెన్నో||

Ennenno Melulu Chesina Devaa - Naakenno Melulu Chesina Devaa (2)

Nee Kemi Chellintunu - Ninnelaa Poojintunu (2)

Naa Stutulane Dhoopamugaa - Ee Stutulane Dhoopamugaa

Maa Stutulane Dhoopamugaa - Chesi Arpintu Kaanukagaa

||Ennenno||

Verse 2

కార్యాన్ని చేసావు - భారాన్ని తీసావు - ధైర్యాన్ని పెంచావయ్యా

మార్గాన్ని చూపావు - దుర్గంగ నిలిచావు - గమ్యాన్ని చేర్చావయా (2)

బహుశ్రమల మధ్యలోనా - మహోన్నతుడా తోడున్నావు (2)

నీకేమి చెల్లింతును - నిన్నెలా పూజింతును

||నా స్తుతులనే||

Kaaryaanni Chesaavu - Bhaaraanni Teesaavu - Dhairyaanni Penchaavayyaa

Maargaanni Choopaavu - Durganga Nilichaavu - Gamyaanni Cherchaavayaa (2)

Bahushramala Madhyalonaa - Mahonnatudaa Todunnaavu (2)

Neekemi Chellintunu - Ninnelaa Poojintunu

||Naa Stutulane||

Verse 3

విజయాన్ని పొందగా - విశ్వాసమిచ్చావు - విడిపించుచున్నావయ్యా

వింతైన ప్రేమతో - విసమంతా కడిగావు - విలువెంతో పెంచావయ్యా (2)

వాక్యముతో బలపరిచావు - వాగ్ధానము నెరవేర్చావు (2)

నీకేమి చెల్లింతును - నిన్నెలా పూజింతును

||నా స్తుతులనే||

Vijayaanni Pondagaa - Vishvaasamichchaavu - Vidipinchuchunnaavayyaa

Vintaina Premato - Visamantaa Kadigaavu - Viluvento Penchaavayyaa (2)

Vaakyamuto Balaparichaavu - Vaagdhaanamu Neraverchaavu (2)

Neekemi Chellintunu - Ninnelaa Poojintunu

||Naa Stutulane||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with E