Skip to content
ThuthiThuthiThuthi

Enni Maarlu Neevu Daiva Vaakyamunu Vini Song Lyricsఎన్ని మార్లు నీవు దైవ వాక్యమును విని

Enni Maarlu Neevu Daiva Vaakyamunu Vini Lyrics in Telugu & English

Present

Verse 1

ఎన్ని మార్లు నీవు దైవ వాక్యమును విని

తిన్ననైన మార్గములో నడువకుందువు?

చిన్ననాటి నుండి నీవు క్రైస్తవుడవని

నులివెచ్చని జీవితమును విడువనందువు? (2)

విశ్వాసీ, ఏది నీ సాక్ష్యము?

దేనిపై ఉన్నది నీ లక్ష్యము? (2)

యేసుపైన లేకుంటే నీ నిరీక్షణ

ఇంకెందుకు నీకు ఈ రక్షణ? (2)

||ఎన్ని మార్లు||

Enni Maarlu Neevu Daiva Vaakyamunu Vini

Tinnanaina Maargamulo Naduvakunduvu?

Chinnanaati Nundi Neevu Kraistavudavani

Nulivechchani Jeevitamunu Viduvananduvu? (2)

Vishvaasee, Edi Nee Saakshyamu?

Denipai Unnadi Nee Lakshyamu? (2)

Yesupaina Lekunte Nee Nireekshana

Inkenduku Neeku Ee Rakshana? (2)

||Enni Maarlu||

Verse 2

యేసు లేని జీవితం వ్యర్ధమని తెలిసినా

లోకమెప్పు కోసమే వెరచియున్నావా

క్రీస్తు వైపు సాగుతూ వెనుక తట్టు తిరిగితే

ఉప్పు శిలగ మిగిలెదవని మరచిపోయావా (2)

పాపమే వేరు చేసెను

దేవుని నుండి మనలనూ

సిలువ యాగమే దారి చూపెను

ఇకనైనా మార్చుకో నీ మనస్సునూ (2)

||విశ్వాసీ||

Yesu Leni Jeevitam Vyardhamani Telisinaa

Lokameppu Kosame Verachiyunnaavaa

Kreestu Vaipu Saagutoo Venuka Tattu Tirigite

Uppu Shilaga Migiledavani Marachipoyaavaa (2)

Paapame Veru Chesenu

Devuni Nundi Manalanoo

Siluva Yaagame Daari Choopenu

Ikanainaa Maarchuko Nee Manassunoo (2)

||Vishvaasee||

Verse 3

పాపానికి జీతము మరణమని తెలిసినా

ఇహలోక స్నేహమే పాపమని ఎరుగవా

ఎన్ని మార్లు తప్పినా ఒప్పుకుంటే చాలులే

పరలోకం చేరొచ్చనే భ్రమను విడువవా (2)

చేసిన ప్రతి పాపానికి

తీర్పు దినం ఉంది మరువకు

లేదు నీకు నిత్య జీవము

నీ జీవితం మార్పునొందే వరకు (2)

||విశ్వాసీ||

Paapaaniki Jeetamu Maranamani Telisinaa

Ihaloka Snehame Paapamani Erugavaa

Enni Maarlu Tappinaa Oppukunte Chaalule

Paralokam Cherochchane Bhramanu Viduvavaa (2)

Chesina Prati Paapaaniki

Teerpu Dinam Undi Maruvaku

Ledu Neeku Nitya Jeevamu

Nee Jeevitam Maarpunonde Varaku (2)

||Vishvaasee||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with E