Skip to content
ThuthiThuthiThuthi

Gorrepilla Vivaahotsava Song Lyricsగొఱ్ఱెపిల్ల వివాహోత్సవ

Also searched as: gorrepilla

Gorrepilla Vivaahotsava Lyrics in Telugu & English

Present

Verse 1

గొఱ్ఱెపిల్ల వివాహోత్సవ

సమయము వచ్చెను రండి

Gorrepilla Vivaahotsava

Samayamu Vachchenu Randi

Verse 2

సర్వాధి కారియు – సర్వోన్నతుండైన

మన తండ్రిని ఘనపరచి – మన ముత్సహించెదము

Sarvaadhi Kaariyu – Sarvonnatundaina

Mana Tandrini Ghanaparachi – Mana Mutsahinchedamu

Verse 3

సిద్ధపడెను వధువు – సుప్రకాశము గల

నిర్మల వస్త్రములతో – నలంకరించు కొనెన్

Siddhapadenu Vadhuvu – Suprakaashamu Gala

Nirmala Vastramulato – Nalankarinchu Konen

Verse 4

పరిశుద్ధుల నీతి – క్రియలే యా వస్త్రములు

గొఱ్ఱె పిల్ల రక్తములో శుద్ధి నొందిన వారు

Parishuddhula Neeti – Kriyale Yaa Vastramulu

Gorre Pilla Raktamulo Shuddhi Nondina Vaaru

Verse 5

తెల్లని గుర్రముపై కూర్చుండినవాడు

నమ్మకమై యున్నట్టి – పెండ్లి కుమారుడు

Tellani Gurramupai Koorchundinavaadu

Nammakamai Yunnatti – Pendli Kumaarudu

Verse 6

దేవుని వాక్యమను – నామము గలవాడు

రక్తములో ముంచిన – వస్త్రమున్ ధరియించె

Devuni Vaakyamanu – Naamamu Galavaadu

Raktamulo Munchina – Vastramun Dhariyinche

Verse 7

ప్రేమించి సంఘముకై – ప్రాణంబునిడె ప్రభువు

పరిశుద్ధ పరచుట కొరకై – తానప్పగించుకొనెన్

Preminchi Sanghamukai – Praanambunide Prabhuvu

Parishuddha Parachuta Korakai – Taanappaginchukonen

Verse 8

శ్రీయేసుక్రీస్తుండే – సంఘంబునకు శిరస్సు

వాక్య ఉదకముతోడ – శుద్ధిపరచుచుండె

Shreeyesukreestunde – Sanghambunaku Shirassu

Vaakya Udakamutoda – Shuddhiparachuchunde

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with G