Karuninchumu Naa Yesuvaa Kanikaramandaishvaryudaa Lyrics in Telugu & English
Verse 1
కరుణించుము నా యేసువా - కనికరమందైశ్వర్యుడా
Karuninchumu Naa Yesuvaa - Kanikaramandaishvaryudaa
Verse 2
రేయింబగళ్ళు నే నెలుగెత్తి మొరబెట్టు - ప్రార్థనకు చెవి యొగ్గుమా
Reyimbagallu Ne Nelugetti Morabettu - Praarthanaku Chevi Yoggumaa
Verse 3
నిత్యము మాకై విజ్ఞాపన చేయు - నిశీదరాత్రిన్ ప్రియుడా
ప్రేమపితా నేడు మీ ఎదుట ప్రార్థించే - ప్రియుల ప్రార్థన వినుమా
Nityamu Maakai Vijnyaapana Cheyu - Nisheedaraatrin Priyudaa
Premapitaa Nedu Mee Eduta Praarthinche - Priyula Praarthana Vinumaa
Verse 4
మా బంధు జనులు మా తల్లి దండ్రులు - మా ప్రియులు నశియించుట
చూచి సహింపక కన్నీటితో చేయు మా ప్రార్థన వినుమా
Maa Bandhu Janulu Maa Talli Dandrulu - Maa Priyulu Nashiyinchuta
Choochi Sahimpaka Kanneetito Cheyu Maa Praarthana Vinumaa
Verse 5
నీనెవె పట్టణ దుర్గతిని జూచి - కరుణించి కాపాడితివే
యోనా మొరకొసగిన ఆలోచన నా కొసగ - నా బీదమనవి వినుమా
Neeneve Pattana Durgatini Joochi - Karuninchi Kaapaaditive
Yonaa Morakosagina Aalochana Naa Kosaga - Naa Beedamanavi Vinumaa
Verse 6
శ్రమలెన్నో సహించి రక్షించితివే - ఇవియన్నియు వ్యర్థంబౌనా?
అంజూరపు చెట్టుకై ప్రార్థించినా యట్టి ఆ ప్రార్థన వినుమా
Shramalenno Sahinchi Rakshinchitive - Iviyanniyu Vyarthambaunaa?
Anjoorapu Chettukai Praarthinchinaa Yatti Aa Praarthana Vinumaa
Verse 7
శోధన నుండి రక్షించితివే - సొదొమలో భక్తుని
అబ్రాహాం ఆనాడు విన్నపించినట్టి - ఆది ప్రార్థన వినుమా
Shodhana Nundi Rakshinchitive - Sodomalo Bhaktuni
Abraahaam Aanaadu Vinnapinchinatti - Aadi Praarthana Vinumaa
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.