Skip to content
ThuthiThuthiThuthi

Krupaa Sinhaasanaaseenudaa Ihaparamulalo Stotrarhudaa Song Lyricsకృపా సింహాసనాసీనుడా ఇహపరములలో స్తోత్రర్హుడా

Krupaa Sinhaasanaaseenudaa Ihaparamulalo Stotrarhudaa Lyrics in Telugu & English

Present

Verse 1

కృపా సింహాసనాసీనుడా - ఇహపరములలో స్తోత్రర్హుడా

ప్రభావం మహత్యం బలసౌందర్యం నీవే (2)

నా ఆరాధనా - ఆనందము - ఆశ్రయము నీవేకదా (2)

Krupaa Sinhaasanaaseenudaa - Ihaparamulalo Stotrarhudaa

Prabhaavam Mahatyam Balasaundaryam Neeve (2)

Naa Aaraadhanaa - Aanandamu - Aashrayamu Neevekadaa (2)

Verse 2

నీ బలిపీఠము చెంతా - పిచ్చుకులకు నివాసము దొరికెను

నీ మందిరములోని మేలులచే - మేము తృప్తిపొందెదము (2)

నీ మందిరములో - నివసించువారు ధన్యులు

నిత్యము నిన్నే స్తుతియించెదరు

Nee Balipeethamu Chentaa - Pichchukulaku Nivaasamu Dorikenu

Nee Mandiramuloni Melulache - Memu Truptipondedamu (2)

Nee Mandiramulo - Nivasinchuvaaru Dhanyulu

Nityamu Ninne Stutiyinchedaru

Verse 3

నీ సన్నిధిలో నాకు - సంపూర్ణ సంతోషము కలదు

నీ చల్లని చేతినీడలో నిత్యము సేదతీరెదను (2)

నీ సన్నిధిలో నివసించువారు భాగ్యవంతులు

నిత్యము నిన్నే సేవించెదరు

Nee Sannidhilo Naaku - Sampoorna Santoshamu Kaladu

Nee Challani Chetineedalo Nityamu Sedateeredanu (2)

Nee Sannidhilo Nivasinchuvaaru Bhaagyavantulu

Nityamu Ninne Sevinchedaru

Verse 4

నీ జీవ మార్గములో - జీవింతును నీ సాక్షిగా

నీ మహా బాహుబలముతో సియోనుకు నడిపించెదవు (2)

నీ గుడారములో నివసించువారు శ్రేష్ఠులు

నిత్యము నిన్నే ఆరాధించెదరు

Nee Jeeva Maargamulo - Jeevintunu Nee Saakshigaa

Nee Mahaa Baahubalamuto Siyonuku Nadipinchedavu (2)

Nee Gudaaramulo Nivasinchuvaaru Shreshthulu

Nityamu Ninne Aaraadhinchedaru

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with K