Ninu Chere Pratee Kshanam Prabhaatame Naalo Lyrics in Telugu & English
Verse 1
నిను చేరే ప్రతీ క్షణం ప్రభాతమే నాలో
స్మరింతునూ నీ నామం నిరంతరం యేసు
Ninu Chere Pratee Kshanam Prabhaatame Naalo
Smarintunoo Nee Naamam Nirantaram Yesu
Verse 2
నీ పిలుపే నా కోసం - నీ పలుకే ఆధారం
నీకే ఆరాధనా
కన్నుల్లో నీ రూపం - కనిపించే నా దైవం
నిన్ను నే చేరగా
నీ ప్రేమే మాధుర్యం - నడిపించే నా దీపం
నీవు నా తోడుగా
నీ వరమే ఈ స్నేహం - నాతోనే కలకాలం
యేసయ్య నా రక్షకా
వేవేల స్తోత్రాలతో నిన్ను కీర్తింతును
ఆనంద గానాలతో నిన్ను స్తుతియింతును
Nee Pilupe Naa Kosam - Nee Paluke Aadhaaram
Neeke Aaraadhanaa
Kannullo Nee Roopam - Kanipinche Naa Daivam
Ninnu Ne Cheragaa
Nee Preme Maadhuryam - Nadipinche Naa Deepam
Neevu Naa Todugaa
Nee Varame Ee Sneham - Naatone Kalakaalam
Yesayya Naa Rakshakaa
Vevela Stotraalato Ninnu Keertintunu
Aananda Gaanaalato Ninnu Stutiyintunu
Verse 3
నీ తలపే నా ధ్యానం - నా మనసే నీ సొంతం
నిన్ను ప్రేమింతును
నీతోనే సహవాసం - నను కోరే అనురాగం
యేసయ్య నా ప్రాణమా
నీతోనే చిరకాలం - సాగాలి నా పయనం
గమ్యమే నీవుగా
నీ ప్రేమే అపురూపం - మన్నించే మమకారం
నీవే నా ప్రేరణ
ఏరీతి నే పాడనూ నీదు ఘన ప్రేమను
యేసయ్య నీ సేవలో నేను తరియింతును
Nee Talape Naa Dhyaanam - Naa Manase Nee Sontam
Ninnu Premintunu
Neetone Sahavaasam - Nanu Kore Anuraagam
Yesayya Naa Praanamaa
Neetone Chirakaalam - Saagaali Naa Payanam
Gamyame Neevugaa
Nee Preme Apuroopam - Manninche Mamakaaram
Neeve Naa Prerana
Ereeti Ne Paadanoo Needu Ghana Premanu
Yesayya Nee Sevalo Nenu Tariyintunu
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.