Skip to content
ThuthiThuthiThuthi

O Manasaa Krungipokumaa Krupa Kalugunu Nireekshinchumaa Song Lyricsఓ మనసా కృంగిపోకుమా కృప కలుగును నిరీక్షించుమా

O Manasaa Krungipokumaa Krupa Kalugunu Nireekshinchumaa Lyrics in Telugu & English

Present

Verse 1

ఓ.. మనసా కృంగిపోకుమా

కృప కలుగును నిరీక్షించుమా (2)

తోడున్నానని నడిపించువాడు

దీవిస్తానని పలికినవాడు (2)

విడువడు ఎడబాయడు యేసయ్యా

ఘనపరచి హెచ్చించును నీ స్థితిని (2)

O.. Manasaa Krungipokumaa

Krupa Kalugunu Nireekshinchumaa (2)

Todunnaanani Nadipinchuvaadu

Deevistaanani Palikinavaadu (2)

Viduvadu Edabaayadu Yesayyaa

Ghanaparachi Hechchinchunu Nee Sthitini (2)

Verse 2

ఆశలే కనుమరుగై ఓటమే అలవాటై

అవమానాలతో కుమిలిపోతివా

గమ్యమే తెలియక ఒంటరై నిలువగా

ఎందుకీ బ్రతుకనీ విసిగిపోతివా

తోడైన యేసయ్యా

శ్రమలకొలిమిలో నీతో నడచును

దుఃఖించకే మనసా

వేదనలన్నీ దీవెనలుగ మారును

విడువడు ఎడబాయడు యేసయ్యా

సమకూర్చును సమస్తము నీ మేలుకై (2)

Aashale Kanumarugai Otame Alavaatai

Avamaanaalato Kumilipotivaa

Gamyame Teliyaka Ontarai Niluvagaa

Endukee Bratukanee Visigipotivaa

Todaina Yesayyaa

Shramalakolimilo Neeto Nadachunu

Duhkhinchake Manasaa

Vedanalannee Deevenaluga Maarunu

Viduvadu Edabaayadu Yesayyaa

Samakoorchunu Samastamu Nee Melukai (2)

Verse 3

దర్శనమే భారమై విశ్వాసమే మరుగై

దీవేనే లేదని? సోలిపోతివా

సొంతవారే శత్రువులై అసూయతో నిండి

విరోధముగ లేచిన మూగబోతివా

దీవించు యేసయ్యా

రెండంతలుగా నీకు మేలు చేయును

చింతించకే మనసా

అణచబడిన నిన్ను అధిపతిగా చేయును

విడువడు ఎడబాయడు యేసయ్యా

వాగ్దానము నేరవేర్చును నిశ్చయము (2)

Darshaname Bhaaramai Vishvaasame Marugai

Deevene Ledani? Solipotivaa

Sontavaare Shatruvulai Asooyato Nindi

Virodhamuga Lechina Moogabotivaa

Deevinchu Yesayyaa

Rendantalugaa Neeku Melu Cheyunu

Chintinchake Manasaa

Anachabadina Ninnu Adhipatigaa Cheyunu

Viduvadu Edabaayadu Yesayyaa

Vaagdaanamu Neraverchunu Nishchayamu (2)

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with O