O Kreestu Sanghamaa Parishuddha Sanghamaa Lyrics in Telugu & English
Verse 1
ఓ క్రీస్తు సంఘమా, పరిశుద్ధ సంఘమా
ప్రభువు నామములో సాగే అనుబంధమా
ఓ ప్రియ సంఘమా, యేసయ్య దేహమా
ఓ కంట కన్నీరు తగదు సహవాసమా
ప్రతి కష్టము మనము పంచుకుందాము
కలిసి అందరము వేడుకుందాము (2)
||ఓ క్రీస్తు||
O Kreestu Sanghamaa, Parishuddha Sanghamaa
Prabhuvu Naamamulo Saage Anubandhamaa
O Priya Sanghamaa, Yesayya Dehamaa
O Kanta Kanneeru Tagadu Sahavaasamaa
Prati Kashtamu Manamu Panchukundaamu
Kalisi Andaramu Vedukundaamu (2)
||O Kreestu||
Verse 2
మనమంతా కలిసి ఆ దేవుని దేహము
తండ్రి చిత్తముగా ఏర్పడిన సంఘము (2)
ఏ భాగము శ్రమ పడినా కలిగెను వేదన
ఒక్కరికి ఘనతయినా అందరికి ఆదరణ (2)
||ప్రతి కష్టము||
Manamantaa Kalisi Aa Devuni Dehamu
Tandri Chittamugaa Erpadina Sanghamu (2)
E Bhaagamu Shrama Padinaa Kaligenu Vedana
Okkariki Ghanatayinaa Andariki Aadarana (2)
||Prati Kashtamu||
Verse 3
సాటి సోదరులు శ్రమల పాలైనపుడు
సాతాను శక్తులచే శోధింపబడినపుడు (2)
ధైర్యమును నింపాలి, విశ్వాసము పెంచాలి
ఎడతెగక ప్రార్థించి శోధనను గెలవాలి (2)
||ప్రతి కష్టము||
Saati Sodarulu Shramala Paalainapudu
Saataanu Shaktulache Shodhimpabadinapudu (2)
Dhairyamunu Nimpaali, Vishvaasamu Penchaali
Edategaka Praarthinchi Shodhananu Gelavaali (2)
||Prati Kashtamu||
Verse 4
శ్రమలు పొందేవారు అవిధేయులు కారు
విశ్వాసము పెంచుకొని దేవునిలో ఎదిగేరు (2)
శాంతమును పాటించి, దేవునిలో వీక్షించి
పంచాలి ఓదార్పు వదిలేసి మన తీర్పు (2)
||ప్రతి కష్టము||
Shramalu Pondevaaru Avidheyulu Kaaru
Vishvaasamu Penchukoni Devunilo Edigeru (2)
Shaantamunu Paatinchi, Devunilo Veekshinchi
Panchaali Odaarpu Vadilesi Mana Teerpu (2)
||Prati Kashtamu||
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.