Skip to content
ThuthiThuthiThuthi

Pallavarapu Kondalapaina Prabhudaasulu Praarthimpaganu Song Lyricsపల్లవరపు కొండలపైన ప్రభుదాసులు ప్రార్థింపగను

Pallavarapu Kondalapaina Prabhudaasulu Praarthimpaganu Lyrics in Telugu & English

Present

Verse 1

పల్లవరపు కొండలపైన

ప్రభుదాసులు ప్రార్థింపగను

ఆహా పౌలుకు చూపిన రీతిన్

పరలోక సంఘదర్శనమిచ్చెన్ (2)

Pallavarapu Kondalapaina

Prabhudaasulu Praarthimpaganu

Aahaa Pauluku Choopina Reetin

Paraloka Sanghadarshanamichchen (2)

Verse 2

తొలిప్రేమ కలిగి అందరము

బలియైన క్రీస్తును ప్రకటించి (2)

మారాను పోలిన శ్రమలున్నా

కానాను పురముకు చేరుదము (2)

Toliprema Kaligi Andaramu

Baliyaina Kreestunu Prakatinchi (2)

Maaraanu Polina Shramalunnaa

Kaanaanu Puramuku Cherudamu (2)

Verse 3

అపొస్తలుల బోధ - సహవాసము ప్రభు బల్ల

ప్రార్థన జీవితము - సంఘ దర్శనమునకు మూలం

ఈ ఆత్మీయ లంగరులను కలిగి - కొనసాగెదము తుఫానులలో

ఈ ఆత్మీయ లంగరులను కలిగి - ఈ పాప సముద్రము దాటెదము

Apostalula Bodha - Sahavaasamu Prabhu Balla

Praarthana Jeevitamu - Sangha Darshanamunaku Moolam

Ee Aatmeeya Langarulanu Kaligi - Konasaagedamu Tuphaanulalo

Ee Aatmeeya Langarulanu Kaligi - Ee Paapa Samudramu Daatedamu

Verse 4

విశ్వాసము ప్రేమ - నిరీక్షణ నిలుచునిల

అపకారము మాని - డంబమును విడచెదము

సోదర ప్రేమలేనిచో - వ్యర్థులము మన మీ లోకములో

సోదర ప్రేమలేనిచో మ్రోగెడి తాళము వలె నుండెదము

Vishvaasamu Prema - Nireekshana Niluchunila

Apakaaramu Maani - Dambamunu Vidachedamu

Sodara Premalenicho - Vyarthulamu Mana Mee Lokamulo

Sodara Premalenicho Mrogedi Taalamu Vale Nundedamu

Verse 5

దేవుని చిత్తమును - ఎరిగి జీవించెదము

ప్రభు చిత్తము కొరకు - చెల్లించెదము క్రయము

దేవా నీ చిత్తము నెరవేర్చ - మాకెంతో సంతోషము

దేవా నీ చిత్తము నెరవేర్చ - నీకెంతో సంతోషము

Devuni Chittamunu - Erigi Jeevinchedamu

Prabhu Chittamu Koraku - Chellinchedamu Krayamu

Devaa Nee Chittamu Neravercha - Maakento Santoshamu

Devaa Nee Chittamu Neravercha - Neekento Santoshamu

Verse 6

దేవుని మందిరమున్ - ప్రేమించెదమెల్లప్పుడు

దేవుని వాక్యమును - ఆలయములో ధ్యానింతుము

చిరకాలము దేవుని మందిరములో - నివసించి స్తుతియించెదము

చిరకాలము దేవుని మందిర తేజో మహిమలో వసియించెదము

Devuni Mandiramun - Preminchedamellappudu

Devuni Vaakyamunu - Aalayamulo Dhyaanintumu

Chirakaalamu Devuni Mandiramulo - Nivasinchi Stutiyinchedamu

Chirakaalamu Devuni Mandira Tejo Mahimalo Vasiyinchedamu

Verse 7

ఆత్మతో సత్యముతో - నిజ ఆరాధన కలిగి

యధార్థ హృదయముతో - మంచి సాక్ష్యమును కలిగి

పెదవుల పదములు కాదని - మన హృదయములను అర్పించెదము

పెదవుల పదములు కాదని - హెబ్రోను ప్రభుని కొనియాడెదము

Aatmato Satyamuto - Nija Aaraadhana Kaligi

Yadhaartha Hrudayamuto - Manchi Saakshyamunu Kaligi

Pedavula Padamulu Kaadani - Mana Hrudayamulanu Arpinchedamu

Pedavula Padamulu Kaadani - Hebronu Prabhuni Koniyaadedamu

Verse 8

చెప్పనశక్యమును - మహిమా యుక్తమునైన

సంతోషము కలిగి సువార్తను చాటెదము

ఆకాశము క్రింద ఏ నామమున - రక్షణ లేదని చాటెదము

ఆకాశము క్రింద యేసు నామమునే - పాపక్షమాపణ కలుగునని

Cheppanashakyamunu - Mahimaa Yuktamunaina

Santoshamu Kaligi Suvaartanu Chaatedamu

Aakaashamu Krinda E Naamamuna - Rakshana Ledani Chaatedamu

Aakaashamu Krinda Yesu Naamamune - Paapakshamaapana Kalugunani

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with P