Skip to content
ThuthiThuthiThuthi

Tandri Devaa Putra Devaa Aatma Devaa Svaagatam Song Lyricsతండ్రి దేవా పుత్ర దేవా ఆత్మ దేవా స్వాగతం

Also searched as: thandri deva

Tandri Devaa Putra Devaa Aatma Devaa Svaagatam Lyrics in Telugu & English

Present

Verse 1

తండ్రి దేవా పుత్ర దేవా ఆత్మ దేవా స్వాగతం

ఈ బలిపూజకు సుస్వాగతం (2)

Tandri Devaa Putra Devaa Aatma Devaa Svaagatam

Ee Balipoojaku Susvaagatam (2)

Verse 2

మరియ తనయుడు కారు చీకటిని ఛేదించి జన్మించెను

ఇమ్మానుయేలు ఒంటరి బ్రతుకుకు తోడుండ ఉదయించెను (2)

కలతలు బాపగ ఈ భువికి ఏతెంచెను (2)

పాపిని రక్షింప ప్రేమతో అరుదెంచెను

సర్వోన్నత స్థలములలో నివసించు దేవునికి మహిమ

తనకిష్ఠులైన మనుజులకు శాంతి కలుగునుగాక (2)

Mariya Tanayudu Kaaru Cheekatini Chhedinchi Janminchenu

Immaanuyelu Ontari Bratukuku Todunda Udayinchenu (2)

Kalatalu Baapaga Ee Bhuviki Etenchenu (2)

Paapini Rakshimpa Premato Arudenchenu

Sarvonnata Sthalamulalo Nivasinchu Devuniki Mahima

Tanakishthulaina Manujulaku Shaanti Kalugunugaaka (2)

Verse 3

తండ్రి ప్రేమకు ప్రతిరూపము యేసుని జన్మము

ఆత్మదేవుని చొరవకు ఇది శక్తియుక్తికి నిదర్శనం (2)

వినయమూర్తిగ దైవతనయుడు మనిషిగ మారెను (2)

త్రిత్వ దైవము ప్రణాళిక ఇది మానవాళికి రక్షణ

||సర్వోన్నత||

Tandri Premaku Pratiroopamu Yesuni Janmamu

Aatmadevuni Choravaku Idi Shaktiyuktiki Nidarshanam (2)

Vinayamoortiga Daivatanayudu Manishiga Maarenu (2)

Tritva Daivamu Pranaalika Idi Maanavaaliki Rakshana

||Sarvonnata||

Verse 4

ప్రవక్తలు ముందుగ ఎరుక పరచెను క్రీస్తుని రాకను

కన్యమరియ గర్భమందు రక్షకుడు జన్మించెను (2)

పుణ్య యోసేపు దైవ వాక్కుకు విధేయత చూపెను (2)

ప్రభుని చేరి ప్రణమిల్లి మ్రొక్కిరి గొల్లలు జ్ఞానులు

||సర్వోన్నత||

Pravaktalu Munduga Eruka Parachenu Kreestuni Raakanu

Kanyamariya Garbhamandu Rakshakudu Janminchenu (2)

Punya Yosepu Daiva Vaakkuku Vidheyata Choopenu (2)

Prabhuni Cheri Pranamilli Mrokkiri Gollalu Jnyaanulu

||Sarvonnata||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with T