Skip to content
ThuthiThuthiThuthi

Yehovaa Mahonnatudaa Mahimayu Neede Song Lyricsయెహోవా మహోన్నతుడా మహిమయు నీదే

Yehovaa Mahonnatudaa Mahimayu Neede Lyrics in Telugu & English

Present

Verse 1

యెహోవా మహోన్నతుడా - మహిమయు నీదే

ఇహమందు రక్షకా - మహిమంచి దాతవు

Yehovaa Mahonnatudaa - Mahimayu Neede

Ihamandu Rakshakaa - Mahimanchi Daatavu

Verse 2

పాలకుడవు పరమందు - ఏలికవు యెల్లరికి

చాలినట్టి ప్రధానుండా - సకల యధికారులకును

రాజుల రాజు ప్రభువుల ప్రభువు - ధరపర లోకములకు

దేవుడ వీవే ధన్యుండ నీకే ఘనమైన మహిమ

Paalakudavu Paramandu - Elikavu Yellariki

Chaalinatti Pradhaanundaa - Sakala Yadhikaarulakunu

Raajula Raaju Prabhuvula Prabhuvu - Dharapara Lokamulaku

Devuda Veeve Dhanyunda Neeke Ghanamaina Mahima

Verse 3

పరమును విడచితివి - ధర కేతెంచితివి

ప్రాణమీవు బలిగానిచ్చి - మమ్మును రక్షించితివి

తిరిగి లేచి మాకు - కరుణ జీవమిచ్చితివి

విరివగు నీ ప్రేమ - నరులపై చూపితివి

ధర నీదే ఘనతయని - చరణముల పాడుదుము

Paramunu Vidachitivi - Dhara Ketenchitivi

Praanameevu Baligaanichchi - Mammunu Rakshinchitivi

Tirigi Lechi Maaku - Karuna Jeevamichchitivi

Virivagu Nee Prema - Narulapai Choopitivi

Dhara Neede Ghanatayani - Charanamula Paadudumu

Verse 4

సంఘమందు మహిమ నీకే - సకల యుగములకును

యుగమందు ప్రతిజీవి - యెహోవాయని యనున్

జగమంతటికి నీవు - నిజమైన ప్రభుడవు

ఆది యంతమై నీవు - అలరారుచున్నావు

యుగయుగములకు - ఘనమహిమ కలుగును

Sanghamandu Mahima Neeke - Sakala Yugamulakunu

Yugamandu Pratijeevi - Yehovaayani Yanun

Jagamantatiki Neevu - Nijamaina Prabhudavu

Aadi Yantamai Neevu - Alaraaruchunnaavu

Yugayugamulaku - Ghanamahima Kalugunu

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with Y