1 Chronicles · chapter 12 · verse 37
1 Chronicles 12:37 in Telugu
మరియు యొర్దాను నది అవతలనుండు రూబేనీయులలోను గాదీయులలోను మనష్షే అర్ధగోత్రపు వారిలోను సకలవిధమైన యుద్ధాయుధములను ధరించు యుద్ధశూరులైన యీ యోధులందరు దావీదును ఇశ్రాయేలుమీద రాజుగా నియమించవలెనన్న కోరిక హృదయమందు కలిగినవారై ఆయుధములను ధరించి హెబ్రోనునకు వచ్చిరి.
Mariyu yordaanu nadi avatalanundu roobeneeyulalonu gaadeeyulalonu manashshe ardhagotrapu vaarilonu sakalavidhamaina yuddhaayudhamulanu dharinchu yuddhashoorulaina yee yodhulandaru daaveedunu ishraayelumeeda raajugaa niyaminchavalenanna korika hrudayamandu kaliginavaarai aayudhamulanu dharinchi hebronunaku vachchiri.
1 Chronicles 12:37 in English
- King James Version (KJV)
- And on the other side of Jordan, of the Reubenites, and the Gadites, and of the half tribe of Manasseh, with all manner of instruments of war for the battle, an hundred and twenty thousand.
- World English Bible (WEB)
- On the other side of the Jordan, of the Reubenites, the Gadites, and of the half-tribe of Manasseh, with all kinds of instruments of war for the battle: one hundred twenty thousand.
- American Standard Version (ASV)
- And on the other side of the Jordan, of the Reubenites, and the Gadites, and of the half-tribe of Manasseh, with all manner of instruments of war for the battle, a hundred and twenty thousand.
- Bible in Basic English (BBE)
- From the other side of Jordan, there were a hundred and twenty thousand of the Reubenites and the Gadites and the men of the half-tribe of Manasseh, armed with every sort of instrument of war.
- Darby Translation (DBY)
- And from the other side of the Jordan, of the Reubenites, and the Gadites, and of the half tribe of Manasseh, with all manner of weapons of war for battle, a hundred and twenty thousand.
- Webster's Bible (WBS)
- And on the other side of Jordan, of the Reubenites, and the Gadites, and of the half tribe of Manasseh, with all manner of instruments of war for the battle, a hundred and twenty thousand.
- Young's Literal Translation (YLT)
- And from beyond the Jordan, of the Reubenite, and of the Gadite, and of the half of the tribe of Manasseh, with all instruments of the host for battle, [are] a hundred and twenty thousand.
Read in context
- 35దానీయులలో యుద్ధ సన్నద్ధులైన వారు ఇరువది యెనిమిదివేల ఆరు వందల మంది.
- 36ఆషేరీయులలో యుద్ధపు నేర్పుగల యుద్ధ సన్నద్ధులు నలువది వేలమంది.
- 37మరియు యొర్దాను నది అవతలనుండు రూబేనీయులలోను గాదీయులలోను మనష్షే అర్ధగోత్రపు వారిలోను సకలవిధమైన యుద్ధాయుధములను ధరించు యుద్ధశూరులైన యీ యోధులందరు దావీదును ఇశ్రాయేలుమీద రాజుగా నియమించవలెనన్న కోరిక హృదయమందు కలిగినవారై ఆయుధములను ధరించి హెబ్రోనునకు వచ్చిరి.
- 38ఇశ్రాయేలులో కడమ వారందరును ఏకమనస్కులై దావీదును రాజుగా నియ మింపవలెనని కోరియుండిరి.
- 39వారి సహోదరులు వారికొరకు భోజనపదార్థములను సిద్ధము చేసియుండగా వారు దావీదుతోకూడ అచ్చట మూడు దినములుండి అన్న పానములు పుచ్చుకొనిరి.
Cross references
- Joshua 13:7–32 యెహోషువ 13:7–32తొమ్మిది గోత్రములకును మనష్షే అర్ధ గోత్రమునకును ఈ దేశమును స్వాస్థ్యముగా పంచి పెట్టుము. యెహోవా సేవకుడైన మోషే వారికిచ్చినట్లు రూబేనీయులు గాదీయులు తూర్పుదిక్కున యొర్దాను అవతల మోషే వారికిచ్చిన స్వాస్థ్యమును పొందిరి. అది ఏదనగా అర్నోను ఏటిలోయ దరినున్న అరోయేరు మొదలుకొని ఆ లోయమధ్యనున్న పట్టణమునుండి దీబోను వరకు మేదెబా మైదానమంతయు, అమ్మోనీయుల సరిహద్దు వరకు హెష్బోనులో ఏలికయు అమోరీయుల రాజునైన సీహోనుయొక్క సమస్తపురములును గిలాదును, గెషూరీ యులయొక్కయు మాయకాతీయులయొక్కయు దేశము, హెర్మోను మన్యమంతయు, సల్కావరకు బాషాను దేశమంతయు రెఫాయీయుల శేషములో అష్తారోతు లోను ఎద్రెయీలోను ఏలికయైన ఓగురాజ్యమంతయు మిగిలియున్నది. మోషే ఆ రాజులను జయించి వారి దేశమును పట్టుకొనెను. అయితే ఇశ్రాయేలీయులు గెషూరీయుల దేశమునైనను మాయకాతీయుల దేశము నైనను పట్టుకొనలేదు గనుక గెషూరీయులును మాయకా తీయులును నేటివరకు ఇశ్రాయేలీయుల మధ్యను నివసించు చున్నారు. లేవిగోత్రమునకే అతడు స్వాస్థ్యము ఇయ్య లేదు. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా వారితో సెలవిచ్చినట్లు ఆయనకు అర్పింపబడు హోమములే వారికి స్వాస్థ్యము. వారి వంశములనుబట్టి మోషే రూబేనీయులకు స్వాస్థ్య మిచ్చెను. వారి సరిహద్దు ఏదనగా, అర్నోను ఏటిలోయ దరినున్న అరోయేరు మొదలుకొని ఆ లోయలోనున్న పట్టణమునుండి మేదెబాయొద్దనున్న మైదానమంతయు హెష్బోనును మైదానములోని పట్టణములన్నియు, దీబోను బామోత్బయలు బేత్బయల్మెయోను యాహసు కెదేమోతు మేఫాతు కిర్యతాయిము సిబ్మాలోయలోని కొండమీది శెరెత్షహరు బెత్పయోరు పిస్గాకొండచరియలు బెత్యేషి మోతు అను పట్టణములును మైదానములోని పట్టణము లన్నియు, హెష్బోనులో ఏలికయు, మోషే జయించిన వాడునైన సీహోను వశముననున్న ఎవీ రేకెము సూరు హోరు రేబ అను మిద్యానురాజుల దేశమును అమోరీ యుల రాజైన సీహోను రాజ్యమంతయు వారికి స్వాస్థ్యముగా ఇచ్చెను. ఇశ్రాయేలీయులు బెయోరు కుమారుడును సోదెగాడు నైన బిలామును తాము చంపిన తక్కినవారితో పాటు ఖడ్గముతో చంపిరి. యొర్దాను ప్రదేశమంతయు రూబేనీ యులకు సరిహద్దు; అదియు దానిలోని పట్టణములును గ్రామములును రూబేనీయుల వంశముల లెక్కచొప్పున వారికి కలిగిన స్వాస్థ్యము. మోషే గాదుగోత్రమునకు, అనగా గాదీయులకు వారి వంశములచొప్పున స్వాస్థ్యమిచ్చెను. వారి సరిహద్దు యాజెరును గిలాదు పట్టణములన్నియు, రబ్బాకు ఎదురుగానున్న అరోయేరువరకు అమ్మోనీయుల దేశములో సగమును హెష్బోను మొదలుకొని రామత్మిజ్పె బెటొ నీమువరకును మహనయీము మొదలుకొని దెబీరు సరిహద్దువరకును లోయలో బేతారాము బేత్నిమ్రా సుక్కోతు సాపోను, అనగా హెష్బోను రాజైన సీహోను రాజ్యశేషమును తూర్పు దిక్కున యొర్దాను అవతల కిన్నె రెతు సముద్రతీరమువరకునున్న యొర్దాను ప్రదేశమును. వారి వంశముల చొప్పున గాదీయులకు స్వాస్థ్యమైన పట్ట ణములును గ్రామములును ఇవి. మోషే మనష్షే అర్థగోత్రమునకు స్వాస్థ్యమిచ్చెను. అది వారి వంశములచొప్పున మనష్షీయుల అర్థగోత్రమునకు స్వాస్థ్యము. వారి సరిహద్దు మహనయీము మొదలు కొని బాషాను యావత్తును, బాషాను రాజైన ఓగు సర్వ రాజ్యమును, బాషానులోని యాయీరు పురములైన బాషానులోని అరువది పట్టణములును. గిలాదులో సగ మును, అష్తారోతు ఎద్రయియునను బాషానులో ఓగు రాజ్య పట్టణములును మనష్షే కుమారుడైన మాకీరు, అనగా మాకీరీయులలో సగముమందికి వారి వంశములచొప్పున కలిగినవి. యెరికో యొద్ద తూర్పుదిక్కున యొర్దాను అవతలనున్న మోయాబు మైదానములో మోషే పంచి పెట్టిన స్వాస్థ్యములు ఇవి.
- 1 Chronicles 5:1–10 1 దినవృత్తాంతములు 5:1–10ఇశ్రాయేలునకు తొలిచూలి కుమారుడైన రూబేను కుమారుల వివరము. ఇతడు జ్యేష్ఠుడై యుండెను గాని తన తండ్రి పరుపును తాను అంటుపరచినందున అతని జన్మ స్వాతంత్ర్యము ఇశ్రాయేలు కుమారుడైన యోసేపు కుమా రులకియ్యబడెను; అయితే వంశావళిలో యోసేపు జ్యేష్ఠు డుగా దాఖలుచేయబడలేదు. యూదా తన సహోద రులకంటె హెచ్చినవాడాయెను, అతనినుండి ప్రముఖుడు బయలువెడలెను, అయినను జన్మస్వాతంత్ర్యము యోసేపు దాయెను. ఇశ్రాయేలునకు జ్యేష్ఠుడుగా పుట్టిన రూబేను కుమారు లెవరనగా హనోకు పల్లు హెస్రోను కర్మీ. యోవేలు కుమారులలో ఒకడు షెమయా, షెమయాకు గోగు కుమారుడు, గోగునకు షిమీ కుమారుడు, షిమీకి మీకా కుమారుడు, మీకాకు రెవాయా కుమారుడు, రెవాయాకు బయలు కుమారుడు, బయలునకు బెయేర కుమారుడు, ఇతడు రూబేనీయులకు పెద్ద. అష్షూరు రాజైన తిగ్లత్పిలేసెరు అతని చెరతీసికొని పోయెను. వారి తరముల వంశావళి సరిచూడబడినప్పుడు వారి కుటుంబ ముల చొప్పున అతని సహోదరులలో ముఖ్యులుగా తేలినవారు యెహీయేలును, జెకర్యాయును, యోవేలు కుమారుడైన షెమకు పుట్టిన ఆజాజు కుమారుడైన బెల యును. బెల వంశపువారు అరోయేరునందును నెబో వరకును బయల్మెయోనువరకును కాపురముండిరి. వారి పశువులు గిలాదుదేశమందు అతివిస్తారము కాగా తూర్పున యూఫ్రటీసునది మొదలుకొని అరణ్యపు సరిహద్దువరకును వారు కాపురముండిరి. సౌలు దినములలో వారు హగ్రీ యీలతో యుద్ధము జరిగించి వారిని హతముచేసి గిలాదు తూర్పువైపువరకు వారి గుడారములలో కాపురముండిరి.
- Joshua 22:1–10 యెహోషువ 22:1–10యెహోషువ రూబేనీయులను గాదీయులను మనష్షే అర్ధగోత్రపువారిని పిలిపించి వారితో ఇట్లనెను యెహోవా సేవకుడైన మోషే మీకాజ్ఞాపించినదంతయు మీరు చేసియున్నారు. మరియు నేను మీ కాజ్ఞాపించిన వాటన్నిటి విషయములో నా మాట వినియున్నారు. బహుదినములనుండి నేటివరకు మీరు మీ సహోదరులను విడువక మీ దేవుడైన యెహోవా ఆజ్ఞననుసరించి నడిచి యున్నారు. ఇప్పుడు మీ దేవుడైన యెహోవా మీ సహోదరులతో చెప్పినట్లు వారికి నెమ్మది కలుగజేసి యున్నాడు. కాబట్టి మీరిప్పుడు యెహోవా సేవకు డైన మోషే యొర్దాను అవతల మీకు స్వాస్థ్యముగా ఇచ్చిన దేశములో మీ నివాసములకు తిరిగి వెళ్లుడి. అయితే మీ పూర్ణహృదయముతోను మీ పూర్ణాత్మతోను మీ దేవు డైన యెహోవాను ప్రేమించుచు, ఆయనమార్గములన్ని టిలో నడుచుకొనుచు, ఆయన ఆజ్ఞలను గైకొనుచు, ఆయనను హత్తుకొని ఆయనను సేవించుచు, యెహోవా సేవకుడైన మోషే మీకాజ్ఞాపించిన ధర్మమును ధర్మశాస్త్ర మును అనుసరించి నడుచుకొనుడి. అతడీలాగు చెప్పిన తరువాత వారిని దీవించి వెళ్లనంపగా వారు తమ నివాస ములకు పోయిరి. మోషే బాషానులో మనష్షే అర్ధగోత్రమునకును, యెహోషువ పడమటిదిక్కున యొర్దాను అద్దరిని వారి సహోదరులలో మిగిలిన అర్ధగోత్రమునకును స్వాస్థ్యము లిచ్చిరి. మరియు యెహోషువ వారి నివాసములకు వారిని వెళ్లనంపినప్పుడు అతడు వారిని దీవించి వారితో ఇట్లనెను మీరు మిక్కిలి కలిమిగలవారై అతి విస్తారమైన పశువులతోను వెండితోను బంగారుతోను ఇత్తడితోను ఇనుముతోను అతివిస్తారమైన వస్త్రము లతోను తిరిగి మీ నివాసములకు వెళ్లుచున్నారు. మీ శత్రువుల దోపుడు సొమ్మును మీరును మీ సహోదరులును కలిసి పంచుకొనుడి. కాబట్టి రూబేనీయులును గాదీయులును మనష్షే అర్ధ గోత్రపువారును యెహోవా మోషేద్వారా సెలవిచ్చిన మాటచొప్పున తాము స్వాధీనపరచుకొనిన స్వాస్థ్యభూమి యైన గిలాదులోనికి వెళ్లుటకు కనాను దేశమందలి షిలో హులోనున్న ఇశ్రాయేలీయుల యొద్దనుండి బయలుదేరిరి. కనానుదేశమందున్న యొర్దాను ప్రదేశమునకు వచ్చినప్పుడు రూబేనీయు లును గాదీయులును మనష్షే అర్థ గోత్రపువారును అక్కడ యొర్దాను దగ్గర ఒక బలిపీఠ మును కట్టిరి. అది చూపునకు గొప్ప బలిపీఠమే.
- Joshua 14:3 యెహోషువ 14:3మోషే రెండు గోత్రములకును అర్ధగోత్ర మునకును యొర్దాను అవతలి స్వాస్థ్యముల నిచ్చియుండెను. అతడు వారిలో లేవీయులకు ఏ స్వాస్థ్యము ఇయ్యలేదు
- Deuteronomy 3:12–16 ద్వితీయోపదేశకాండము 3:12–16అర్నోను లోయలో నున్న అరోయేరు మొదలుకొని గిలాదు మన్నెములో సగమును, మనము అప్పుడు స్వాధీనపరచుకొనిన దేశ మును, దాని పురములను రూబేనీయులకును గాదీయులకును ఇచ్చితిని. ఓగు రాజు దేశమైన బాషాను యావ త్తును గిలాదులో మిగిలిన దానిని, అనగా రెఫాయీయుల దేశమనబడిన బాషాను అంతటిని అర్గోబు ప్రదేశమంత టిని మనష్షే అర్ధ గోత్రమున కిచ్చితిని. మనష్షే కుమారు డైన యాయీరు గెషూరీయులయొక్కయు మాయా కాతీయు యొక్కయు సరిహద్దులవరకు అర్గోబు ప్రదేశ మంతటిని పట్టుకొని, తన పేరునుబట్టి వాటికి యాయీరు బాషాను గ్రామములని పేరు పెట్టెను. నేటివరకు ఆ పేర్లు వాటికున్నవి. మాకీరీయులకు గిలాదు నిచ్చితిని. గిలాదు మొదలుకొని అర్నోను లోయ మధ్యవరకును, యబ్బోకు నదివరకును అమ్మోనీయుల పడమటి సరిహద్దు వరకును
- Numbers 32:33–42 సంఖ్యాకాండము 32:33–42అప్పుడు మోషే వారికి, అనగా గాదీయులకును రూబే నీయులకును యోసేపు కుమారుడైన మనష్షే అర్ధగోత్రపు వారికిని, అమోరీయుల రాజైన సీహోను రాజ్యమును, బాషాను రాజైన ఓగు రాజ్యమును, దాని ప్రాంతపురములతో ఆ దేశమును చట్టునుండు ఆ దేశపురములను ఇచ్చెను. గాదీయులు దీబోను అతారోతు అరోయేరు అత్రోతు షోపాను యాజెరు యొగ్బెహ బేత్నిమ్రా బేత్హారాను అను ప్రాకారములుగల పురములను మందల దొడ్లను కట్టు కొనిరి. రూబేనీయులు మారుపేరుపొందిన హెష్బోను ఏలాలే కిర్యతాయిము నెబో బయల్మెయోను షిబ్మా అను పురములను కట్టి, తాము కట్టిన ఆ పురములకు వేరు పేరులు పెట్టిరి. మనష్షే కుమారులైన మాకీరీయులు గిలాదుమీదికి పోయి దాని పట్టుకొని దానిలోనున్న అమోరీయులను వెళ్లగొట్టిరి. మోషే మనష్షే కుమారు డైన మాకీరుకు గిలాదునిచ్చెను అతడు అక్కడ నివ సించెను. మనష్షే కుమారుడైన యాయీరు వెళ్లి వారి పల్లెలను పట్టుకొని వాటికి యాయీరు పల్లెలను పేరు పెట్టెను. నోబహు వెళ్లి కెనాతును దాని గ్రామము లను పట్టుకొని దానికి నోబహు అని తన పేరు పెట్టెను.
Original words (Hebrew)
- side · H5676עֵבֶר ʻêber
- Jordan · H3383יַרְדֵּן Yardên
- Reubenites · H7206רְאוּבֵנִי Rᵉʼûwbênîy
- Gadites · H1425גָּדִי Gâdîy
- half · H2677חֵצִי chêtsîy
- tribe · H7626שֵׁבֶט shêbeṭ
- Manasseh · H4519מְנַשֶּׁה Mᵉnashsheh
- instruments · H3627כְּלִי kᵉlîy
- war · H6635צָבָא tsâbâʼ
- battle · H4421מִלְחָמָה milchâmâh
- hundred · H3967מֵאָה mêʼâh
- twenty · H6242עֶשְׂרִים ʻesrîym
- thousand · H505אֶלֶף ʼeleph