1 Chronicles · chapter 14 · verse 12
1 Chronicles 14:12 in Telugu
వారు అచ్చట తమ దేవతలను విడిచిపెట్టిపోగా వాటిని అగ్నిచేత కాల్చి వేయవలెనని దావీదు సెలవిచ్చెను.
Vaaru achchata tama devatalanu vidichipettipogaa vaatini agnicheta kaalchi veyavalenani daaveedu selavichchenu.
1 Chronicles 14:12 in English
- King James Version (KJV)
- And when they had left their gods there, David gave a commandment, and they were burned with fire.
- World English Bible (WEB)
- They left their gods there; and David gave a command, and they were burned with fire.
- American Standard Version (ASV)
- And they left their gods there; and David gave commandment, and they were burned with fire.
- Bible in Basic English (BBE)
- And the Philistines did not take their images with them in their flight; and at David's orders they were burned with fire.
- Darby Translation (DBY)
- And they left their gods there; and David commanded, and they were burned with fire.
- Webster's Bible (WBS)
- And when they had left their gods there, David gave a commandment, and they were burned with fire.
- Young's Literal Translation (YLT)
- And they leave there their gods, and David speaketh, and they are burnt with fire.
Read in context
- 10ఫిలిష్తీయులమీదికి నేను పోయినయెడల నీవు వారిని నా చేతికి అప్పగించుదువా? అని దావీదు దేవునియొద్ద విచారణచేయగా యెహోవాపొమ్ము, నేను వారిని నీ చేతికి అప్పగించెదనని సెల విచ్చెను.
- 11వారు బయల్పెరాజీమునకు వచ్చినప్పుడు దావీదు అచ్చట వారిని హతముచేసిజలప్రవాహములు కొట్టుకొని పోవునట్లు యెహోవా నా శత్రువులను నా యెదుట నిలువకుండ నాశనము చేసెననుకొని ఆ స్థలమునకు బయల్పెరాజీము అను పేరుపెట్టెను.
- 12వారు అచ్చట తమ దేవతలను విడిచిపెట్టిపోగా వాటిని అగ్నిచేత కాల్చి వేయవలెనని దావీదు సెలవిచ్చెను.
- 13ఫిలిష్తీయులు మరల ఆ లోయలోనికి దిగిరాగా
- 14దావీదు తిరిగి దేవునియొద్ద విచారణచేసెను. అందుకు దేవుడునీవు వారిని తరుము కొనిపోక వారిని తప్పించుకొని చుట్టు తిరిగి కంబళిచెట్లకు ఎదురుగా నిలిచి
Cross references
- Exodus 32:20 నిర్గమకాండము 32:20మరియు అతడు వారు చేసిన ఆ దూడను తీసికొని అగ్నితో కాల్చి పొడిచేసి నీళ్లమీద చల్లి ఇశ్రాయేలీయులచేత దాని త్రాగించెను.
- 2 Kings 19:18 2 రాజులు 19:18వారి దేవతలను అగ్నిలో వేసినది నిజమే. ఆ రాజ్యముల దేవతలు నిజమైన దేవుండ్లు కాక మనుష్యులచేత చేయబడిన కఱ్ఱలు రాళ్లే గనుక వారు వారిని నిర్మూలము చేసిరి.
- 1 Samuel 5:2–6 1 సమూయేలు 5:2–6దాగోను గుడిలో దాగోను ఎదుట దాని నుంచిరి. అయితే మరునాడు అష్డోదువారు ప్రాతఃకాలమందు లేవగా, ఇదిగో దాగోను యెహోవా మందసము ఎదుట నేలను బోర్లబడియుండెను కనుక వారు దాగోనును లేవనెత్తి వానిస్థానమందు మరల ఉంచిరి. ఆ మరునాడు వారు ఉదయముననే లేవగా దాగోను యెహోవా మందసము ఎదుట నేలను బోర్లబడి యుండెను. దాగోనుయొక్క తలయు రెండు అరచేతులును తెగవేయబడి గడపదగ్గర పడియుండెను, వాని మొండెము మాత్రము వానికి మిగిలి యుండెను. కాబట్టి దాగోను యాజకులేమి దాగోను గుడికి వచ్చు వారేమి నేటివరకు ఎవరును అష్డోదులో దాగోనుయొక్క గుడిగడపను త్రొక్కుటలేదు. యెహోవా హస్తము అష్డోదువారిమీద భారముగా ఉండెను. అష్డోదువారిని దాని సరిహద్దులలో నున్న వారిని ఆయన గడ్డల రోగముతో మొత్తి వారిని హతము చేయగా
- Deuteronomy 7:25 ద్వితీయోపదేశకాండము 7:25వారి దేవతల ప్రతిమలను మీరు అగ్నిచేత కాల్చివేయవలెను; వాటి మీదనున్న వెండిబంగారములను అపేక్షిం పకూడదు. నీవు దానివలన చిక్కుబడుదువేమో గనుక దానిని తీసికొన కూడదు. ఏలయనగా అది నీ దేవుడైన యెహోవాకు హేయము.
- Deuteronomy 7:5 ద్వితీయోపదేశకాండము 7:5కావున మీరు వారికి చేయవలసినదేమనగా, వారి బలిపీఠ ములను పడద్రోసి వారి విగ్రహములను పగులగొట్టి వారి దేవతాస్తంభములను నరికివేసి వారి ప్రతిమలను అగ్నితో కాల్చవలెను.
- Exodus 12:12 నిర్గమకాండము 12:12ఆ రాత్రి నేను ఐగుప్తుదేశమందు సంచరించి, ఐగుప్తుదేశమందలి మనుష్యులలోనేగాని జంతువులలోనేగాని తొలి సంతతియంతయు హతముచేసి, ఐగుప్తు దేవతలకందరికిని తీర్పు తీర్చెదను; నేను యెహో వాను.