1 Chronicles · chapter 18 · verse 12
1 Chronicles 18:12 in Telugu
మరియు సెరూయా కుమారుడైన అబీషై ఉప్పులోయలో ఎదోమీయులలో పదునెనిమిది వేల మందిని హతము చేసెను.
Mariyu serooyaa kumaarudaina abeeshai uppuloyalo edomeeyulalo padunenimidi vela mandini hatamu chesenu.
1 Chronicles 18:12 in English
- King James Version (KJV)
- Moreover Abishai the son of Zeruiah slew of the Edomites in the valley of salt eighteen thousand.
- World English Bible (WEB)
- Moreover Abishai the son of Zeruiah struck eighteen thousand of the Edomites in the Valley of Salt.
- American Standard Version (ASV)
- Moreover Abishai the son of Zeruiah smote of the Edomites in the Valley of Salt eighteen thousand.
- Bible in Basic English (BBE)
- And when he came back from putting to the sword eighteen thousand of the Edomites in the Valley of Salt,
- Darby Translation (DBY)
- And Abishai the son of Zeruiah smote of the Edomites in the valley of salt eighteen thousand.
- Webster's Bible (WBS)
- Moreover, Abishai the son of Zeruiah slew of the Edomites in the valley of salt eighteen thousand.
- Young's Literal Translation (YLT)
- And Abishai son of Zeruiah hath smitten Edom in the valley of salt — eighteen thousand,
Read in context
- 10హదరెజెరునకును తోహూకును విరోధము కలిగియుండెను గనుక రాజైన దావీదు హదరెజెరుతో యుద్ధముచేసి అతని నోడించినందుకై దావీదుయొక్క క్షేమము తెలిసికొనుటకును, అతనితో శుభవచనములుపలుకుటకును, బంగారముతోను వెండితోను ఇత్తడితోను చేయబడిన సకల విధములైన పాత్రలనిచ్చి, తోహూ తన కుమారుడైన హదోరమును అతనియొద్దకు పంపెను.
- 11ఈ వస్తువులను కూడ రాజైన దావీదు తాను ఎదో మీయులయొద్దనుండియు, మోయాబీయులయొద్ద నుండియు, అమ్మోనీయులయొద్ద నుండియు, ఫిలిష్తీయుల యొద్దనుండియు, అమాలేకీయులయొద్ద నుండియు తీసికొనిన వెండి బంగారములతో పాటుగా యెహోవాకు ప్రతిష్ఠించెను.
- 12మరియు సెరూయా కుమారుడైన అబీషై ఉప్పులోయలో ఎదోమీయులలో పదునెనిమిది వేల మందిని హతము చేసెను.
- 13దావీదు ఎదోములో కావలి సైన్యమును ఉంచెను, ఎదోమీయులందరును అతనికి సేవకు లైరి, దావీదు పోయిన చోట్లనెల్ల యెహోవా అతని రక్షించెను.
- 14ఈ ప్రకారము దావీదు ఇశ్రాయేలీయులందరిమీదను రాజైయుండి తన జనులందరికిని నీతిన్యాయములను జరిగిం చెను.
Cross references
- Psalm 60:1 కీర్తనలు 60:1దేవా, మమ్ము విడనాడియున్నావు మమ్ము చెదరగొట్టి యున్నావు నీవు కోపపడితివి మమ్ము మరల బాగుచేయుము.
- 2 Samuel 8:13–14 2 సమూయేలు 8:13–14దావీదు ఉప్పు లోయలో సిరియనులగు పదునెనిమిది వేలమందిని హతము చేసి తిరిగి రాగా అతని పేరు ప్రసిద్ధమాయెను. మరియు ఎదోము దేశమందు అతడు దండు నుంచెను. ఎదోమీ యులు దావీదునకు దాసులు కాగా ఎదోము దేశమంతట అతడు కావలిదండుంచెను; దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతనిని కాపాడుచుండెను.
- 1 Samuel 26:6 1 సమూయేలు 26:6అప్పుడు దావీదుపాళెములోనికి సౌలు దగ్గరకు నాతోకూడ ఎవరు వత్తురని హిత్తీయుడైన అహీమెలెకును సెరూయా కుమారుడును యోవాబునకు సహోదరుడునగు అబీషైని నడుగగానీతోకూడ నేనే వత్తునని అబీషై యనెను.
- 2 Samuel 10:10 2 సమూయేలు 10:10అమ్మోనీయులను ఎదుర్కొనుటకై మిగిలినవారిని తన సహోదరుడగు
- 1 Chronicles 2:16 1 దినవృత్తాంతములు 2:16సెరూయా అబీగయీలు వీరి అక్కచెల్లెండ్రు. సెరూయా కుమారులు ముగ్గురు, అబీషై యోవాబు అశాహేలు.
- 1 Chronicles 11:20 1 దినవృత్తాంతములు 11:20యోవాబు సహోదరుడైన అబీషై ముగ్గురిలో ప్రధానుడు; ఇతడు ఒక యుద్ధమందు మూడువందలమందిని హతముచేసి తన యీటె వారిమీద ఆడించినవాడై యీ ముగ్గురిలోను పేరుపొందిన వాడాయెను.
- 2 Chronicles 25:11 2 దినవృత్తాంతములు 25:11అంతట అమజ్యా ధైర్యము తెచ్చుకొని తన జనులతో కూడ బయలుదేరి ఉప్పుపల్లపు స్థలమునకు పోయి శేయీరువారిలో పదివేలమందిని హతము చేసెను.
- 1 Chronicles 19:11 1 దినవృత్తాంతములు 19:11కడమ జనులను అమ్మోనీయులకు ఎదురుగా వ్యూహపరచి, తన సహోదరుడైన అబీషైకి అప్పగించి యిట్లనెను
- 2 Kings 14:7 2 రాజులు 14:7మరియు ఉప్పు లోయలో అతడు యుద్ధము చేసి ఎదోమీయులలో పదివేలమందిని హతముచేసి, సెల అను పట్టణమును పట్టుకొని దానికి యొక్తయేలని పేరు పెట్టెను; నేటివరకు దానికి అదే పేరు.
- 1 Samuel 26:8 1 సమూయేలు 26:8అప్పుడు అబీషై దావీదుతోదేవుడు ఈ దినమున నీ శత్రువుని నీకప్పగించెను; కాబట్టి నీ చిత్తమైతే ఆ యీటెతో ఒక్కపోటు పొడిచి, నేనతనిని భూమికి నాటివేతును, ఒక దెబ్బతోనే పరిష్కారము చేతుననగా
- 2 Samuel 23:18 2 సమూయేలు 23:18సెరూయా కుమారుడును యోవాబు సహోదరుడునైన అబీషై తన అనుచరులలో ముఖ్యుడు. ఇతడొక యుద్ధములో మూడువందలమందిని హతముచేసి వారిమీద తన యీటెను ఆడించెను. ఇతడు ఆ ముగ్గు రిలో పేరుపొందినవాడు.
- 2 Samuel 3:30 2 సమూయేలు 3:30ఆలాగున యోవాబును అతని సహోదరుడైన అబీషైయును, అబ్నేరు గిబియోను యుద్ధమందు తమ సహోదరుడైన అశాహేలును చంపిన దానినిబట్టి అతని చంపిరి.