1 Chronicles · chapter 22 · verse 17
1 Chronicles 22:17 in Telugu
మరియు తన కుమారుడైన సొలొమోనునకు సహాయము చేయవలెనని దావీదు ఇశ్రాయేలీయుల యధిపతుల కందరికిని ఆజ్ఞాపించెను.
Mariyu tana kumaarudaina solomonunaku sahaayamu cheyavalenani daaveedu ishraayeleeyula yadhipatula kandarikini aajnyaapinchenu.
1 Chronicles 22:17 in English
- King James Version (KJV)
- David also commanded all the princes of Israel to help Solomon his son, [saying],
- World English Bible (WEB)
- David also commanded all the princes of Israel to help Solomon his son, saying,
- American Standard Version (ASV)
- David also commanded all the princes of Israel to help Solomon his son, [saying],
- Bible in Basic English (BBE)
- Then David gave orders to all the chiefs of Israel to give their help to Solomon his son, saying,
- Darby Translation (DBY)
- And David commanded all the princes of Israel to help Solomon his son, [saying,]
- Webster's Bible (WBS)
- David also commanded all the princes of Israel to help Solomon his son, [saying] ,
- Young's Literal Translation (YLT)
- And David giveth charge to all heads of Israel to give help to Solomon his son,
Read in context
- 15మరియు పనిచేయతగిన విస్తారమైన శిల్పకారులును కాసె పనివారును వడ్రవారును ఏవిధ మైన పనినైనను నెరవేర్చగల మంచి పనివారును నీయొద్ద ఉన్నారు.
- 16లెక్కింపలేనంత బంగారమును వెండియు ఇత్తడియు ఇనుమును నీకు ఉన్నవి; కాబట్టి నీవు పని పూనుకొనుము, యెహోవా నీకు తోడుగా ఉండును గాక.
- 17మరియు తన కుమారుడైన సొలొమోనునకు సహాయము చేయవలెనని దావీదు ఇశ్రాయేలీయుల యధిపతుల కందరికిని ఆజ్ఞాపించెను.
- 18ఎట్లనగామీ దేవుడైన యెహోవా మీతోకూడ ఉన్నాడు గదా? చుట్టునున్న వారివలన తొందరలేకుండ ఆయన మీకు నెమ్మది యిచ్చి యున్నాడుగదా? దేశనివాసులను ఆయన నాకు వశపరచి యున్నాడు, యెహోవా భయమువలనను ఆయన జనుల భయమువలనను దేశము లోపరచబడియున్నది.
- 19కావున హృదయపూర్వకముగా మీ దేవుడైన యెహోవాను వెదకుటకు మీ మనస్సులు దృఢపరచుకొని, ఆయన నిబంధన మందస మును దేవునికి ప్రతిష్ఠితమైన ఉపకరణములను ఆయన నామముకొరకు కట్టబడు ఆ మందిరములోనికి చేర్చుటకై మీరు పూనుకొని దేవుడైన యెహోవా పరిశుద్ధ స్థలమును కట్టుడి.
Cross references
- 1 Chronicles 28:1–6 1 దినవృత్తాంతములు 28:1–6గోత్రముల పెద్దలను, వంతులచొప్పున రాజునకు సేవచేయు అధిపతులను సహస్రాధిపతులను, శతాధిపతులను, రాజునకును రాజుకుమారులకును కలిగియున్న యావత్తు చరాస్తిమీదను స్థిరాస్తిమీదను ఉన్న అధిపతులను, అనగా ఇశ్రాయేలీయుల పెద్దలనందరిని రాజునొద్ద నున్న పరివారమును పరాక్రమశాలులను సేవా సంబంధులైన పరాక్రమ శాలులనందరిని రాజగు దావీదు యెరూషలేమునందు సమకూర్చెను. అప్పుడు రాజైన దావీదు లేచి నిలువబడి ఈలాగు సెలవిచ్చెనునా సహోదరులారా, నా జనులారా, నా మాట ఆలకించుడి; యెహోవా నిబంధన మందసమునకును మన దేవుని పాదపీఠమునకును విశ్రమస్థానముగా ఉండుటకు ఒక మందిరము కట్టించ వలెనని నేను నా హృదయమందు నిశ్చయము చేసికొని సమస్తము సిద్ధపరచితిని. అయితే నీవు యుద్ధములు జరిగించి రక్తము ఒలికించినవాడవు గనుక నీవు నా నామ మునకు మందిరమును కట్టించకూడదని దేవుడు నాకు ఆజ్ఞ ఇచ్చెను. ఇశ్రాయేలీయులమీద నిత్యము రాజునై యుండుటకు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా నా తండ్రి యింటివారందరిలోను నన్ను కోరుకొనెను, ఆయన యూదాగోత్రమును, యూదాగోత్రపువారిలో ప్రధానమైనదిగా నా తండ్రి యింటిని నా తండ్రి యింటిలో నన్నును ఏర్పరచుకొని నాయందు ఆయన దయచూపి ఇశ్రాయేలీయులమీద రాజుగా నియమించియున్నాడు. యెహోవా నాకు అనేకమంది కుమారులను దయచేసి యున్నాడు, అయితే ఇశ్రాయేలీయులపైని యెహోవా రాజ్యసింహాసనముమీద కూర్చుండుటకు ఆయన నా కుమారులందరిలో సొలొమోనును కోరుకొని ఆయన నాతో ఈలాగు సెలవిచ్చెను నేను నీ కుమారుడైన సొలొమోనును నాకు కుమారునిగా ఏర్పరచుకొని యున్నాను, నేను అతనికి తండ్రినైయుందును అతడు నా మందిరమును నా ఆవరణములను కట్టించును.
- 1 Chronicles 28:21 1 దినవృత్తాంతములు 28:21దేవుని మందిర సేవయంతటికిని యాజకులును లేవీయులును వంతులప్రకా రము ఏర్పాటైరి; నీ యాజ్ఞకు బద్ధులైయుండి యీ పని యంతటిని నెరవేర్చుటకై ఆ యా పనులయందు ప్రవీణులైన వారును మనఃపూర్వకముగా పనిచేయువారును అధి పతులును జనులందరును నీకు సహాయులగుదురు.
- Philippians 4:3 ఫిలిప్పీయులకు 4:3అవును, నిజమైన సహకారీ ఆ స్త్రీలు క్లెమెంతుతోను నా యితర సహకారులతోను సువార్తపనిలో నాతోకూడ ప్రయాసపడినవారు గనుక వారికి సహాయము చేయుమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేరులు జీవగ్రంథమందు వ్రాయబడియున్నవి
- Romans 16:2–3 రోమీయులకు 16:2–3ఆమెకు మీవలన కావలసినది ఏదైన ఉన్నయెడల సహాయము చేయవలెనని ఆమెనుగూర్చి మీకు సిఫారసు చేయుచున్నాను; ఆమె అనేకులకును నాకును సహాయురాలై యుండెను. క్రీస్తు యేసునందు నా జతపనివారైన ప్రిస్కిల్లకును, అకులకును నా వందనములు చెప్పుడి.
- 1 Chronicles 29:6 1 దినవృత్తాంతములు 29:6అప్పుడు పితరుల యిండ్లకు అధిపతులును ఇశ్రాయేలీయుల గోత్రపు అధి పతులును సహస్రాధిపతులును శతాధిపతులును రాజు పనిమీద నియమింపబడిన అధిపతులును కలసి
- 3 John 1:8 3 యోహాను 1:8మనము సత్యమునకు సహాయ కులమవునట్టు అట్టివారికి ఉపకారముచేయ బద్ధులమై యున్నాము.