1 Chronicles · chapter 24 · verse 1
1 Chronicles 24:1 in Telugu
అహరోను సంతతివారికి కలిగిన వంతులేవనగా, అహరోను కుమారులు నాదాబు అబీహు ఎలియాజరు ఈతామారు.
Aharonu santativaariki kaligina vantulevanagaa, aharonu kumaarulu naadaabu abeehu eliyaajaru eetaamaaru.
1 Chronicles 24:1 in English
- King James Version (KJV)
- Now [these are] the divisions of the sons of Aaron. The sons of Aaron; Nadab, and Abihu, Eleazar, and Ithamar.
- World English Bible (WEB)
- These were the divisions of the sons of Aaron. The sons of Aaron: Nadab, Abihu, Eleazar, and Ithamar.
- American Standard Version (ASV)
- And the courses of the sons of Aaron [were these]. The sons of Aaron: Nadab and Abihu, Eleazar and Ithamar.
- Bible in Basic English (BBE)
- Now the divisions into which the sons of Aaron were grouped were these: the sons of Aaron, Nadab and Abihu, Eleazar and Ithamar.
- Darby Translation (DBY)
- And the divisions of the sons of Aaron: the sons of Aaron, Nadab and Abihu, Eleazar and Ithamar.
- Webster's Bible (WBS)
- Now [these are] the divisions of the sons of Aaron. The sons of Aaron; Nadab, and Abihu, Eleazar, and Ithamar.
- Young's Literal Translation (YLT)
- And to the sons of Aaron [are] their courses: sons of Aaron [are] Nadab, and Abihu, Eleazar, and Ithamar,
Read in context
- 1అహరోను సంతతివారికి కలిగిన వంతులేవనగా, అహరోను కుమారులు నాదాబు అబీహు ఎలియాజరు ఈతామారు.
- 2నాదాబును అబీహుయును సంతతిలేకుండ తమ తండ్రికంటె ముందుగా చనిపోయిరి గనుక ఎలియా జరును ఈతామారును యాజకత్వము జరుపుచువచ్చిరి.
- 3దావీదు ఎలియాజరు సంతతివారిలో సాదోకును ఈతామారు సంతతివారిలో అహీమెలెకును ఏర్పరచి, వారి వారి జనముయొక్క లెక్కనుబట్టి పని నియమించెను.
Cross references
- 1 Chronicles 23:6 1 దినవృత్తాంతములు 23:6గెర్షోను కహాతు మెరారీయులు అను లేవీయులలో దావీదు వారిని వరుసలుగా విభాగించెను. గెర్షోనీయులలో లద్దాను షిమీ అనువారుండిరి.
- Exodus 6:23 నిర్గమకాండము 6:23అహరోను అమ్మినాదాబు కుమార్తెయు నయస్సోను సహోదరియునైన ఎలీషెబను పెండ్లిచేసి కొనెను. ఆమె అతనికి నాదాబును అబీహును ఎలియాజరును ఈతామారును కనెను.
- Numbers 26:60 సంఖ్యాకాండము 26:60అహరోనువలన నాదాబు అబీహు ఎలియాజరు ఈతామారు పుట్టిరి.
- 1 Chronicles 6:3 1 దినవృత్తాంతములు 6:3అమ్రాము కుమారులు అహరోను మోషే, కుమార్తె మిర్యాము. అహరోను కుమారులు నాదాబు అబీహు ఎలియాజరు ఈతామారు.
- Numbers 3:2 సంఖ్యాకాండము 3:2అహరోను కుమారుల పేరులు ఏవనగా, తొలుతపుట్టిన నాదాబు అబీహు ఎలియాజరు ఈతామారు అనునవే.
- Exodus 28:1 నిర్గమకాండము 28:1మరియు నాకు యాజకత్వము చేయుటకై నీ సహోదరుడైన అహరోనును అతని కుమారులను, అనగా అహరోనును, అహరోను కుమారులైన నాదాబును, అబీహును, ఎలియాజరును ఈతామారును ఇశ్రాయేలీయులలో నుండి నీ యొద్దకు పిలిపింపుము.
- Leviticus 10:1–6 లేవీయకాండము 10:1–6అహరోను కుమారులైన నాదాబు అబీహులు తమ తమ ధూపార్తులను తీసికొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యమువేసి, యెహోవా తమ కాజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను; వారు యెహోవా సన్నిధిని మృతి బొందిరి. అప్పుడు మోషే అహరోనుతో ఇట్లనెనుఇది యెహోవా చెప్పిన మాటనాయొద్దనుండు వారి యందు నేను నన్ను పరిశుద్ధపరచు కొందును; ప్రజలందరియెదుట నన్ను మహిమపరచు కొందును; అహరోను మౌనముగానుండగా మోషే అహరోను పిన తండ్రియైన ఉజ్జీయేలు కుమారులైన మీషా యేలును ఎల్సాఫానును పిలిపించిమీరు సమీపించి పరి శుద్ధ స్థలము నెదుటనుండి పాళెము వెలుపలికి మీ సహోదరుల శవములను మోసికొని పోవుడని వారితో చెప్పెను. మోషే చెప్పినట్లు వారు సమీపించి చొక్కాయిలను తీయకయే పాళెము వెలుపలికి వారిని మోసికొని పోయిరి. అప్పుడు మోషే అహరోనును అతని కుమారులైన ఎలియా జరు ఈతామారును వారితోమీరు చావకుండునట్లును యెహోవా ఈ సర్వసమాజముమీద ఆగ్రహపడకుండు నట్లును, మీరు తల విరియబోసికొనకూడదు; బట్టలను చింపుకొనకూడదు కాని, యెహోవా వారిని కాల్చినందుకు మీ సహోదరు లైన ఇశ్రాయేలీయుల యింటివారందరు ఏడవ వచ్చును.