1 Chronicles · chapter 24 · verse 3
1 Chronicles 24:3 in Telugu
దావీదు ఎలియాజరు సంతతివారిలో సాదోకును ఈతామారు సంతతివారిలో అహీమెలెకును ఏర్పరచి, వారి వారి జనముయొక్క లెక్కనుబట్టి పని నియమించెను.
Daaveedu eliyaajaru santativaarilo saadokunu eetaamaaru santativaarilo aheemelekunu erparachi, vaari vaari janamuyokka lekkanubatti pani niyaminchenu.
1 Chronicles 24:3 in English
- King James Version (KJV)
- And David distributed them, both Zadok of the sons of Eleazar, and Ahimelech of the sons of Ithamar, according to their offices in their service.
- World English Bible (WEB)
- David, with Zadok of the sons of Eleazar and Ahimelech of the sons of Ithamar, divided them according to their ordering in their service.
- American Standard Version (ASV)
- And David with Zadok of the sons of Eleazar, and Ahimelech of the sons of Ithamar, divided them according to their ordering in their service.
- Bible in Basic English (BBE)
- And David, with Zadok of the sons of Eleazar, and Ahimelech of the sons of Ithamar, made distribution of them into their positions for their work.
- Darby Translation (DBY)
- And David distributed them, both Zadok of the sons of Eleazar, and Ahimelech of the sons of Ithamar, according to their office in their service.
- Webster's Bible (WBS)
- And David distributed them, both Zadok of the sons of Eleazar, and Ahimelech of the sons of Ithamar, according to their offices in their service.
- Young's Literal Translation (YLT)
- And David distributeth them, and Zadok of the sons of Eleazar, and Ahimelech of the sons of Ithamar, according to their office in their service;
Read in context
- 1అహరోను సంతతివారికి కలిగిన వంతులేవనగా, అహరోను కుమారులు నాదాబు అబీహు ఎలియాజరు ఈతామారు.
- 2నాదాబును అబీహుయును సంతతిలేకుండ తమ తండ్రికంటె ముందుగా చనిపోయిరి గనుక ఎలియా జరును ఈతామారును యాజకత్వము జరుపుచువచ్చిరి.
- 3దావీదు ఎలియాజరు సంతతివారిలో సాదోకును ఈతామారు సంతతివారిలో అహీమెలెకును ఏర్పరచి, వారి వారి జనముయొక్క లెక్కనుబట్టి పని నియమించెను.
- 4వారిని ఏర్పరచుటలో ఈతామారు సంతతివారిలోని పెద్దలకంటె ఎలియాజరు సంతతివారిలోని పెద్దలు అధికులుగా కనబడిరి గనుక ఎలియాజరు సంతతివారిలో పదునారుగురు తమ పితరుల యింటివారికి పెద్దలుగాను, ఈతామారు సంతతి వారిలో ఎనిమిదిమంది తమ తమ పితరుల యింటివారికి పెద్దలుగాను నియమింపబడిరి.
- 5ఎలియాజరు సంతతిలోని వారును, ఈతామారు సంతతివారిలో కొందరును దేవునికి ప్రతిష్ఠితులగు అధికారులై యుండిరి గనుక తాము పరిశుద్ధ స్థలమునకు అధికారులుగా ఉండుటకై చీట్లువేసి వంతులు పంచుకొనిరి.
Cross references
- 2 Samuel 8:17 2 సమూయేలు 8:17అహీటూబు కుమారుడగు సాదోకును అబ్యాతారు కుమారుడగు అహీమెలెకును యాజకులు; శెరాయా లేఖికుడు;
- 1 Chronicles 24:31 1 దినవృత్తాంతములు 24:31వీరును తమ సహోదరులైన అహరోను సంతతివారు చేసినట్లు రాజైన దావీదు ఎదుటను సాదోకు అహీమెలెకు అను యాజకులలోను లేవీయులలోను పితరుల యిండ్ల పెద్దలయెదుటను తమలోనుండు పితరుల యింటి పెద్దలకును తమ చిన్న సహోదరులకును చీట్లు వేసికొనిరి.
- 1 Chronicles 6:4–8 1 దినవృత్తాంతములు 6:4–8ఎలియాజరు ఫీనెహాసును కనెను, ఫీనెహాసు అబీషూవను కనెను, అబీ షూవ బుక్కీని కనెను, బుక్కీ ఉజ్జీని కనెను, ఉజ్జీ జెరహ్యాను కనెను, జెరహ్యా మెరాయోతును కనెను, మెరాయోతు అమర్యాను కనెను, అమర్యా అహీటూబును కనెను, అహీటూబు సాదోకును కనెను, సాదోకు అహిమయస్సును కనెను,
- 1 Samuel 21:1 1 సమూయేలు 21:1దావీదు నోబులో యాజకుడైన అహీమెలెకు నొద్దకు వచ్చెను; అయితే అహీమెలెకు దావీదు రాకకు భయపడినీవు ఒంటరిగా వచ్చితివేమని అతని నడుగగా
- 1 Samuel 22:9–23 1 సమూయేలు 22:9–23అప్పుడు ఎదోమీయుడగు దోయేగు సౌలు సేవకుల దగ్గర నిలిచి యుండియెష్షయి కుమారుడు పారిపోయి నోబులోని అహీటూబు కుమారుడైన అహీమెలెకు దగ్గరకురాగా నేను చూచితిని. అహీమెలెకు అతని పక్షముగా యెహోవాయొద్ద విచారణచేసి, ఆహారమును ఫిలిష్తీయుడైన గొల్యాతు ఖడ్గమును అతని కిచ్చెనని చెప్పగా రాజు యాజకుడును అహీ టూబు కుమారుడునగు అహీ మెలెకును నోబులోనున్న అతని తండ్రి యింటివారైన యాజకులనందరిని పిలు వనంపించెను. వారు రాజునొద్దకు రాగా సౌలు అహీటూబు కుమారుడా, ఆలకించు మనగా అతడు చిత్తము నా యేలినవాడా అనెను. సౌలునీవు యెష్షయి కుమారునికి ఆహారమును ఖడ్గమును ఇచ్చి అతని పక్షమున దేవునియొద్ద విచారణచేసి, అతడు నామీదికి లేచి నేడు జరుగుచున్నట్టు పొంచి యుండుటకై అతడును నీవును జతకూడితిరేమని యడుగగా అహీమెలెకురాజా, రాజునకు అల్లుడై నమ్మకస్థుడై, ఆలోచనకర్తయై నీ నగరిలో ఘనతవహించిన దావీదువంటి వాడు నీ సేవకులందరిలో ఎవడున్నాడు? అతని పక్షముగా నేను దేవునియొద్ద విచారణచేయుట నేడే ఆరం భించితినా? అది నాకు దూరమగునుగాక; రాజు తమ దాసుడనైన నామీదను నా తండ్రి ఇంటి వారందరిమీదను ఈ నేరము మోపకుండును గాక. ఈ సంగతినిగూర్చి కొద్ది గొప్ప యేమియు నీ దాసుడనైన నాకు తెలిసినది కాదు అని రాజుతో మనవిచేయగా రాజు అహీమెలెకూ, నీకును నీ తండ్రి ఇంటివారికందరికిని మరణము నిశ్చయము అని చెప్పి యెహోవా యాజకులగు వీరు దావీదుతో కలిసినందునను, అతడు పారిపోయిన సంగతి తెలిసియు నాకు తెలియజేయక పోయినందునను మీరు వారిమీద పడి చంపుడని తనచుట్టు నిలిచియున్న కావలి వారికి ఆజ్ఞ ఇచ్చెను. రాజు సేవకులు యెహోవా యాజకులను హతము చేయనొల్లక యుండగా రాజు దోయేగుతోనీవు ఈ యాజకులమీద పడుమని చెప్పెను. అప్పుడు ఎదోమీయుడైన దోయేగు యాజకులమీద పడిఏఫోదు ధరించుకొనిన యెనుబది యయిదుగురిని ఆదినమున హతముచేసెను. మరియు అతడు యాజకుల పట్టణ మైన నోబు కాపురస్థులను కత్తివాత హతము చేసెను; మగ వారినేమి ఆడువారినేమి బాలురనేమి పసిపిల్లలనేమి యెడ్లనేమి గార్దభములనేమి గొఱ్ఱెలనేమి అన్ని టిని కత్తివాత హతముచేసెను. అయితే అహీటూబు కుమారుడైన అహీమెలెకు కుమారులలో అబ్యాతారు అను నొకడు తప్పించుకొని పారిపోయి దావీదునొద్దకు వచ్చి సౌలు యెహోవా యాజకులను చంపించిన సంగతి దావీదునకు తెలియజేయగా దావీదుఆ దినమున ఎదోమీయుడైన దోయేగు అక్కడనున్నందున వాడు సౌలునకు నిశ్చయ ముగా సంగతి తెలుపునని నేననుకొంటిని; నీ తండ్రి యింటివారికందరికిని మరణము రప్పించుటకు నేను కారకుడ నైతిని గదా. నీవు భయపడక నాయొద్ద ఉండుము, నా యొద్ద నీవు భద్రముగా ఉందువు; నా ప్రాణము తీయచూచు వాడును నీ ప్రాణము తీయచూచువాడును ఒకడే అని అబ్యాతారుతో చెప్పెను.
- 2 Samuel 20:25 2 సమూయేలు 20:25అహీలూదు కుమారుడగు యెహోషాపాతు రాజ్యపు దస్తావేజులమీద ఉండెను; షెవా లేఖికుడు;
- 1 Chronicles 16:39 1 దినవృత్తాంతములు 16:39గిబియోనులోని ఉన్నతస్థలముననున్న యెహోవా గుడారముమీదను అచ్చటి బలిపీఠముమీదను యెహోవా ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమందు వ్రాయబడియున్న ప్రకారము
- 1 Kings 2:35 1 రాజులు 2:35రాజు అతనికి బదులుగా యెహోయాదా కుమారుడైన బెనాయాను సేనాధిపతిగా నియమించెను. మరియు రాజు అబ్యాతారునకు బదులుగా యాజకుడైన సాదోకును నియ మించెను.
- 1 Chronicles 24:6 1 దినవృత్తాంతములు 24:6లేవీయులలో శాస్త్రిగానున్న నెతనేలు కుమారుడగు షెమయా రాజు ఎదుటను, అధిపతుల యెదు టను, యాజకుడైన సాదోకు ఎదుటను, అబ్యాతారు కుమారుడైన అహీమెలెకు ఎదుటను, యాజకులయెదుటను, లేవీయుల యెదుటను, పితరుల యిండ్లపెద్దలైన వారి యెదుటను వారి పేళ్లు దాఖలు చేసెను; ఒక్కొక్క పాత్రలోనుండి యొక పితరుని యింటి చీటి ఎలియాజరు పేరటను ఇంకొకటి ఈతా మారు పేరటను తీయబడెను.
- 1 Chronicles 12:27–28 1 దినవృత్తాంతములు 12:27–28అహరోను సంతతివారికి యెహోయాదా అధిపతి, అతనితోకూడ ఉన్నవారు మూడువేల ఏడు వందలమంది. పరాక్రమశాలియైన సాదోకు అను ¸యౌవనునితో కూడ అతని తండ్రి యింటివారైన అధిపతులు ఇరువదియిద్దరు.
- 1 Chronicles 6:50–53 1 దినవృత్తాంతములు 6:50–53అహరోను కుమారు లలో ఎలి యాజరు అను ఒకడుండెను; వీని కుమారుడు ఫీనెహాసు, ఫీనెహాసు కుమారుడు అబీషూవ, అబీషూవ కుమారుడు బుక్కీ, బుక్కీ కుమారుడు ఉజ్జీ, ఉజ్జీ కుమారుడు జెరహ్య, జెరహ్య కుమారుడు మెరాయోతు, మెరాయోతు కుమారుడు అమర్యా, అమర్యా కుమారుడు అహీటూబు, అహీటూబు కుమారుడు సాదోకు, సాదోకు కుమారుడు అహిమయస్సు.
- 1 Chronicles 15:11 1 దినవృత్తాంతములు 15:11అంతట దావీదు యాజకులైన సాదోకును అబ్యాతారును లేవీయులైన ఊరియేలు అశాయా యోవేలు షెమయా ఎలీయేలు అమ్మినాదాబు అనువారిని పిలిపించి వారితో ఇట్లనెను.