1 Chronicles · chapter 9 · verse 1
1 Chronicles 9:1 in Telugu
ఈ ప్రకారము ఇశ్రాయేలీయులందరును తమ వంశములచొప్పున సరిచూడబడినమీదట వారిపేళ్లు ఇశ్రాయేలురాజుల గ్రంథమందు వ్రాయబడెను. యూదా వారు చేసిన ద్రోహమునకై వారు బాబెలునకు చెరగొని పోబడిరి.
Ee prakaaramu ishraayeleeyulandarunu tama vanshamulachoppuna sarichoodabadinameedata vaaripellu ishraayeluraajula granthamandu vraayabadenu. Yoodaa vaaru chesina drohamunakai vaaru baabelunaku cheragoni pobadiri.
1 Chronicles 9:1 in English
- King James Version (KJV)
- So all Israel were reckoned by genealogies; and, behold, they [were] written in the book of the kings of Israel and Judah, [who] were carried away to Babylon for their transgression.
- World English Bible (WEB)
- So all Israel were listed by genealogies; and behold, they are written in the book of the kings of Israel. Judah was carried away captive to Babylon for their disobedience.
- American Standard Version (ASV)
- So all Israel were reckoned by genealogies; and, behold, they are written in the book of the kings of Israel. And Judah was carried away captive to Babylon for their transgression.
- Bible in Basic English (BBE)
- So all Israel was listed by their families; and, truly, they are recorded in the book of the kings of Israel. And Judah was taken away as prisoners to Babylon because of their sin.
- Darby Translation (DBY)
- And all Israel were registered by genealogy; and behold, they are written in the book of the kings of Israel. And Judah was carried away to Babylon because of their transgression.
- Webster's Bible (WBS)
- So all Israel were reckoned by genealogies; and behold, they [were] written in the book of the kings of Israel and Judah, [who] were carried away to Babylon for their transgression.
- Young's Literal Translation (YLT)
- And all Israel have reckoned themselves by genealogy, and lo, they are written on the book of the kings of Israel and Judah — they were removed to Babylon for their trespass.
Read in context
- 1ఈ ప్రకారము ఇశ్రాయేలీయులందరును తమ వంశములచొప్పున సరిచూడబడినమీదట వారిపేళ్లు ఇశ్రాయేలురాజుల గ్రంథమందు వ్రాయబడెను. యూదా వారు చేసిన ద్రోహమునకై వారు బాబెలునకు చెరగొని పోబడిరి.
- 2తమ స్వాస్థ్యములైన పట్టణములలో మునుపు కాపురమున్న వారెవరనగా ఇశ్రాయేలీయులును యాజకు లును లేవీయులును నెతీనీయులును.
- 3యూదావారిలోను బెన్యామీనీయులలోను ఎఫ్రాయిము మనష్షే సంబంధులలోను యెరూషలేమునందు కాపురమున్న వారెవరనగా
Cross references
- 1 Chronicles 5:25–26 1 దినవృత్తాంతములు 5:25–26అయితే వారు తమ పితరుల దేవునిమీద తిరుగుబాటుచేసి, దేవుడు తమ ముందర నాశనము చేసిన జనసమూహముల దేవతలతో వ్యభిచరించిరి. కాబట్టి ఇశ్రాయేలీయుల దేవుడు అష్షూరు రాజైన పూలు మనస్సును అష్షూరు రాజైన తిగ్లత్పిలేసెరు మనస్సును రేపగా అతడు రూబేనీయులను గాదీయులను మనష్షే అర్ధగోత్రమువారిని చెరపట్టి నేటికిని కనబడు చున్నట్లుగా హాలహునకును హాబోరునకును హారాకును గోజాను నదీప్రాంతములకును వారిని కొనిపోయెను.
- Nehemiah 7:64 నెహెమ్యా 7:64వీరి వంశా వళులనుబట్టి యెంచబడినవారిలో వారి పద్దు పుస్తకమును వెదకగా అది కనబడకపోయెను; కాగా వారు అపవిత్రు లుగా ఎంచబడి యాజకులలో ఉండకుండ వేరుపరచబడిరి.
- Nehemiah 7:5 నెహెమ్యా 7:5జనసంఖ్యచేయునట్లు నా దేవుడు నా హృదయములో తలంపు పుట్టింపగా, ప్రధానులను అధికారులను జనులను నేను సమకూర్చితిని. అంతలో ముందు వచ్చినవారినిగూర్చిన వంశావళి గ్రంథము నాకు కనబడెను, అందులో వ్రాయబడిన వంశావళులు ఇవి.
- Ezra 2:62–63 ఎజ్రా 2:62–63వీరు వంశావళి లెక్కలో తమ తమ పేరులను వెదకినప్పుడు అవి కనబడకపోయినందున యాజక ధర్మములోనుండి ప్రత్యేకింపబడి అపవిత్రులుగా ఎంచబడిరి. మరియు పారసీకుల అధికారిఊరీమును తుమీ్మ మును ధరించుకొనగల యొక యాజకుడు ఏర్పడు వరకు మీరు ప్రతిష్ఠితమైన వస్తువులను భుజింపకూడదని వారి కాజ్ఞాపించెను.
- Jeremiah 52:14–15 యిర్మీయా 52:14–15మరియు రాజదేహసంరక్షకుల యధిపతితోకూడ నుండిన కల్దీ యుల సేనాసంబంధులందరు యెరూషలేము చుట్టునున్న ప్రాకారములన్నిటిని పడగొట్టిరి మరియు రాజ దేహసంరక్షకుల యధిపతియైన నెబూజరదాను ప్రజ లలో కడుబీదలైన కొందరిని, పట్టణములో శేషించిన కొదువ ప్రజలను, బబులోనురాజు పక్షము చేరినవారిని, గట్టి పనివారిలో శేషించినవారిని చెరగొని పోయెను.
- Ezra 2:59 ఎజ్రా 2:59మరియు తేల్మెలహు తేల్హర్షా కెరూబు అద్దాను ఇమ్మేరు అను స్థలములలోనుండి కొందరు వచ్చిరి. అయితే వీరు తమ పితరులయొక్క యింటినైనను వంశావళినైనను చూపింప లేకపోయినందున వారు ఇశ్రాయేలీయులో కారో తెలియకపోయెను.
- Daniel 1:2 దానియేలు 1:2ప్రభువు యూదారాజగు యెహోయాకీమును దేవుని మందిరములోని శేషించిన ఉపకరణములను, ఆ రాజుచేతి కప్పగించెను గనుక అతడు ఆ వస్తువులను షీనారు దేశము లోని తన దేవతాలయమునకు తీసికొనిపోయి తన దేవతాలయపు బొక్కసములో ఉంచెను.
- Matthew 1:1–16 మత్తయి 1:1–16అబ్రాహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసు క్రీస్తు వంశావళి. అబ్రాహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను; యూదా తామారునందు పెరెసును, జెరహును కనెను;పెరెసు ఎస్రోమును కనెను ఎస్రోము అరామును కనెను, అరాము అమ్మీనాదాబును కనెను, అమ్మీనాదాబు నయస్సోనును కనెను; నయస్సోను శల్మానును కనెను, శల్మాను రాహాబునందు బోయజును కనెను, బోయజు రూతునందు ఓబేదును కనెను, ఓబేదు యెష్షయిని కనెను; యెష్షయి రాజైన దావీదును కనెను. ఊరియా భార్యగానుండిన ఆమెయందు దావీదు సొలొమోనును కనెను. సొలొమోను రెహబామును కనెను; రెహబాము అబీయాను కనెను, అబీయా ఆసాను కనెను; ఆసా యెహోషాపాతును కనెను, యెహోషాపాతు యెహోరామును కనెను, యెహోరాము ఉజ్జియాను కనెను; ఉజ్జియా యోతామును కనెను, యోతాము ఆహాజును కనెను, ఆహాజు హిజ్కియాను కనెను; హిజ్కియా మనష్షేను కనెను, మనష్షే ఆమోనును కనెను, ఆమోను యోషీయాను కనెను; యూదులు బబులోనుకు కొనిపోబడిన కాలములో యోషీయా యెకొన్యాను అతని సహోదరులను కనెను. బబులోనుకు కొనిపోబడిన తరువాత యెకొన్యా షయల్తీ యేలును కనెను, షయల్తీయేలు జెరుబ్బాబెలును కనెను; జెరుబ్బాబెలు అబీహూదును కనెను, అబీహూదు ఎల్యా కీమును కనెను, ఎల్యాకీము అజోరును కనెను; అజోరు సాదోకును కనెను, సాదోకు ఆకీమును కనెను, ఆకీము ఎలీహూదును కనెను; ఎలీహూదు ఎలియాజరును కనెను, ఎలియాజరు మత్తానును కనెను, మత్తాను యాకో బును కనెను; యాకోబు మరియ భర్తయైన యోసేపును కనెను, ఆమెయందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను.
- 2 Chronicles 33:11 2 దినవృత్తాంతములు 33:11కాబట్టి యెహోవా అష్షూరురాజుయొక్క సైన్యాధిపతులను వారి మీదికి రప్పించెను. మనష్షే తప్పించుకొని పోకుండ వారు అతని పట్టుకొని, గొలుసులతో బంధించి అతనిని బబులోనునకు తీసికొని పోయిరి.
- Luke 3:28–38 లూకా 3:28–38నేరి మెల్కీకి, మెల్కీ అద్దికి, అద్ది కోసాముకు, కోసాము ఎల్మదాముకు, ఎల్మదాము ఏరుకు, ఏరు యెహోషువకు, యెహోషువ ఎలీయెజెరుకు, ఎలీయెజెరు యోరీముకు, యోరీము మత్తతుకు, మత్తతు లేవికి, లేవి షిమ్యోనుకు, షిమ్యోను యూదాకు, యూదా యోసేపుకు, యోసేపు యోనాముకు, యోనాము ఎల్యా కీముకు, ఎల్యాకీము మెలెయాకు, మెలెయా మెన్నాకు, మెన్నా మత్తతాకు, మత్తతా నాతానుకు, నాతాను దావీదుకు, దావీదు యెష్షయికి, యెష్షయి ఓబేదుకు, ఓబేదు బోయజుకు, బోయజు శల్మానుకు, శల్మాను నయస్సోనుకు, నయస్సోను అమ్మినాదాబుకు, అమ్మినాదాబు అరాముకు, అరాము ఎస్రోముకు, ఎస్రోము పెరెసుకు, పెరెసు యూదాకు, యూదా యాకోబుకు, యాకోబు ఇస్సాకుకు, ఇస్సాకు అబ్రాహాముకు, అబ్రాహాము తెర హుకు, తెరహు నాహోరుకు, నాహోరు సెరూగుకు, సెరూగు రయూకు, రయూ పెలెగుకు, పెలెగు హెబెరుకు, హెబెరు షేలహుకు, షేలహు కేయినానుకు, కేయినాను అర్పక్షదుకు, అర్పక్షదు షేముకు, షేము నోవహుకు, నోవహు లెమెకుకు, లెమెకు మెతూషెలకు, మెతూషెల హనోకుకు, హనోకు యెరెదుకు, యెరెదు మహల లేలుకు, మహలలేలు కేయినానుకు, కేయినాను ఎనోషుకు, ఎనోషు షేతుకు, షేతు ఆదాముకు, ఆదాము దేవునికి కుమారుడు.
- 2 Chronicles 36:9–10 2 దినవృత్తాంతములు 36:9–10యెహోయాకీను ఏలనారంభించినప్పుడు ఎనిమిదేండ్ల వాడై యెరూషలేములో మూడు నెలల పది దినములు ఏలెను. అతడు యెహోవా దృష్టికి చెడునడత నడిచెను ఏడాదినాటికి, రాజైన నెబుకద్నెజరు దూతలను పంపి యెహోయాకీనును బబులోనునకు రప్పించి, అతని సహో దరుడైన సిద్కియాను యూదామీదను యెరూషలేము మీదను రాజుగా నియమించెను. మరియు అతడు రాజు వెంట యెహోవా మందిరములోని ప్రశస్తమైన ఉపకరణ ములను తెప్పించెను.
- Jeremiah 39:9 యిర్మీయా 39:9అప్పుడు రాజదేహ సంరక్షకుల కధిపతియగు నెబూజరదాను శేషించి పట్టణములో నిలిచి యున్న ప్రజలను, ద్రోహులై తమ రాజును విడిచి తనతో చేరినవారిని, శేషించిన ప్రజలనందరిని బబులోనునకు కొనిపోయెను.