1 Chronicles · chapter 9 · verse 2
1 Chronicles 9:2 in Telugu
తమ స్వాస్థ్యములైన పట్టణములలో మునుపు కాపురమున్న వారెవరనగా ఇశ్రాయేలీయులును యాజకు లును లేవీయులును నెతీనీయులును.
Tama svaasthyamulaina pattanamulalo munupu kaapuramunna vaarevaranagaa ishraayeleeyulunu yaajaku lunu leveeyulunu neteeneeyulunu.
1 Chronicles 9:2 in English
- King James Version (KJV)
- Now the first inhabitants that [dwelt] in their possessions in their cities [were], the Israelites, the priests, Levites, and the Nethinims.
- World English Bible (WEB)
- Now the first inhabitants who lived in their possessions in their cities were Israel, the priests, the Levites, and the temple servants.
- American Standard Version (ASV)
- Now the first inhabitants that dwelt in their possessions in their cities were Israel, the priests, the Levites, and the Nethinim.
- Bible in Basic English (BBE)
- Now the first to take up their heritage in their towns were: Israel, the priests, the Levites, and the Nethinim.
- Darby Translation (DBY)
- And the inhabitants that were first in their possessions in their cities were the Israelites, the priests, the Levites, and the Nethinim.
- Webster's Bible (WBS)
- Now the first inhabitants that [dwelt] in their possessions in their cities [were] , the Israelites, the priests, Levites, and the Nethinims.
- Young's Literal Translation (YLT)
- And the first inhabitants, who [are] in their possession, in their cities, of Israel, [are] the priests, the Levites, and the Nethinim.
Read in context
- 1ఈ ప్రకారము ఇశ్రాయేలీయులందరును తమ వంశములచొప్పున సరిచూడబడినమీదట వారిపేళ్లు ఇశ్రాయేలురాజుల గ్రంథమందు వ్రాయబడెను. యూదా వారు చేసిన ద్రోహమునకై వారు బాబెలునకు చెరగొని పోబడిరి.
- 2తమ స్వాస్థ్యములైన పట్టణములలో మునుపు కాపురమున్న వారెవరనగా ఇశ్రాయేలీయులును యాజకు లును లేవీయులును నెతీనీయులును.
- 3యూదావారిలోను బెన్యామీనీయులలోను ఎఫ్రాయిము మనష్షే సంబంధులలోను యెరూషలేమునందు కాపురమున్న వారెవరనగా
- 4యూదా కుమారుడైన పెరెసు సంతతివాడగు బానీ కుమారుడైన ఇమీకి పుట్టిన ఒమీ కుమారుడగు అమీహూదునకు జననమైన ఊతైయు.
Cross references
- Nehemiah 7:73 నెహెమ్యా 7:73అప్పుడు యాజకులు లేవీయులు ద్వారపాలకులు గాయ కులు జనులలో కొందరును, నెతీనీయులు ఇశ్రాయేలీయు లందరును, తమ పట్టణములయందు నివాసము చేసిరి.
- Ezra 8:20 ఎజ్రా 8:20మరియు లేవీయులు చేయవలసిన సేవలో తోడ్పడుటకై దావీదును అధిపతులును నిర్ణయించిన నెతీనీయులలో రెండువందల ఇరువదిమంది వచ్చిరి. వీరందరును పేర్లు ఉదాహరింపబడి నియమింపబడినవారు.
- Ezra 2:58 ఎజ్రా 2:58నెతీనీయులును సొలొమోను సేవకుల వంశస్థు లును అందరును కలిసి మూడువందల తొంబది యిద్దరు.
- Ezra 2:70 ఎజ్రా 2:70యాజకులును లేవీయులును జనులలో కొందరును గాయకులును ద్వారపాలకులును నెతీనీ యులును తమ పట్టణములకు వచ్చి కాపురముచేసిరి. మరియు ఇశ్రాయేలీయులందరును తమ తమ పట్టణములందు కాపురము చేసిరి.
- Ezra 2:43 ఎజ్రా 2:43నెతీనీయులలో జీహా వంశస్థులు హశూపా వంశస్థులు టబ్బాయోతు వంశస్థులు,
- Nehemiah 7:60 నెహెమ్యా 7:60ఈ నెతీనీయులందరును సొలొమోను దాసుల వంశస్థులును మూడువందల తొంబది యిద్దరు.
- Nehemiah 11:3–22 నెహెమ్యా 11:3–22యెరూష లేములో నివాసము చేసిన రాజ్యపు ప్రధానులు వీరే, యూదాపట్టణములలో ఎవరి స్వాస్థ్యములో వారు నివ సించుచుండిరి. వారెవరనగా ఇశ్రాయేలీయులును యాజ కులును లేవీయులును నెతీనీయులును సొలొమోనుయొక్క దాసుల వంశస్థులును నివాసము చేసిరి. మరియు యెరూష లేములో యూదులలో కొందరును బెన్యామీనీయులలో కొందరును నివసించిరి. యూదులలో ఎవరనగా, జెకర్యాకు పుట్టిన ఉజ్జియా కుమారుడైన అతాయా, యితడు షెఫట్యకు పుట్టిన అమర్యా కుమారుడు, వీడు షెఫట్యకు పుట్టిన పెరెసు వంశస్థుడగు మహలలేలు కుమారుడు. మరియు షిలోనికి పుట్టిన జెకర్యా కుమారునికి పుత్రుడైన యోయారీబు కనిన అదాయా కుమారుడైన హజాయాకు కలిగిన కొల్హోజెకు పుట్టిన బారూకు కుమారుడైన మయశేయా నివసించెను. యెరూషలేములో నివాసము చేసిన పెరెసు వంశస్థులందరును బలవంతులైన నాలుగువందల అరువది ఎనమండుగురు. బెన్యామీనీయులలో ఎవరనగా యోవేదు పెదాయా కోలాయా మయశేయా ఈతీయేలు యెషయా అను పితరుల వరుసలో మెషుల్లాము కుమారుడైన సల్లు. అతని తరువాత గబ్బయి సల్లయి; వీరందరును తొమ్మిదివందల ఇరువది యెనమండుగురు; జిఖ్రీ కుమారుడైన యోవేలు వారికి పెద్దగా ఉండెను. సెనూయా కుమారుడైన యూదా పట్టణముమీద రెండవ అధికారియై యుండెను. యాజకులలో ఎవరనగా యోయారీబు కుమారుడైన యెదా యాయు యాకీనును శెరాయా దేవుని మందిరమునకు అధిపతియై యుండెను. ఇతడు మషుల్లాము సాదోకు మెరాయోతు అహీటూబులను పితరుల వరుసలో హిల్కీ యాకు పుట్టెను. ఇంటిపని చేసినవారి సహోదరులు ఎనిమిదివందల ఇరువది యిద్దరు. మరియు పితరులైన మల్కీయా పషూరు జెకర్యా అవీ్జు పెలల్యాల వరుసలో యెరోహామునకు పుట్టిన అదాయా. పెద్దలలో ప్రధానులైన ఆ అదాయా బంధువులు రెండువందల నలువది యిద్దరు. మరియు ఇమ్మేరు మెషిల్లేమోతె అహజైయను పితరుల వరుసలో అజరేలునకు పుట్టిన అమష్షయి. బల వంతులైనవారి బంధువులు నూట ఇరువది యెనమండుగురు. వారికి జబ్దీయేలు పెద్దగా ఉండెను; ఇతడు ఘనులైన వారిలో ఒకని కుమారుడు. లేవీయులలో ఎవరనగా, షెమయా. ఇతడు బున్నీకి పుట్టిన హషబ్యాకనిన అజ్రీకాము కుమారుడైన హష్షూబునకు పుట్టినవాడు. లేవీయు లలో ప్రధానులైన వారిలో షబ్బెతైయును యోజా బాదును దేవుని మందిర బాహ్య విషయములో పై విచారణచేయు అధికారము పొందిరి. ఆసాపు కుమారుడైన జబ్దికి పుట్టిన మీకా కుమారుడైన మత్తన్యా ప్రార్థన స్తోత్రముల విషయములో ప్రధానుడు; తన సహోదరులలో బక్బుక్యాయును యెదూతూను కుమారుడైన గాలాలునకు పుట్టిన షమ్మూయ కుమారుడైన అబ్దాయును ఈ విషయములో అతని చేతిక్రింది వారు పరిశుద్ధ పట్టణములో ఉన్న లేవీయులందరు రెండువందల ఎనుబది నలుగురు. ద్వారపాలకులైన అక్కూబు టల్మోను గుమ్మములు కాయువారును నూట డెబ్బది యిద్దరు. ఇశ్రా యేలీయులలో శేషించిన యాజకులు లేవీయులు మొదలైన వారు యూదా పట్టణములన్నిటిలో ఎవరి స్వాస్థ్యములో వారు ఉండిరి. నెతీనీయులు ఓపెలులో నివసించిరి. జీహాయు గిష్పాయును నెతీనీయులకు ప్రధానులు. యెరూషలేములో ఉన్న లేవీయులకు మీకాకు పుట్టిన మత్తన్యా కుమారుడైన హషబ్యా కనిన బానీ కుమారుడైన ఉజ్జీ ప్రధానుడు; ఆసాపు కుమారులలో గాయకులు దేవుని మందిరముయొక్క పనిమీద అధికారులు
- Joshua 9:21–27 యెహోషువ 9:21–27వారిని బ్రదుకనియ్యు డని సెలవిచ్చిరి గనుక ప్రధానులు తమతో చెప్పినట్లు వారు సర్వసమాజమునకును కట్టెలు నరుకువారుగాను నీళ్లు చేదువారుగాను ఏర్పడిరి. మరియు యెహోషువ వారిని పిలిపించి యిట్లనెనుమీరు మా మధ్యను నివసించువారై యుండియుమేము మీకు బహు దూరముగా నున్న వారమని చెప్పి మమ్ము నేల మోసపుచ్చితిరి? ఆ హేతువుచేతను మీరు శాపగ్రస్తులగుదురు, దాస్యము మీకెన్నడును మానదు, నా దేవుని ఆలయమునకు మీరు కట్టెలు నరుకువారును నీళ్లు చేదువారునై యుండకమానరు. అందుకు వారు యెహోషువను చూచినీ దేవుడైన యెహోవా ఈ సమస్త దేశమును మీకిచ్చి, మీ యెదుట నిలువకుండ ఈ దేశనివాసులనందరిని నశింపజేయునట్లు తన సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించెనని నీ దాసులకు రూఢిగా తెలుపబడెను గనుక మేము మా ప్రాణముల విషయములో నీవలన మిక్కిలి భయపడి యీలాగు చేసితివిు. కాబట్టి మేము నీ వశమున నున్నాము; మాకేమి చేయుట నీ దృష్టికి న్యాయమో యేది మంచిదో అదే చేయుమని యెహోషువకు ఉత్తర మిచ్చిరి. కాగా అతడు ఆలాగు చేసి ఇశ్రాయేలీయులు గిబియోనీయులను చంపకుండ వారి చేతులలోనుండి విడిపించెను. అయితే సమాజము కొరకును యెహోవా ఏర్పరచుకొను చోటుననుండు బలి పీఠము కొరకును కట్టెలు నరుకువారుగాను నీళ్లు చేదువారు గాను యెహోషువ ఆ దినమందే వారిని నియమించెను. నేటివరకు వారు ఆ పని చేయువారై యున్నారు.