1 Timothy · chapter 6 · verse 4
1 Timothy 6:4 in Telugu
వాడేమియు ఎరుగక తర్కములనుగూర్చియు వాగ్వాదములను గూర్చియు వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాంధుడగును. వీటిమూలముగా అసూయ కలహము దూషణలు దురనుమానములును,
Vaademiyu erugaka tarkamulanugoorchiyu vaagvaadamulanu goorchiyu vyarthamugaa prayaasapaduchu garvaandhudagunu. Veetimoolamugaa asooya kalahamu dooshanalu duranumaanamulunu,
1 Timothy 6:4 in English
- King James Version (KJV)
- He is proud, knowing nothing, but doting about questions and strifes of words, whereof cometh envy, strife, railings, evil surmisings,
- World English Bible (WEB)
- he is conceited, knowing nothing, but obsessed with arguments, disputes, and word battles, from which come envy, strife, insulting, evil suspicions,
- American Standard Version (ASV)
- he is puffed up, knowing nothing, but doting about questionings and disputes of words, whereof cometh envy, strife, railings, evil surmisings,
- Bible in Basic English (BBE)
- He has an over-high opinion of himself; being without knowledge, having only an unhealthy love of questionings and wars of words, from which come envy, fighting, cruel words, evil thoughts,
- Darby Translation (DBY)
- he is puffed up, knowing nothing, but sick about questions and disputes of words, out of which arise envy, strife, injurious words, evil suspicions,
- Webster's Bible (WBS)
- He is proud, knowing nothing, but doting about questions and strifes of words, from which cometh envy, strife, railings, evil surmisings,
- Young's Literal Translation (YLT)
- he is proud, knowing nothing, but doting about questions and word-striving, out of which doth come envy, strife, evil-speakings, evil-surmisings,
Read in context
- 2విశ్వాసులైన యజమానులుగల దాసులు తమ యజమానులు సహోదరులని వారిని తృణీకరింపక, తమ సేవాఫలము పొందువారు విశ్వాసులును ప్రియులునై యున్నారని మరి యెక్కువగా వారికి సేవచేయవలెను; ఈ సంగతులు బోధించుచు వారిని హెచ్చరించుము.
- 3ఎవడైనను మన ప్రభువైన యేసుక్రీస్తుయొక్క హిత వాక్యములను దైవభక్తికి అనుగుణ్యమైన బోధను అంగీకరింపక, భిన్నమైనబోధనుపదేశించినయెడల
- 4వాడేమియు ఎరుగక తర్కములనుగూర్చియు వాగ్వాదములను గూర్చియు వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాంధుడగును. వీటిమూలముగా అసూయ కలహము దూషణలు దురనుమానములును,
- 5చెడిపోయిన మనస్సుకలిగి సత్యహీనులై దైవభక్తి లాభసాధనమనుకొను మనుష్యుల వ్యర్థవివాదములును కలుగుచున్నవి.
- 6సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్పలాభసాధనమై యున్నది.
Cross references
- 2 Timothy 2:23 2 తిమోతికి 2:23నేర్పులేని మూఢుల వితర్కములు జగడములను పుట్టించునని యెరిగి అట్టివాటిని విసర్జించుము.
- 2 Timothy 3:4 2 తిమోతికి 3:4ద్రోహులు మూర్ఖులు గర్వాంధులు దేవునికంటె సుఖాను భవము నెక్కువగా ప్రేమించువారు,
- 2 Timothy 2:14 2 తిమోతికి 2:14వినువారిని చెరుపుటకే గాని మరి దేనికిని పనికిరాని మాటలనుగూర్చి వాదము పెట్టుకొనవద్దని, ప్రభువు ఎదుట వారికి సాక్ష్యమిచ్చుచు ఈ సంగతులను వారికి జ్ఞాపకము చేయుము.
- 1 Timothy 3:6 1 తిమోతికి 3:6అతడు గర్వాంధుడై అపవాదికి కలిగిన శిక్షావిధికి లోబడకుండునట్లు క్రొత్తగా చేరినవాడై యుండకూడదు.
- Jude 1:10 యూదా 1:10వీరైతే తాము గ్రహింపని విషయములనుగూర్చి దూషించువారై, వివేకశూన్యములగు మృగములవలె వేటిని స్వాభావికముగా ఎరుగుదురో వాటివలన తమ్మునుతాము నాశనముచేసికొనుచున్నారు.
- 2 Peter 2:12 2 పేతురు 2:12వారైతే పట్టబడి చంప బడుటకే స్వభావసిద్ధముగా పుట్టిన వివేకశూన్యములగు మృగములవలె ఉండి, తమకు తెలియని విషయములను గూర్చి దూషించుచు, తమ దుష్ప్రవర్తనకు ప్రతిఫలముగా హాని అనుభవించుచు, తాము చేయు నాశనముతోనే తామే నాశనము పొందుదురు,
- 1 Timothy 1:7 1 తిమోతికి 1:7నిశ్చయమైనట్టు రూఢిగా పలుకువాటినైనను గ్రహింపక పోయినను ధర్మశాస్త్రోపదేశకులై యుండగోరి విష్ప్రయోజనమైన ముచ్చటలకు తిరిగిరి.
- Jude 1:16 యూదా 1:16వారు తమ దురాశలచొప్పున నడుచుచు, లాభమునిమిత్తము మనుష్యులను కొనియాడుచు, సణుగువారును తమ గతినిగూర్చి నిందించువారునై యున్నారు; వారి నోరు డంబమైన మాటలు పలుకును.
- 2 Peter 2:18 2 పేతురు 2:18వీరు వ్యర్థమైన డంబపుమాటలు పలుకుచు, తామే శరీరసంబంధమైన దురాశలుగలవారై, తప్పుమార్గమందు నడుచువారిలోనుండి అప్పుడే తప్పించు కొనినవారిని పోకిరిచేష్టలచేత మరలుకొల్పుచున్నారు.
- 1 Timothy 1:4 1 తిమోతికి 1:4విశ్వాససంబంధమైన దేవుని యేర్పా టుతో కాక వివాదములతోనే సంబంధము కలిగియున్నవి గనుక, వాటిని లక్ష్యపెట్టవద్దనియు, కొందరికి ఆజ్ఞాపించు టకు నీవు ఎఫెసులో నిలిచియుండవలెనని నిన్ను హెచ్చ రించిన ప్రకారము ఇప్పుడును హెచ్చరించుచున్నాను.
- Titus 3:9 తీతుకు 3:9అవివేకతర్కములును వంశావళులును కలహములును ధర్మశాస్త్రమునుగూర్చిన వివాదములును నిష్ప్రయోజనమును వ్యర్థమునై యున్నవి గనుక వాటికి దూరముగా ఉండుము.
- James 1:19 యాకోబు 1:19నా ప్రియ సహోదరులారా, మీరీసంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదా నించువాడునై యుండవలెను.
Original words (Greek)
- proud · G5187τυφόω typhóō
- knowing · G1987ἐπίσταμαι epístamai
- nothing · G3367μηδείς mēdeís
- but · G235ἀλλά allá
- doting · G3552νοσέω noséō
- about · G4012περί perí
- questions · G2214ζήτησις zḗtēsis
- and · G2532καί kaí
- words · G3055λογομαχία logomachía
- where · G3739ὅς hós
- of · G1537ἐκ ek
- cometh · G1096γίνομαι gínomai
- envy · G5355φθόνος phthónos
- strife · G2054ἔρις éris
- railings · G988βλασφημία blasphēmía
- evil · G4190πονηρός ponērós
- surmisings · G5283ὑπόνοια hypónoia