2 Chronicles · chapter 12 · verse 14
2 Chronicles 12:14 in Telugu
అతడు తన మనస్సు యెహోవాను వెదకుట యందు నిలుపుకొనక చెడుక్రియలు చేసెను.
Atadu tana manassu yehovaanu vedakuta yandu nilupukonaka chedukriyalu chesenu.
2 Chronicles 12:14 in English
- King James Version (KJV)
- And he did evil, because he prepared not his heart to seek the LORD.
- World English Bible (WEB)
- He did that which was evil, because he didn’t set his heart to seek the LORD.
- American Standard Version (ASV)
- And he did that which was evil, because he set not his heart to seek Jehovah.
- Bible in Basic English (BBE)
- And he did evil because his heart was not true to the Lord.
- Darby Translation (DBY)
- And he did evil, for he applied not his heart to seek Jehovah.
- Webster's Bible (WBS)
- And he did evil, because he prepared not his heart to seek the LORD.
- Young's Literal Translation (YLT)
- and he doth the evil thing, for he hath not prepared his heart to seek Jehovah.
Read in context
- 12అతడు తన్ను తాను తగ్గించుకొనినందున యెహోవా అతని బొత్తిగా నిర్మూలముచేయక, యూదావారు కొంత మట్టుకు మంచితనము ననుసరించుట చూచి తన కోపము అతనిమీదనుండి త్రిప్పుకొనెను.
- 13రాజైన రెహబాము యెరూషలేమునందు స్థిరపడి యేలుబడి చేసెను; రెహబాము ఏలనారంభించినప్పుడు నలుబదియొక సంవత్సరముల యీడుగల వాడై యుండెను; తన నామమును అచ్చట ఉంచుటకై ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటిలోనుండి యెహోవా కోరుకొనిన పట్టణమగు యెరూషలేమునందు అతడు పదునేడు సంవత్సరములు ఏలెను, అతని తల్లి పేరు నయమా, ఆమె అమ్మో నీయురాలు.
- 14అతడు తన మనస్సు యెహోవాను వెదకుట యందు నిలుపుకొనక చెడుక్రియలు చేసెను.
- 15రెహబాము చేసిన కార్యములన్నిటిని గూర్చియు షెమయా రచించిన గ్రంథమందును దీర్ఘదర్శియైన ఇద్దో రచించిన వంశావళియందును వ్రాయబడియున్నది.
- 16రెహ బామునకును యరొబామునకును యుద్ధము యెడతెగక జరిగెను. రెహబాము తన పితరులతో కూడ నిద్రించి దావీదుపట్టణమందు పాతిపెట్టబడెను, అతని కుమారుడైన అబీయా అతనికి బదులుగా రాజాయెను.
Cross references
- 2 Chronicles 19:3 2 దినవృత్తాంతములు 19:3అయితే దేశములోనుండి నీవు దేవతాస్తంభములను తీసివేసి దేవునియొద్ద విచారణచేయుటకు నీవు మనస్సు నిలుపుకొనియున్నావు, నీయందు మంచి క్రియలు కనబడుచున్నవి.
- Isaiah 45:19 యెషయా 45:19అంధకారదేశములోని మరుగైనచోటున నేను మాట లాడలేదు మాయాస్వరూపుడనైనట్టు నన్ను వెదకుడని యాకోబు సంతానముతో నేను చెప్పలేదు నేను న్యాయమైన సంగతులు చెప్పువాడను యథార్థమైన సంగతులు తెలియజేయువాడను అగు యెహోవాను నేనే.
- 1 Corinthians 16:13 1 కొరింథీయులకు 16:13మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలుకడగా ఉండుడి, పౌరుషముగలవారై యుండుడి, బలవంతులై యుండుడి;
- Ezekiel 33:31 యెహెజ్కేలు 33:31నా జనులు రాదగిన విధముగా వారు నీయొద్దకు వచ్చి, నా జనులైనట్టుగా నీ యెదుట కూర్చుండి నీ మాటలు విందురు గాని వాటి ననుసరించి ప్రవర్తింపరు, వారు నోటితో ఎంతో ప్రేమ కనుపరచుదురు గాని వారి హృదయము లాభమును అపేక్షించు చున్నది.
- Isaiah 55:6–7 యెషయా 55:6–7యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడు కొనుడి. భక్తిహీనులు తమ మార్గమును విడువవలెను దుష్టులు తమ తలంపులను మానవలెను వారు యెహోవావైపు తిరిగినయెడల ఆయన వారి యందు జాలిపడును వారు మన దేవునివైపు తిరిగినయెడల ఆయన బహుగా క్షమించును.
- 1 Corinthians 15:58 1 కొరింథీయులకు 15:58కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థముకాదని యెరిగి, స్థిరులును, కదలనివారును, ప్రభువు కార్యాభివృద్ధియందు ఎప్పటికిని ఆసక్తులునై యుండుడి.
- 2 Chronicles 30:19 2 దినవృత్తాంతములు 30:19పరిశుద్ధస్థలముయొక్క శుద్ధీకరణముచొప్పున తన్ను పవిత్రపరచుకొనకయే తన పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయింప మనస్సు నిలుపుకొనిన ప్రతి వాని నిమిత్తము దయగల యెహోవా ప్రాయశ్చిత్తము చేయునుగాక అని ప్రార్థింపగా
- 2 Chronicles 11:16 2 దినవృత్తాంతములు 11:16వారి చర్యలట్లుండగా ఇశ్రాయేలీయుల గోత్రములయం దంతటను ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను వెదకుటకు మనస్సు నిలుపుకొనినవారు తమ పితరుల దేవుడైన యెహోవాకు బలుల నర్పించుటకై యెరూషలేమునకు వచ్చిరి.
- Psalm 78:8 కీర్తనలు 78:8ఆయన యాకోబు సంతతికి శాసనములను నియమించెను ఇశ్రాయేలు సంతతికి ధర్మశాస్త్రము ననుగ్రహించెను మన పితరులు తమ పుత్రులకు దానిని తెలుపవలెనని వారికాజ్ఞాపించెను
- Psalm 105:3–4 కీర్తనలు 105:3–4ఆయన పరిశుద్ధ నామమునుబట్టి అతిశయించుడి. యెహోవాను వెదకువారు హృదయమందు సంతోషించుదురుగాక. యెహోవాను వెదకుడి ఆయన బలమును వెదకుడి ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి
- Psalm 78:37 కీర్తనలు 78:37నోటి మాటతో వారు ఆయనను ముఖస్తుతిచేసిరి తమ నాలుకలతో ఆయనయొద్ద బొంకిరి.
- 1 Samuel 7:3 1 సమూయేలు 7:3సమూయేలు ఇశ్రాయేలీయులందరితో ఇట్లనెనుమీ పూర్ణహృదయ ముతో యెహోవాయొద్దకు మీరు మళ్లుకొనినయెడల, అన్యదేవతలను అష్తారోతు దేవతలను మీ మధ్యనుండి తీసి వేసి, పట్టుదలగలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయ నను సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలోనుండి మిమ్మును విడిపించును.