2 Chronicles · chapter 15 · verse 17
2 Chronicles 15:17 in Telugu
ఆసా ఉన్నత స్థలములను ఇశ్రాయేలీయులలోనుండి తీసివేయలేదు గాని యితడు బ్రదికిన కాలమంతయు ఇతని హృదయము యథార్థముగా ఉండెను.
Aasaa unnata sthalamulanu ishraayeleeyulalonundi teesiveyaledu gaani yitadu bradikina kaalamantayu itani hrudayamu yathaarthamugaa undenu.
2 Chronicles 15:17 in English
- King James Version (KJV)
- But the high places were not taken away out of Israel: nevertheless the heart of Asa was perfect all his days.
- World English Bible (WEB)
- But the high places were not taken away out of Israel; nevertheless the heart of Asa was perfect all his days.
- American Standard Version (ASV)
- But the high places were not taken away out of Israel: nevertheless the heart of Asa was perfect all his days.
- Bible in Basic English (BBE)
- But the high places were not taken away out of Israel; but still the heart of Asa was true to the Lord all his life.
- Darby Translation (DBY)
- But the high places were not removed from Israel; only, Asa's heart was perfect all his days.
- Webster's Bible (WBS)
- But the high places were not taken away out of Israel: nevertheless the heart of Asa was perfect all his days.
- Young's Literal Translation (YLT)
- yet the high places have not turned aside from Israel; only, the heart of Asa hath been perfect all his days.
Read in context
- 15ఈలాగు ప్రమాణము చేయబడగా యూదావారందరును సంతో షించిరి; వారు పూర్ణహృదయముతో ప్రమాణముచేసి పూర్ణమనస్సుతో ఆయనను వెదకియుండిరి గనుక యెహోవా వారికి ప్రత్యక్షమై చుట్టునున్న దేశస్థులతో యుద్ధములు లేకుండ వారికి నెమ్మది కలుగజేసెను.
- 16మరియు తన తల్లియైన మయకా అసహ్యమైన యొక దేవతా స్తంభమును నిలిపినందున ఆమె యిక పట్టపుదేవియై యుండకుండ రాజైన ఆసా ఆమెను త్రోసివేసి, ఆమె నిలిపిన విగ్రహమును పడగొట్టి ఛిన్నాభిన్నము చేసి కిద్రోను వాగుదగ్గర దాని కాల్చివేసెను.
- 17ఆసా ఉన్నత స్థలములను ఇశ్రాయేలీయులలోనుండి తీసివేయలేదు గాని యితడు బ్రదికిన కాలమంతయు ఇతని హృదయము యథార్థముగా ఉండెను.
- 18తన తండ్రి ప్రతిష్ఠించి నట్టియు, తాను ప్రతిష్ఠించినట్టియు వెండిని బంగారమును ఉపకరణములను అతడు తీసికొని దేవుని మందిరమునం దుంచెను.
- 19ఆసా యేలుబడియందు ముప్పది యయిదవ సంవత్సరమువరకు యుద్ధములు జరుగలేదు.
Cross references
- 1 Kings 22:43 1 రాజులు 22:43అతడు తన తండ్రియైన ఆసాయొక్క మార్గములన్నిటి ననుసరించి, యెహోవా దృష్టికి అనుకూలముగా ప్రవర్తించుచు వచ్చెను. అయితే ఉన్నత స్థలములను తీసివేయలేదు; ఉన్నత స్థలములలో జనులు ఇంకను బలులు అర్పిం చుచు ధూపము వేయుచు నుండిరి.
- 2 Kings 12:3 2 రాజులు 12:3అయితే ఉన్నత స్థలములు కొట్టివేయబడక నిలిచెను; జనులు ఇంకను ఉన్నత స్థలములందు బలులు అర్పించుచు ధూపము వేయుచు నుండిరి.
- 2 Kings 14:4 2 రాజులు 14:4అయితే అతడు ఉన్నత స్థలములను కొట్టివేయ లేదు; జనులు ఇంకను ఉన్నత స్థలములలో బలులనర్పించుచు ధూపము వేయుచునుండిరి.
- Deuteronomy 12:13–14 ద్వితీయోపదేశకాండము 12:13–14నీవు చూచిన ప్రతి స్థలమున నీ దహనబలులను అర్పింపకూడదు సుమీ. యెహోవా నీ గోత్రములలో ఒకదానియందు ఏర్పరచుకొను స్థలముననే నీ దహనబలులను అర్పించి నేను మీకా జ్ఞాపించుచున్న సమస్తమును అక్కడనే జరిగింపవలెను.
- 1 Kings 11:4 1 రాజులు 11:4సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతలతట్టు త్రిప్పగా అతని తండ్రియైన దావీదు హృదయమువలె అతని హృదయము దేవుడైన యెహోవాయెడల యథార్థము కాక పోయెను.
- 2 Chronicles 14:3–5 2 దినవృత్తాంతములు 14:3–5అన్యదేవతల బలిపీఠములను పడగొట్టి ఉన్నతస్థలములను పాడుచేసి ప్రతిమలను పగులగొట్టి దేవతా స్తంభములను కొట్టివేయించి వారి పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకును, ధర్మశాస్త్రమునుబట్టియు విధినిబట్టియు క్రియలు జరిగించుటకును, యూదావారికి ఆజ్ఞాపించి ఉన్నత స్థలములను సూర్య దేవతాస్తంభములను యూదావారి పట్టణములన్నిటిలోనుండి తీసివేసెను. అతనియేలు బడియందు రాజ్యము నెమ్మదిగా ఉండెను.
- 1 Kings 3:2–4 1 రాజులు 3:2–4ఆ దినముల వరకు యెహోవా నామమున కట్టింపబడిన మందిరము లేకపోగా జనులు ఉన్నత స్థలములయందు మాత్రము బలులను అర్పించుచు వచ్చిరి. తన తండ్రియైన దావీదు నియమించిన కట్టడలను అనుసరించుచు సొలొమోను యెహోవాయందు ప్రేమయుంచెను గాని యున్నత స్థలములయందు అతడు బలులను మాత్రము అర్పించుచు ధూపము వేయుచు నుండెను. గిబియోను ముఖ్యమైన ఉన్నతస్థలమై యుండెను గనుక బలుల నర్పించుటకై రాజు అక్కడికి పోయి ఆ బలిపీఠముమీద వెయ్యి దహనబలులను అర్పించెను.
- 2 Chronicles 16:7–12 2 దినవృత్తాంతములు 16:7–12ఆ కాలమందు దీర్ఘదర్శియైన హనానీ యూదా రాజైన ఆసాయొద్దకు వచ్చి అతనితో ఈలాగు ప్రకటించెనునీవు నీ దేవుడైన యెహోవాను నమ్ముకొ నక సిరియా రాజును నమ్ముకొంటివే? సిరియా రాజుయొక్క సైన్యము నీ వశము నుండి తప్పించుకొనిపోయెను. బహు విస్తారమైన రథము లును గుఱ్ఱపు రౌతులునుగల కూషీయులును లూబీయులును గొప్ప దండై వచ్చిరిగదా? అయినను నీవు యెహోవాను నమ్ముకొనినందున ఆయన వారిని నీచేతి కప్పగించెను. తనయెడల యథార్థహృదయముగలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతట సంచారము చేయుచున్నది; యీ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి గనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును. ఆ దీర్ఘదర్శి అట్లు ప్రకటించినందుకు ఆసా అతనిమీద కోపగించి రౌద్రము చూపి అతనిని బందీగృహ ములో వేసెను, ఇదియు గాక ఆ సమయమందే ఆసా జనులలో కొందరిని బాధపరచెను. ఆసా చేసిన కార్యము లన్నిటినిగూర్చి యూదా ఇశ్రాయేలు రాజుల గ్రంథమందు వ్రాయబడియున్నది. ఆసా తన యేలుబడియందు ముప్పది తొమ్మిదవ సంవత్సరమున పాదములలో జబ్బుపుట్టి తాను బహు బాధపడినను దాని విషయములో అతడు యెహోవాయొద్ద విచారణచేయక వైద్యులను పట్టుకొనెను.