2 Chronicles · chapter 15 · verse 16
2 Chronicles 15:16 in Telugu
మరియు తన తల్లియైన మయకా అసహ్యమైన యొక దేవతా స్తంభమును నిలిపినందున ఆమె యిక పట్టపుదేవియై యుండకుండ రాజైన ఆసా ఆమెను త్రోసివేసి, ఆమె నిలిపిన విగ్రహమును పడగొట్టి ఛిన్నాభిన్నము చేసి కిద్రోను వాగుదగ్గర దాని కాల్చివేసెను.
Mariyu tana talliyaina mayakaa asahyamaina yoka devataa stambhamunu nilipinanduna aame yika pattapudeviyai yundakunda raajaina aasaa aamenu trosivesi, aame nilipina vigrahamunu padagotti chhinnaabhinnamu chesi kidronu vaagudaggara daani kaalchivesenu.
2 Chronicles 15:16 in English
- King James Version (KJV)
- And also [concerning] Maachah the mother of Asa the king, he removed her from [being] queen, because she had made an idol in a grove: and Asa cut down her idol, and stamped [it], and burnt [it] at the brook Kidron.
- World English Bible (WEB)
- Also Maacah, the mother of Asa the king, he removed from being queen mother, because she had made an abominable image for an Asherah; so Asa cut down her image, ground it into dust, and burned it at the brook Kidron.
- American Standard Version (ASV)
- And also Maacah, the mother of Asa the king, he removed from being queen, because she had made an abominable image for an Asherah; and Asa cut down her image, and made dust of it, and burnt it at the brook Kidron.
- Bible in Basic English (BBE)
- And Asa would not let Maacah, his mother, be queen, because she had made a disgusting image for Asherah; and Asa had her image cut down and broken up and burned by the stream Kidron.
- Darby Translation (DBY)
- And also Maachah, the mother of Asa the king, he removed from being queen, because she had made an idol for the Asherah; and Asa cut down her idol, and stamped it, and burned it in the valley Kidron.
- Webster's Bible (WBS)
- And also [concerning] Maachah the mother of Asa the king, he removed her from [being] queen, because she had made an idol in a grove: and Asa cut down her idol, and stamped [it] , and burnt [it] at the brook Kidron.
- Young's Literal Translation (YLT)
- And also Maachah, mother of Asa the king — he hath removed her from [being] mistress, in that she hath made for a shrine a horrible thing, and Asa cutteth down her horrible thing, and beateth [it] small, and burneth [it] by the brook Kidron:
Read in context
- 14వారు ఎలుగెత్తి బొబ్బలిడుచు, మేళములతోను బూరల నాదముతోను భేరీధ్వనులతోను యెహోవా సన్నిధిని ప్రమాణము చేసిరి.
- 15ఈలాగు ప్రమాణము చేయబడగా యూదావారందరును సంతో షించిరి; వారు పూర్ణహృదయముతో ప్రమాణముచేసి పూర్ణమనస్సుతో ఆయనను వెదకియుండిరి గనుక యెహోవా వారికి ప్రత్యక్షమై చుట్టునున్న దేశస్థులతో యుద్ధములు లేకుండ వారికి నెమ్మది కలుగజేసెను.
- 16మరియు తన తల్లియైన మయకా అసహ్యమైన యొక దేవతా స్తంభమును నిలిపినందున ఆమె యిక పట్టపుదేవియై యుండకుండ రాజైన ఆసా ఆమెను త్రోసివేసి, ఆమె నిలిపిన విగ్రహమును పడగొట్టి ఛిన్నాభిన్నము చేసి కిద్రోను వాగుదగ్గర దాని కాల్చివేసెను.
- 17ఆసా ఉన్నత స్థలములను ఇశ్రాయేలీయులలోనుండి తీసివేయలేదు గాని యితడు బ్రదికిన కాలమంతయు ఇతని హృదయము యథార్థముగా ఉండెను.
- 18తన తండ్రి ప్రతిష్ఠించి నట్టియు, తాను ప్రతిష్ఠించినట్టియు వెండిని బంగారమును ఉపకరణములను అతడు తీసికొని దేవుని మందిరమునం దుంచెను.
Cross references
- 1 Kings 15:13–24 1 రాజులు 15:13–24మరియు తన అవ్వ యైన మయకా అసహ్యమైన యొకదాని చేయించి, దేవతాస్తంభము ఒకటి నిలుపగా ఆసా ఆ విగ్రహమును ఛిన్నాభిన్నములుగా కొట్టించి, కిద్రోను ఓరను దాని కాల్చివేసి ఆమె పట్టపుదేవికాకుండ ఆమెను తొలగించెను. ఆసా తన దినములన్నియు హృదయపూర్వకముగా యెహోవాను అనుసరించెను గాని ఉన్నత స్థలములను తీసివేయకపోయెను. మరియు అతడు తన తండ్రి ప్రతిష్ఠించిన వస్తువులను తాను ప్రతిష్ఠించిన వస్తువులను, వెండియు బంగారమును ఉపకరణములను యెహోవా మందిరములోనికి తెప్పించెను. వారు బ్రదికిన దినములన్నిటను ఆసాకును ఇశ్రాయేలు రాజైన బయె షాకును యుద్ధము జరుగుచుండెను. ఇశ్రాయేలు రాజైన బయెషా యూదావారికి విరోధియై యుండి, యూదా రాజైన ఆసాయొద్దనుండి యెవరును రాకుండను అతని యొద్దకు ఎవరును పోకుండను, రామాపట్టణమును కట్టిం చెను. కాబట్టి ఆసా యెహోవా మందిరపు ఖజానాలోను రాజనగరుయొక్క ఖజానాలోను శేషించిన వెండి అంతయు బంగారమంతయు తీసి తన సేవకులచేతి కప్ప గించి, హెజ్యోనునకు పుట్టిన టబ్రిమ్మోను కుమారుడును దమస్కులో నివాసము చేయుచు అరామునకు రాజునైయున్న బెన్హదదుకు పంపి మనవి చేసినదేమనగా నీ తండ్రికిని నా తండ్రికిని సంధి కలిగియున్నట్లు నీకును నాకును సంధి కలిగి యుండవలెను గనుక వెండి బంగార ములను నీకు కానుకగా పంపించుచున్నాను; నీవు వచ్చి ఇశ్రా యేలు రాజైన బయెషా నాయొద్దనుండి తిరిగిపోవునట్లు నీకును అతనికిని కలిగిన నిబంధనను తప్పింపవలెను. కాబట్టి బెన్హదదు రాజైన ఆసా చెప్పిన మాటకు సమ్మతించి తన సైన్యముల అధిపతులను ఇశ్రాయేలు పట్టణముల మీదికి పంపి ఈయోనును దానును ఆబేల్బేత్మయకాను కిన్నెరెతును నఫ్తాలీ దేశమును పట్టుకొని కొల్లపెట్టెను. అది బయెషాకు వర్తమానము కాగా రామాపట్టణము కట్టుట మాని తిర్సాకు పోయి నివాసము చేసెను. అప్పుడు రాజైన ఆసా యెవరును నిలిచిపోకుండ యూదాదేశపు వారందరు రావలెనని ప్రకటన చేయగా జనులు సమకూడి బయెషా కట్టించుచుండిన రామాపట్టణపు రాళ్లను కఱ్ఱలను ఎత్తికొని వచ్చిరి. రాజైన ఆసా వాటి చేత బెన్యామీను సంబంధమైన గెబను మిస్పాను కట్టించెను. ఆసా చేసిన యితర కార్యములను గూర్చియు, అతని బలమంతటిని గూర్చియు, అతడు చేసిన సమస్తమునుగూర్చియు, అతడు కట్టించిన పట్టణములనుగూర్చియు యూదారాజుల వృత్తాం తముల గ్రంథమందు వ్రాయబడియున్నది. అతడు వృద్ధుడైన తరువాత అతని పాదములయందు రోగముపుట్టెను. అంతట ఆసా తన పితరులతోకూడ నిద్రించి, తన పితరుడైన దావీదు పురమందు తన పితరుల సమాధిలో పాతిపెట్టబడెను; అతనికి మారుగా యెహోషాపాతు అను అతని కుమారుడు రాజాయెను.
- Exodus 34:13 నిర్గమకాండము 34:13కాబట్టి మీరు వారి బలిపీఠములను పడగొట్టి వారి బొమ్మలను పగులగొట్టి వారి దేవతా స్తంభములను పడగొట్టవలెను.
- 2 Kings 23:6 2 రాజులు 23:6యెహోవా మందిరమందున్న అషేరాదేవి ప్రతిమను యెరూషలేము వెలుపలనున్న కిద్రోను వాగుదగ్గరకు తెప్పించి, కిద్రోను వాగు ఒడ్డున దాని కాల్చి త్రొక్కి పొడుముచేసి ఆ పొడుమును సామాన్య జనుల సమాధులమీద చల్లెను.
- 1 Kings 15:2 1 రాజులు 15:2అతడు మూడు సంవత్సరములు యెరూషలేమునందు రాజుగా ఉండెను; అతని తల్లి పేరు మయకా; ఆమె అబీషాలోము కుమార్తె.
- 1 Kings 15:10 1 రాజులు 15:10అతడు నలువదియొక సంవత్సరములుయెరూషలేమునందు ఏలుచుండెను. అతని అవ్వపేరు మయకా, యీమె అబీషాలోము కుమార్తె.
- 2 Kings 23:15 2 రాజులు 23:15బేతేలులోనున్న బలిపీఠమును ఉన్నతస్థలమును, అనగా ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడైన నెబాతు కుమారుడగు యరొబాము కట్టించిన ఆ ఉన్నత స్థలమును బలిపీఠమును అతడు పడగొట్టించి, ఆ ఉన్నత స్థలమును కాల్చి పొడుము అగునట్లుగా త్రొక్కించి అషేరాదేవి ప్రతిమను కాల్చివేసెను.
- Deuteronomy 7:5 ద్వితీయోపదేశకాండము 7:5కావున మీరు వారికి చేయవలసినదేమనగా, వారి బలిపీఠ ములను పడద్రోసి వారి విగ్రహములను పగులగొట్టి వారి దేవతాస్తంభములను నరికివేసి వారి ప్రతిమలను అగ్నితో కాల్చవలెను.
- Mark 3:21 మార్కు 3:21ఆయన ఇంటివారు సంగతి విని, ఆయన మతి చలించియున్నదని చెప్పి ఆయనను పట్టుకొనబోయిరి.
- 2 Chronicles 34:7 2 దినవృత్తాంతములు 34:7బలిపీఠములను దేవతా స్తంభములను పడగొట్టి చెక్కిన విగ్రహములను చూర్ణముచేసి, ఇశ్రాయేలీయుల దేశమంతటనున్న సూర్యదేవతా విగ్రహములన్నిటిని నరికి వేసి అతడు యెరూషలేమునకు తిరిగి వచ్చెను.
- 2 Chronicles 14:2–5 2 దినవృత్తాంతములు 14:2–5ఆసాతన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడచినవాడై అన్యదేవతల బలిపీఠములను పడగొట్టి ఉన్నతస్థలములను పాడుచేసి ప్రతిమలను పగులగొట్టి దేవతా స్తంభములను కొట్టివేయించి వారి పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకును, ధర్మశాస్త్రమునుబట్టియు విధినిబట్టియు క్రియలు జరిగించుటకును, యూదావారికి ఆజ్ఞాపించి ఉన్నత స్థలములను సూర్య దేవతాస్తంభములను యూదావారి పట్టణములన్నిటిలోనుండి తీసివేసెను. అతనియేలు బడియందు రాజ్యము నెమ్మదిగా ఉండెను.
- 2 Corinthians 5:16 2 కొరింథీయులకు 5:16కావున ఇకమీదట మేము శరీరరీతిగా ఎవనినైనను ఎరుగము; మేము క్రీస్తును శరీరరీతిగా ఎరిగియుండినను ఇకమీదట ఆయనను ఆలాగు ఎరుగము.
- Exodus 32:20 నిర్గమకాండము 32:20మరియు అతడు వారు చేసిన ఆ దూడను తీసికొని అగ్నితో కాల్చి పొడిచేసి నీళ్లమీద చల్లి ఇశ్రాయేలీయులచేత దాని త్రాగించెను.
Original words (Hebrew)
- Maachah · H4601מַעֲכָה Maʻăkâh
- mother · H517אֵם ʼêm
- Asa · H609אָסָא ʼÂçâʼ
- king · H4428מֶלֶךְ melek
- removed · H5493סוּר çûwr
- queen · H1377גְּבִירָה gᵉbîyrâh
- made · H6213עָשָׂה ʻâsâh
- idol · H4656מִפְלֶצֶת miphletseth
- grove · H842אֲשֵׁרָה ʼăshêrâh
- Asa · H609אָסָא ʼÂçâʼ
- down · H3772כָּרַת kârath
- idol · H4656מִפְלֶצֶת miphletseth
- stamped · H1854דָּקַק dâqaq
- burnt · H8313שָׂרַף sâraph
- brook · H5158נַחַל nachal
- Kidron · H6939קִדְרוֹן Qidrôwn