2 Chronicles · chapter 29 · verse 25
2 Chronicles 29:25 in Telugu
మరియు దావీదును దావీదు రాజుకు దీర్ఘదర్శియైన గాదును ప్రవక్తయైన నాతా నును చేసిన నిర్ణయముచొప్పున యెహోవా మందిరములో తాళములను స్వరమండలములను సితారాలను వాయించుటకై అతడు లేవీయులను ఏర్పాటుచేసెను. ఆలాగు జరుగవలెనని యెహోవా తన ప్రవక్తలద్వారా ఆజ్ఞాపించి యుండెను.
Mariyu daaveedunu daaveedu raajuku deerghadarshiyaina gaadunu pravaktayaina naataa nunu chesina nirnayamuchoppuna yehovaa mandiramulo taalamulanu svaramandalamulanu sitaaraalanu vaayinchutakai atadu leveeyulanu erpaatuchesenu. Aalaagu jarugavalenani yehovaa tana pravaktaladvaaraa aajnyaapinchi yundenu.
2 Chronicles 29:25 in English
- King James Version (KJV)
- And he set the Levites in the house of the LORD with cymbals, with psalteries, and with harps, according to the commandment of David, and of Gad the king’s seer, and Nathan the prophet: for [so was] the commandment of the LORD by his prophets.
- World English Bible (WEB)
- He set the Levites in the LORD’s house with cymbals, with stringed instruments, and with harps, according to the commandment of David, of Gad the king’s seer, and Nathan the prophet; for the commandment was from the LORD by his prophets.
- American Standard Version (ASV)
- And he set the Levites in the house of Jehovah with cymbals, with psalteries, and with harps, according to the commandment of David, and of Gad the king’s seer, and Nathan the prophet; for the commandment was of Jehovah by his prophets.
- Bible in Basic English (BBE)
- Then he put the Levites in their places in the house of the Lord, with brass and corded instruments of music as ordered by David and Gad, the king's seer, and Nathan the prophet: for the order was the Lord's, given by his prophets.
- Darby Translation (DBY)
- And he set the Levites in the house of Jehovah with cymbals, with lutes, and with harps, according to the commandment of David, and of Gad the king's seer, and of Nathan the prophet; for the commandment was of Jehovah through his prophets.
- Webster's Bible (WBS)
- And he set the Levites in the house of the LORD with cymbals, with psalteries, and with harps, according to the commandment of David, and of Gad the king's seer, and Nathan the prophet: for [so was] the commandment of the LORD by his prophets.
- Young's Literal Translation (YLT)
- And he appointeth the Levites in the house of Jehovah with cymbals, with psalteries, and with harps, by the command of David, and of Gad, seer of the king, and of Nathan the prophet, for by the hand of Jehovah [is] the command, by the hand of His prophets;
Read in context
- 23పాపపరిహారార్థబలికై రాజు ఎదుటికిని సమాజము ఎదుటికిని మేకపోతులను తీసికొనిరాగా, వారు తమ చేతులను వాటిమీద ఉంచిన తరువాత యాజకులు వాటిని వధించి
- 24ఇశ్రాయేలీయులందరికొరకు దహనబలియు పాపపరిహారార్థ బలియు అర్పింపవలెనని రాజు ఆజ్ఞాపించి యుండెను గనుక, ఇశ్రాయేలీయులందరి నిమిత్తము ప్రాయ శ్చి త్తము చేయుటకై బలిపీఠముమీద వాటి రక్తమును పోసి, పాపపరిహారార్థబలి అర్పించిరి.
- 25మరియు దావీదును దావీదు రాజుకు దీర్ఘదర్శియైన గాదును ప్రవక్తయైన నాతా నును చేసిన నిర్ణయముచొప్పున యెహోవా మందిరములో తాళములను స్వరమండలములను సితారాలను వాయించుటకై అతడు లేవీయులను ఏర్పాటుచేసెను. ఆలాగు జరుగవలెనని యెహోవా తన ప్రవక్తలద్వారా ఆజ్ఞాపించి యుండెను.
- 26దావీదు చేయించిన వాద్యములను వాయించు టకు లేవీయులును బూరలు ఊదుటకు యాజకులును నియ మింపబడిరి.
- 27బలిపీఠముమీద దహనబలులను అర్పించుడని హిజ్కియా ఆజ్ఞాపించెను. దహనబలి యర్పణ ఆరంభ మగుటతోనే బూరలు ఊదుటతోను ఇశ్రాయేలు రాజైన దావీదు చేయించిన వాద్యములను వాయించుటతోను యెహోవాకు స్తుతి గానము ఆరంభమాయెను.
Cross references
- 2 Chronicles 8:14 2 దినవృత్తాంతములు 8:14అతడు తన తండ్రియైన దావీదు చేసిన నిర్ణయమునుబట్టి వారి వారి సేవాధర్మములను జరుపుకొనుటకై వారి వారి వంతుల చొప్పున యాజకులను వారి సేవకును, కట్టడనుబట్టి అను దినమున యాజకుల సముఖమున స్తుతిచేయుటకును, ఉప చారకులుగా ఉండుటకును, వంతులచొప్పున లేవీయులను, ద్వారములన్నిటి దగ్గర కావలి యుండుటకై వారి వారి వంతులచొప్పున ద్వారపాలకులను నియమించెను; దైవ జనుడైన దావీదు ఆలాగుననే యాజ్ఞ ఇచ్చియుండెను.
- 1 Chronicles 23:5 1 దినవృత్తాంతములు 23:5నాలుగు వేలమంది ద్వారపాలకులుగా నియమింపబడిరి. మరినాలుగు వేలమంది స్తుతిచేయు నిమిత్తమై దావీదు చేయించిన వాద్యవిశేషములతో యెహోవాను స్తుతించువారుగా నియమింపబడిరి.
- 1 Chronicles 16:4–5 1 దినవృత్తాంతములు 16:4–5మరియు అతడు యెహోవా మందసము ఎదుట సేవ చేయుచు, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను ప్రసిద్ధి చేయుటకును, వందించుటకును ఆయ నకు స్తోత్రములు చెల్లించుటకును లేవీయులలో కొందరిని నియమించెను. వారిలో ఆసాపు అధిపతి, జెకర్యా అతని తరువాతివాడు, యెమీయేలు షెమీరామోతు యెహీయేలు మత్తిత్యా ఏలీయాబు బెనాయా ఓబేదెదోము యెహీయేలు అనువారు స్వరమండలములను సితారాలను వాయించుటకై నియమింపబడిరి, ఆసాపు తాళములను వాయించువాడు.
- 1 Chronicles 16:42 1 దినవృత్తాంతములు 16:42బూరలు ఊదుటకును తాళములను వాయించుటకును దేవునిగూర్చి పాడతగిన గీతము లను వాద్యములతో వినిపించుటకును వీరిలోనుండు హేమానును యెదూతూనును అతడు నియమించెను. మరియు యెదూతూను కుమారులను అతడు ద్వార పాలకులుగా నియమించెను.
- 1 Chronicles 15:16–22 1 దినవృత్తాంతములు 15:16–22అంతట దావీదుమీరు మీ బంధువులగు పాటకులను పిలిచి, స్వరమండలములు సితారాలు తాళములు లోనగు వాద్యవిశేషములతో గంభీర ధ్వని చేయుచు, సంతోషముతో స్వరములెత్తి పాడునట్లు ఏర్పాటుచేయుడని లేవీయుల అధిపతులకు ఆజ్ఞ ఇచ్చెను. కావున లేవీయులు యోవేలు కుమారుడైన హేమానును, వాని బంధువులలో బెరెక్యా కుమారుడైన ఆసాపును, తమ బంధువులగు మెరారీయులలో కూషాయాహు కుమారుడైన ఏతానును, వీరితోకూడ రెండవ వరుసగానున్న తమ బంధువులైన జెకర్యా బేను యహజీయేలు షెమీరా మోతు యెహీయేలు ఉన్నీ ఏలీయాబు బెనాయా మయ శేయా మత్తిత్యా ఎలీప్లేహు మిక్నేయాహులనువారిని ద్వారపాలకులగు ఓబేదెదోమును యెహీయేలును పాటకు లనుగా నియమించిరి. పాటకులైన హేమానును ఆసాపును ఏతానును పంచలోహముల తాళములు వాయించుటకు నిర్ణయింపబడిరి. జెకర్యా అజీయేలు షెమీరామోతు యెహీయేలు ఉన్నీ ఏలీయాబు మయశేయా బెనాయా అనువారు హెచ్చు స్వరముగల స్వరమండలములను వాయించుటకు నిర్ణయింపబడిరి. మరియు మత్తిత్యా ఎలీప్లేహు మిక్నేయాహు ఓబేదెదోము యెహీయేలు అజజ్యాహు అనువారు రాగమెత్తుటకును సితారాలు వాయించుటకును నిర్ణయింపబడిరి. లేవీయుల కధిపతియైన కెనన్యా మందసమును మోయుటయందు గట్టివాడై నందున అతడు మోతక్రమము నేర్పుటకై నియమింపబడెను.
- 2 Chronicles 35:15 2 దినవృత్తాంతములు 35:15మరియు ఆసాపు సంతతివారగు గాయకు లును, ఆసాపు హేమానులును, రాజునకు దీర్ఘదర్శియగు యెదూతూనును దావీదు నియమించిన ప్రకారముగా తమ స్థలమందుండిరి; ద్వారములన్నిటియొద్దను ద్వార పాలకులు కనిపెట్టుచుండిరి. వారు తమ చేతిలో పని విడిచి అవతలికి వెళ్లిపోకుండునట్లు వారి సహోదరులగు లేవీయులు వారికొరకు సిద్ధపరచిరి.
- 1 Chronicles 9:33 1 దినవృత్తాంతములు 9:33లేవీయుల పితరులలో పెద్దలైన గాయకులు రాత్రింబగళ్లు పని విచారణ కలిగియున్న హేతువుచేత వారు కడమ పనుల విచారణలేకుండ తమ గదులలోనుండిరి.
- 2 Samuel 24:11 2 సమూయేలు 24:11ఉదయమున దావీదు లేచినప్పుడు దావీదునకు దీర్ఘదర్శియగు గాదునకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను
- 1 Chronicles 25:1–7 1 దినవృత్తాంతములు 25:1–7మరియు దావీదును సైన్యాధిపతులును ఆసాపు హేమాను యెదూతూను అనువారి కుమారులలో కొందరిని సేవనిమిత్తమై ప్రత్యేకపరచి, సితారాలను స్వరమండలములను తాళములను వాయించుచు ప్రకటించునట్లుగా నియమించిరి ఈ సేవావృత్తినిబట్టి యేర్పాటైన వారి సంఖ్య యెంతయనగా ఆసాపు కుమారులలో రాజాజ్ఞ ప్రకారముగా ప్రకటించుచు, ఆసాపు చేతిక్రిందనుండు ఆసాపు కుమారులైన జక్కూరు యోసేపు నెతన్యా అషర్యేలా అనువారు. యెదూతూను సంబంధులలో స్తుతి పాటలు పాడుచు యెహోవాను స్తుతించుటకై సితారాను వాయించుచు ప్రకటించు తమ తండ్రియైన యెదూతూను చేతి క్రిందనుండు యెదూతూను కుమారులైన గెదల్యా జెరీ యెషయా హషబ్యా మత్తిత్యా అను ఆరుగురు. హేమాను సంబంధులలో హేమాను కుమారులైన బక్కీ యాహు మత్తన్యా ఉజ్జీయేలు షెబూయేలు యెరీమోతు హనన్యా హనానీ ఎలీయ్యాతా గిద్దల్తీ రోమమీ్తయెజెరు యొష్బెకాషా మల్లోతి హోతీరు మహజీయోతు అనువారు. వీరందరును దేవుని వాక్కువిషయములో రాజునకు దీర్ఘదర్శియగు హేమానుయొక్క కుమారులు. హేమాను సంతతిని గొప్పచేయుటకై దేవుడు హేమానునకు పదునలుగురు కుమారులను ముగ్గురు కుమార్తెలను అను గ్రహించి యుండెను. వీరందరు ఆసాపునకును యెదూ తూనునకును హేమానునకును రాజు చేసియున్న కట్టడ ప్రకారము యెహోవా యింటిలో తాళములు స్వర మండలములు సితారాలు వాయించుచు గానము చేయుచు, తమ తండ్రి చేతిక్రింద దేవుని మందిరపు సేవ జరిగించు చుండిరి. యెహోవాకు గానము చేయుటలో నేర్పు పొందిన తమ సహోదరులతో కూడనున్న ప్రవీణులైన పాటకుల లెక్క రెండువందల ఎనుబది యెనిమిది.
- 2 Chronicles 30:12 2 దినవృత్తాంతములు 30:12యెహోవా ఆజ్ఞనుబట్టి రాజును అధిపతులును చేసిన నిర్ణయమును నెరవేర్చునట్లు యూదాలోనివారికి మనస్సు ఏకముచేయుటకై దేవుని హస్తము వారికి తోడ్పడెను.
- 1 Chronicles 29:29 1 దినవృత్తాంతములు 29:29రాజైన దావీదునకు జరిగినవాటన్నిటినిగూర్చియు, అతని రాజరిక మంతటినిగూర్చియు, పరాక్రమమునుగూర్చియు, అతనికిని ఇశ్రాయేలీయులకును దేశముల రాజ్యములన్నిటికిని వచ్చిన కాలములనుగూర్చియు,
- 1 Chronicles 21:9 1 దినవృత్తాంతములు 21:9యెహోవా దావీదునకు దర్శకుడగు గాదుతో ఈలాగు సెలవిచ్చెనునీవు వెళ్లి దావీ దుతో ఇట్లనుము.
Original words (Hebrew)
- set · H5975עָמַד ʻâmad
- Levites · H3881לֵוִיִּי Lêvîyîy
- house · H1004בַּיִת bayith
- cymbals · H4700מְצֵלֶת mᵉtsêleth
- psalteries · H5035נֶבֶל nebel
- harps · H3658כִּנּוֹר kinnôwr
- commandment · H4687מִצְוָה mitsvâh
- David · H1732דָּוִד Dâvid
- Gad · H1410גָּד Gâd
- king’s · H4428מֶלֶךְ melek
- seer · H2374חֹזֶה chôzeh
- Nathan · H5416נָתָן Nâthân
- prophet · H5030נָבִיא nâbîyʼ
- commandment · H4687מִצְוָה mitsvâh
- of · H3027יָד yâd
- by · H3027יָד yâd
- prophets · H5030נָבִיא nâbîyʼ