1 Chronicles · chapter 25 · verse 1
1 Chronicles 25:1 in Telugu
మరియు దావీదును సైన్యాధిపతులును ఆసాపు హేమాను యెదూతూను అనువారి కుమారులలో కొందరిని సేవనిమిత్తమై ప్రత్యేకపరచి, సితారాలను స్వరమండలములను తాళములను వాయించుచు ప్రకటించునట్లుగా నియమించిరి ఈ సేవావృత్తినిబట్టి యేర్పాటైన వారి సంఖ్య యెంతయనగా
Mariyu daaveedunu sainyaadhipatulunu aasaapu hemaanu yedootoonu anuvaari kumaarulalo kondarini sevanimittamai pratyekaparachi, sitaaraalanu svaramandalamulanu taalamulanu vaayinchuchu prakatinchunatlugaa niyaminchiri ee sevaavruttinibatti yerpaataina vaari sankhya yentayanagaa
1 Chronicles 25:1 in English
- King James Version (KJV)
- Moreover David and the captains of the host separated to the service of the sons of Asaph, and of Heman, and of Jeduthun, who should prophesy with harps, with psalteries, and with cymbals: and the number of the workmen according to their service was:
- World English Bible (WEB)
- Moreover, David and the captains of the army set apart for the service certain of the sons of Asaph, of Heman, and of Jeduthun, who were to prophesy with harps, with stringed instruments, and with cymbals. The number of those who did the work according to their service was:
- American Standard Version (ASV)
- Moreover David and the captains of the host set apart for the service certain of the sons of Asaph, and of Heman, and of Jeduthun, who should prophesy with harps, with psalteries, and with cymbals: and the number of them that did the work according to their service was:
- Bible in Basic English (BBE)
- Further, David and the chiefs of the servants of the holy place made selection of certain of the sons of Asaph and of Heman and of Jeduthun for the work of prophets, to make melody with corded instruments and brass; and the number of the men for the work they had to do was:
- Darby Translation (DBY)
- And David and the captains of the host separated for the service those of the sons of Asaph and of Heman and of Jeduthun who were to prophesy with harps and lutes and cymbals; and the number of the men employed according to their service was:
- Webster's Bible (WBS)
- Moreover David and the captains of the host separated to the service of the sons of Asaph, and of Heman, and of Jeduthun, who should prophesy with harps, with psalteries, and with cymbals: and the number of the workmen according to their service was:
- Young's Literal Translation (YLT)
- And David and the heads of the host separate for service, of the sons of Asaph, and Heman, and Jeduthun, who are prophesying with harps, with psalteries, and with cymbals, and the number of the workmen is according to their service.
Read in context
- 1మరియు దావీదును సైన్యాధిపతులును ఆసాపు హేమాను యెదూతూను అనువారి కుమారులలో కొందరిని సేవనిమిత్తమై ప్రత్యేకపరచి, సితారాలను స్వరమండలములను తాళములను వాయించుచు ప్రకటించునట్లుగా నియమించిరి ఈ సేవావృత్తినిబట్టి యేర్పాటైన వారి సంఖ్య యెంతయనగా
- 2ఆసాపు కుమారులలో రాజాజ్ఞ ప్రకారముగా ప్రకటించుచు, ఆసాపు చేతిక్రిందనుండు ఆసాపు కుమారులైన జక్కూరు యోసేపు నెతన్యా అషర్యేలా అనువారు.
- 3యెదూతూను సంబంధులలో స్తుతి పాటలు పాడుచు యెహోవాను స్తుతించుటకై సితారాను వాయించుచు ప్రకటించు తమ తండ్రియైన యెదూతూను చేతి క్రిందనుండు యెదూతూను కుమారులైన గెదల్యా జెరీ యెషయా హషబ్యా మత్తిత్యా అను ఆరుగురు.
Cross references
- 2 Kings 3:15 2 రాజులు 3:15నాయొద్దకు వీణ వాయించగల యొకనిని తీసి కొనిరమ్ము. వాద్యకు డొకడు వచ్చి వాయించుచుండగా యెహోవా హస్తము అతనిమీదికి వచ్చెను గనుక అతడు ఈ మాట ప్రకటన చేసెను.
- 1 Chronicles 6:33 1 దినవృత్తాంతములు 6:33ఈ ప్రకారము తమ కుమారులతో కలసి కని పెట్టుచున్నవారెవరనగా, కహతీయుల కుమారులలో గాయకుడగు హేమాను; ఇతడు సమూయేలు కుమారుడగు యోవేలునకు పుట్టినవాడు
- 1 Chronicles 6:39 1 దినవృత్తాంతములు 6:39హేమాను సహోదరుడైన ఆసాపు ఇతని కుడిప్రక్కను నిలుచువాడు. ఈ ఆసాపు బెరక్యా కుమారుడు, బెరక్యా షిమ్యా కుమారుడు,
- 1 Samuel 10:5 1 సమూయేలు 10:5ఈలాగున పోవుచు ఫిలిష్తీయుల దండు కాపువారుండు దేవుని కొండకు చేరుదువు, అచ్చట ఊరిదగ్గరకు నీవు రాగానే, స్వరమండలము తంబుర సన్నాయి సితారా వాయించువారి వెనుక ఉన్నతమైన స్థలమునుండి దిగివచ్చు ప్రవక్తల సమూహము నీకు కనబడును, వారు ప్రకటనచేయుచు వత్తురు;
- Nehemiah 12:27 నెహెమ్యా 12:27యెరూషలేము ప్రాకారమును ప్రతిష్ఠించు కాల ములో వారు ఆ ప్రతిష్ఠాచారమును స్తోత్రగీతములతోను పాటలతోను స్వరమండల సితారా చేయి తాళములతోను సంతోషముగా జరిగించునట్లు లేవీయులను తమ సకల స్థలములలోనుండి యెరూషలేమునకు రప్పించుటకు పూనుకొనిరి
- Revelation 15:2–4 ప్రకటన 15:2–4మరియు అగ్నితో కలిసియున్న స్ఫటికపు సముద్రము వంటిది ఒకటి నేను చూచితిని. ఆ క్రూరమృగమునకును దాని ప్రతిమకును దాని పేరుగల సంఖ్యకును లోబడక వాటిని జయించినవారు దేవుని వీణలుగలవారై, ఆ స్ఫటికపు సముద్రమునొద్ద నిలిచియుండుట చూచితిని. వారు ప్రభువా, దేవా, సర్వాధికారీ, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి; యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములును సత్యములునై యున్నవి; ప్రభువా, నీవు మాత్రము పవిత్రుడవు, నీకు భయపడని వాడెవడు? నీ నామమును మహిమపరచనివాడెవడు? నీ న్యాయవిధులు ప్రత్యక్షపరచబడినవి గనుక జనములందరు వచ్చి నీ సన్నిధిని నమస్కారముచేసెదరని చెప్పుచు, దేవుని దాసుడగు మోషే కీర్తనయు గొఱ్ఱెపిల్ల కీర్తనయు పాడుచున్నారు.
- Psalm 92:1–3 కీర్తనలు 92:1–3యెహోవాను స్తుతించుట మంచిది మహోన్నతుడా, నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను పది తంతుల స్వరమండలముతోను గంభీర ధ్వనిగల సితారాతోను ప్రచురించుట మంచిది.
- 2 Chronicles 29:25–26 2 దినవృత్తాంతములు 29:25–26మరియు దావీదును దావీదు రాజుకు దీర్ఘదర్శియైన గాదును ప్రవక్తయైన నాతా నును చేసిన నిర్ణయముచొప్పున యెహోవా మందిరములో తాళములను స్వరమండలములను సితారాలను వాయించుటకై అతడు లేవీయులను ఏర్పాటుచేసెను. ఆలాగు జరుగవలెనని యెహోవా తన ప్రవక్తలద్వారా ఆజ్ఞాపించి యుండెను. దావీదు చేయించిన వాద్యములను వాయించు టకు లేవీయులును బూరలు ఊదుటకు యాజకులును నియ మింపబడిరి.
- 1 Chronicles 23:5–7 1 దినవృత్తాంతములు 23:5–7నాలుగు వేలమంది ద్వారపాలకులుగా నియమింపబడిరి. మరినాలుగు వేలమంది స్తుతిచేయు నిమిత్తమై దావీదు చేయించిన వాద్యవిశేషములతో యెహోవాను స్తుతించువారుగా నియమింపబడిరి. గెర్షోను కహాతు మెరారీయులు అను లేవీయులలో దావీదు వారిని వరుసలుగా విభాగించెను. గెర్షోనీయులలో లద్దాను షిమీ అనువారుండిరి. లద్దాను కుమారులు ముగ్గురు;
- 2 Chronicles 34:12 2 దినవృత్తాంతములు 34:12ఆ మనుష్యులు ఆ పనిని నమ్మకముగా చేసిరి. వారి మీది పైవిచారణకర్తలు ఎవరనగా, మెరా రీయులైన లేవీయులగు యహతు ఓబద్యా అనువారును, పని నడిపించుటకు ఏర్పడిన కహాతీయులగు జెకర్యా మెషు ల్లాము అనువారును, లేవీయులలో వాద్యప్రవీణులైన వారు వారితోకూడ ఉండిరి.
- Psalm 150:3–5 కీర్తనలు 150:3–5బూరధ్వనితో ఆయనను స్తుతించుడి. స్వరమండలముతోను సితారాతోను ఆయనను స్తుతించుడి. తంబురతోను నాట్యముతోను ఆయనను స్తుతించుడి. తంతివాద్యములతోను పిల్లనగ్రోవితోను ఆయనను స్తుతించుడి. మ్రోగు తాళములతో ఆయనను స్తుతించుడి. గంభీరధ్వనిగల తాళములతో ఆయనను స్తుతించుడి.
- 1 Corinthians 14:24–26 1 కొరింథీయులకు 14:24–26అయితే అందరు ప్రవచించుచుండగా అవిశ్వాసియైనను ఉపదేశము పొందని వాడైనను లోపలికి వచ్చినయెడల, అందరి బోధవలన తాను పాపినని గ్రహించి, అందరివలన విమర్శింపబడును. అప్పుడతని హృదయరహస్యములు బయలుపడును. ఇందు వలన దేవుడు నిజముగా మీలో ఉన్నాడని ప్రచురముచేయుచు అతడు సాగిలపడి దేవునికి నమస్కారము చేయును. సహోదరులారా, యిప్పుడు మీలో ఏమి జరుగు చున్నది? మీరు కూడి వచ్చునప్పుడు ఒకడు ఒక కీర్తన పాడవలెనని యున్నాడు; మరియొకడు బోధింపవలెనని యున్నాడు; మరియొకడు తనకు బయలు పరచబడినది ప్రకటనచేయవలెనని యున్నాడు; మరియొకడు భాషతో మాటలాడవలెనని యున్నాడు; మరియొకడు అర్థము చెప్ప వలెనని యున్నాడు. సరే; సమస్తమును క్షేమాభివృద్ధి కలుగుటకై జరుగనియ్యుడి.
Original words (Hebrew)
- David · H1732דָּוִד Dâvid
- captains · H8269שַׂר sar
- host · H6635צָבָא tsâbâʼ
- separated · H914בָּדַל bâdal
- service · H5656עֲבֹדָה ʻăbôdâh
- sons · H1121בֵּן bên
- Asaph · H623אָסָף ʼÂçâph
- Heman · H1968הֵימָן Hêymân
- Jeduthun · H3038יְדוּתוּן Yᵉdûwthûwn
- prophesy · H5012נָבָא nâbâʼ
- harps · H3658כִּנּוֹר kinnôwr
- psalteries · H5035נֶבֶל nebel
- cymbals · H4700מְצֵלֶת mᵉtsêleth
- number · H4557מִסְפָּר miçpâr
- workmen · H582אֱנוֹשׁ ʼĕnôwsh
- service · H5656עֲבֹדָה ʻăbôdâh