2 Chronicles · chapter 7 · verse 17
2 Chronicles 7:17 in Telugu
నీ తండ్రియైన దావీదు నడచినట్లుగా నీవును నా కనుకూల వర్తనుడవై నడచి, నేను నీకాజ్ఞాపించిన దానియంతటి ప్రకారముచేసి, నా కట్టడలను నా న్యాయ విధులను అనుసరించినయెడల
Nee tandriyaina daaveedu nadachinatlugaa neevunu naa kanukoola vartanudavai nadachi, nenu neekaajnyaapinchina daaniyantati prakaaramuchesi, naa kattadalanu naa nyaaya vidhulanu anusarinchinayedala
2 Chronicles 7:17 in English
- King James Version (KJV)
- And as for thee, if thou wilt walk before me, as David thy father walked, and do according to all that I have commanded thee, and shalt observe my statutes and my judgments;
- World English Bible (WEB)
- “As for you, if you will walk before me as David your father walked, and do according to all that I have commanded you, and will keep my statutes and my ordinances,
- American Standard Version (ASV)
- And as for thee, if thou wilt walk before me as David thy father walked, and do according to all that I have commanded thee, and wilt keep my statutes and mine ordinances;
- Bible in Basic English (BBE)
- And as for you, if you will go on your way before me as David your father did, doing whatever I have given you orders to do and keeping my laws and my decisions:
- Darby Translation (DBY)
- And [as for] thee, if thou wilt walk before me, as David thy father walked, to do according to all that I have commanded thee, and wilt keep my statutes and mine ordinances;
- Webster's Bible (WBS)
- And as for thee, if thou wilt walk before me, as David thy father walked, and do according to all that I have commanded thee, and shalt observe my statutes and my judgments;
- Young's Literal Translation (YLT)
- 'And thou, if thou dost walk before Me as David thy father walked, even to do according to all that I have commanded thee, and My statutes and My judgments dost keep —
Read in context
- 15ఈ స్థలమందు చేయబడు ప్రార్థనమీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించును,
- 16నా పేరు ఈ మందిరమునకు నిత్యము ఉండునట్లుగా నేను దాని కోరుకొని పరిశుద్ధపరచితిని, నా దృష్టియు నా మనస్సును నిత్యము దానిమీద నుండును.
- 17నీ తండ్రియైన దావీదు నడచినట్లుగా నీవును నా కనుకూల వర్తనుడవై నడచి, నేను నీకాజ్ఞాపించిన దానియంతటి ప్రకారముచేసి, నా కట్టడలను నా న్యాయ విధులను అనుసరించినయెడల
- 18ఇశ్రాయేలీయులను ఏలు టకు స్వసంతతివాడు ఒకడు నీకుండకపోడని నేను నీ తండ్రియైన దావీదుతో చేసియున్న నిబంధననుబట్టి నేను నీ రాజ్యసింహాసనమును స్థిరపరచుదును.
- 19అయితే మీరు త్రోవ తప్పి, నేను మీకు నియమించిన కట్టడలను ఆజ్ఞలను విడచి, యితర దేవతలను అనుసరించి వాటికి పూజానమ స్కారములు చేసిన యెడల
Cross references
- Ezekiel 36:27 యెహెజ్కేలు 36:27నా ఆత్మను మీయందుంచి, నా కట్టడల ననుసరించు వారినిగాను నా విధులను గైకొను వారినిగాను మిమ్మును చేసెదను.
- Zechariah 3:7 జెకర్యా 3:7సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగానా మార్గములలొ నడుచుచు నేను నీ కప్పగించిన దానిని భద్రముగా గైకొనిన యెడల, నీవు నా మందిరముమీద అధికారివై నా ఆవరణ ములను కాపాడువాడవగుదువు; మరియు ఇక్కడ నిలువ బడు వారికి కలిగినట్లు నా సన్నిధిని నిలుచు భాగ్యము నీ కిత్తును.
- Deuteronomy 4:40 ద్వితీయోపదేశకాండము 4:40మరియు నీకును నీ తరువాత నీ సంతానపు వారికిని క్షేమము కలుగుటకై నీ దేవుడైన యెహోవా సర్వకాలము నీకిచ్చుచున్న దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నేడు నేను నీ కాజ్ఞాపించు ఆయన కట్టడలను ఆజ్ఞలను నీవు గైకొనవలెను.
- 1 Kings 11:38 1 రాజులు 11:38నేను నీకు ఆజ్ఞాపించినదంతయు నీవు విని, నా మార్గముల ననుసరించి నడచుచు, నా దృష్టికి అనుకూలమైనదానిని జరింగిచుచు నా సేవకుడైన దావీదు చేసినట్లు నా కట్టడలను నా ఆజ్ఞలను గైకొనినయెడల, నేను నీకు తోడుగా ఉండి దావీదు కుటుంబమును శాశ్వతముగా నేను స్థిరపరచి నట్లు నిన్నును స్థిరపరచి ఇశ్రాయేలువారిని నీకు అప్ప గించెదను.
- John 14:21 యోహాను 14:21నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు; నన్ను ప్రేమించువాడు నా తండ్రివలన ప్రేమింపబడును; నేనును వానిని ప్రేమించి, వానికి నన్ను కనబరచుకొందునని చెప్పెను.
- John 15:10 యోహాను 15:10నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచియున్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొనినయెడల నా ప్రేమయందు నిలిచియుందురు.
- 1 Kings 9:4–9 1 రాజులు 9:4–9నీ తండ్రి యైన దావీదు నడిచినట్లు నీవును యథార్థహృద యుడవై నీతిని బట్టి నడుచుకొని, నేను నీకు సెలవిచ్చిన దంతటిప్రకారము చేసి నా కట్టడలను విధులను అను సరించిన యెడల నీ సంతతిలో ఒకడు ఇశ్రాయేలీయులమీద సింహాసనాసీనుడై యుండక మానడని నీ తండ్రియైన దావీదునకు నేను సెల విచ్చియున్నట్లు ఇశ్రాయేలీయుల మీద నీ సింహాసనమును చిరకాలమువరకు స్థిరపరచుదును. అయితే మీరేగాని మీ కుమారులే గాని యేమాత్రమైనను నన్ను వెంబడించుట మాని, నేనిచ్చిన ఆజ్ఞలను కట్టడలను అనుసరింపక యితరమైన దేవతలను కొలిచి పూజిం చినయెడల నేను ఇశ్రాయేలీయుల కిచ్చిన యీ దేశములో వారిని ఉండనియ్యక వారిని నిర్మూలము చేసి, నా నామమునకు నేను పరిశుద్ధ పరచిన యీ మందిరమును నా సముఖములోనుండి కొట్టివేసెదను; ఇశ్రాయేలీ యులు సర్వజనములలో చెదరిపోయి సామెతగాను హేళనగాను చేయబడుదురు. ఈ మందిరమార్గమున వచ్చువారందరును దానిచూచి, ఆశ్చర్యపడి ఇసీ, యనియెహోవా ఈ దేశమునకును ఈ మందిరమునకును ఈలా గున ఎందుకు చేసెనని యడుగగా జనులిట్లందురు ఐగుప్తు దేశములోనుండి తమ పితరులను రప్పించిన తమ దేవుడైన యెహోవాను వారు విడిచి యితర దేవతలను ఆధారము చేసికొని కొలిచి పూజించుచు వచ్చిరి గనుక యెహోవా ఈ కీడంతయు వారిమీదికి రప్పించియున్నాడు.
- Deuteronomy 28:1–14 ద్వితీయోపదేశకాండము 28:1–14నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినినేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలనన్నిటిని అనుసరించి నడుచుకొనినయెడల నీ దేవు డైన యెహోవా భూమిమీదనున్న సమస్త జనములకంటె నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినినయెడల ఈ దీవెనలన్నియు నీమీదికి వచ్చి నీకు ప్రాప్తించును. నీవు పట్టణములో దీవింపబడుదువు; పొలములో దీవింప బడుదువు; నీ గర్భఫలము నీ భూఫలము నీ పశువుల మందలు నీ దుక్కి టెద్దులు నీ గొఱ్ఱె మేకల మందలు దీవింపబడును; నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు దీవింపబడును. నీవు లోపలికి వచ్చునప్పుడు దీవింప బడుదువు; వెలుపలికి వెళ్లునప్పుడు దీవింపబడుదువు. నీమీదపడు నీ శత్రువులను యెహోవా నీ యెదుట హత మగునట్లు చేయును; వారొక త్రోవను నీమీదికి బయలు దేరి వచ్చి యేడు త్రోవల నీ యెదుటనుండి పారిపోవు దురు. నీ కొట్లలోను నీవు చేయు ప్రయత్నము లన్నిటి లోను నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశములో ఆయన నిన్ను ఆశీర్వదించును. నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞల ననుసరించి ఆయన మార్గములలో నడుచుకొనిన యెడల యెహోవా నీకు ప్రమాణము చేసియున్నట్లు ఆయన తనకు ప్రతిష్టితజనముగా నిన్ను స్థాపించును. భూప్రజలందరు యెహోవా నామమున నీవు పిలువబడు చుండుట చూచి నీకు భయపడుదురు. మరియు యెహోవా నీకిచ్చెదనని నీ పితరులతో ప్రమాణముచేసిన దేశమున యెహోవా నీ గర్భఫల విషయములోను నీ పశు వుల విషయములోను నీ నేలపంట విషయములోను నీకు సమృద్ధిగా మేలు కలుగజేయును. యెహోవా నీ దేశముమీద వర్షము దాని కాలమందు కురిపించుటకును నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును, ఆకాశ మను తన మంచి ధననిధిని తెరచును. నీవు అనేకజనము లకు అప్పిచ్చెదవు కాని అప్పుచేయవు నేడు నేను మీకా జ్ఞాపించు మాటలన్నిటిలో దేనివిషయములోను కుడికి గాని యెడమకుగాని తొలగి అన్యుల దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు నున్నయెడల, నీవు అనుసరించి నడుచుకొనవలెనని నేడు నేను నీకాజ్ఞా పించుచున్న నీ దేవుడైన యెహోవా ఆజ్ఞ లను విని వాటిని అనుసరించి గైకొనినయెడల, యెహోవా నిన్ను తలగా నియమించునుగాని తోకగా నియమింపడు. నీవు పైవాడ వుగా ఉందువుగాని క్రింది వాడవుగా ఉండవు.
- 1 Kings 3:14 1 రాజులు 3:14మరియు నీ తండ్రియైన దావీదు నా మార్గములలో నడచి నా కట్టడలను నేను నియమించిన ధర్మమంతటిని గైకొనినట్లు నీవు నడచి వాటిని గైకొనిన యెడల నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేసెదను అనెను.
- 1 Kings 2:3 1 రాజులు 2:3నీ దేవుడైన యెహోవా అప్పగించినదానిని కాపాడి, ఆయన మార్గముల ననుసరించిన యెడల నీవు ఏ పని పూనుకొనినను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకొందువు. మోషే ధర్మశాస్త్రములో వ్రాయబడియున్న దేవుని కట్టడలను ఆయన నియమించిన ధర్మమంతటిని ఆయన న్యాయ విధులను శాసనములను గైకొనుము;
- 1 Kings 8:25 1 రాజులు 8:25యెహోవా ఇశ్రాయేలీయుల దేవానీ కుమారులు సత్ ప్రవర్తనగలవారై, నీవు నా యెదుట నడచి నట్లు నా యెదుట నడచినయెడల, నా దృష్టికి అనుకూలుడై ఇశ్రాయేలీయులమీద సింహాసనాసీనుడగువాడు నీకుండక మానడని సెలవిచ్చితివి. నీవు నీ దాసుడును నా తండ్రియునగు దావీదునకు ఇచ్చిన వాగ్దానమును స్థిర పరచుము.
- 1 Chronicles 28:9 1 దినవృత్తాంతములు 28:9సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రియొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నిటిని సంకల్పములన్నిటిని ఎరిగినవాడునై యున్నాడు. నీవు ఆయనను తెలిసికొని హృదయపూర్వకముగాను మనః పూర్వకముగాను ఆయనను సేవించుము, ఆయనను వెదకినయెడల ఆయన నీకు ప్రత్యక్షమగును, నీవు ఆయనను విసర్జించినయెడల ఆయన నిన్ను నిత్యముగా త్రోసి వేయును.