2 Corinthians · chapter 11 · verse 1
2 Corinthians 11:1 in Telugu
కొంచెమవివేకముగా నేను మాటలాడినను మీరు సహింపవలెనని కోరుచున్నాను, నన్నుగూర్చి మీరేలా గైనను సహించుడి.
Konchemavivekamugaa nenu maatalaadinanu meeru sahimpavalenani koruchunnaanu, nannugoorchi meerelaa gainanu sahinchudi.
2 Corinthians 11:1 in English
- King James Version (KJV)
- Would to God ye could bear with me a little in [my] folly: and indeed bear with me.
- World English Bible (WEB)
- I wish that you would bear with me in a little foolishness, but indeed you do bear with me.
- American Standard Version (ASV)
- Would that ye could bear with me in a little foolishness: but indeed ye do bear with me.
- Bible in Basic English (BBE)
- Put up with me if I am a little foolish: but, truly, you do put up with me.
- Darby Translation (DBY)
- Would that ye would bear with me [in] a little folly; but indeed bear with me.
- Webster's Bible (WBS)
- I earnestly wish ye could bear with me a little in [my] folly: and indeed bear with me.
- Young's Literal Translation (YLT)
- O that ye were bearing with me a little of the folly, but ye also do bear with me:
Read in context
- 1కొంచెమవివేకముగా నేను మాటలాడినను మీరు సహింపవలెనని కోరుచున్నాను, నన్నుగూర్చి మీరేలా గైనను సహించుడి.
- 2దేవాసక్తితో మీ యెడల ఆసక్తి కలిగి యున్నాను; ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి, అనగా క్రీస్తుకు సమర్పింపవలెనని, మిమ్మును ప్రధానము చేసితిని గాని,
- 3సర్పము తన కుయుక్తిచేత హవ్వను మోసపరచినట్లు మీ మనస్సులును చెరుపబడి, క్రీస్తు ఎడలనున్న సరళతనుండియు పవిత్రత నుండియు ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడు చున్నాను.
Cross references
- 1 Corinthians 1:21 1 కొరింథీయులకు 1:21దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానముచేత దేవునిని ఎరుగకుండినందున, సువార్త ప్రకటన యను వెఱ్ఱి తనముచేత నమ్మువారిని రక్షించుట దేవుని దయా పూర్వక సంకల్ప మాయెను.
- 2 Corinthians 11:4 2 కొరింథీయులకు 11:4ఏలయనగా వచ్చినవాడెవడైనను మేము ప్రకటింపని మరియొక యేసును ప్రకటించినను, లేక మీరు పొందని మరియొక ఆత్మను మీరు పొందినను, మీరు అంగీ కరింపని మరియొక సువార్త మీరు అంగీకరించినను, మీరు వానినిగూర్చి సహించుట యుక్తమే.
- 2 Corinthians 11:21 2 కొరింథీయులకు 11:21మేము బలహీనులమై యున్నట్టు అవమానముగా మాటలాడుచున్నాను. ఏ విషయమందు ఎవడైన ధైర్యము కలిగి యున్నాడో, ఆ విషయమందు నేనుకూడ ధైర్యము కలిగినవాడను; అవివేకముగా మాటలాడుచున్నాను సుమా.
- 2 Corinthians 5:13 2 కొరింథీయులకు 5:13ఏలయనగా మేము వెఱ్రివారమైతిమా దేవుని నిమిత్తమే; స్వస్థబుద్ధిగలవారమైతిమా మీ నిమిత్తమే.
- 2 Corinthians 11:19 2 కొరింథీయులకు 11:19మీరు వివేకులైయుండి సంతోషముతో అవివేకులను సహించుచున్నారు.
- 2 Corinthians 11:16–17 2 కొరింథీయులకు 11:16–17నేను అవివేకినని యెవడును తలంచవద్దని మరల చెప్పు చున్నాను. అట్లు తలంచినయెడల నేను కొంచెము అతిశయపడునట్లు నన్ను అవివేకినైనట్టు గానే చేర్చు కొనుడి. నేను చెప్పుచున్నది ప్రభువు మాట ప్రకారము చెప్పుటలేదు గాని ఇట్లు అతిశయపడుటకు ఆధారము కలిగి అవివేకివలె చెప్పుచున్నాను.
- Joshua 7:7 యెహోషువ 7:7అయ్యో, ప్రభువా యెహోవా, మమ్మును నశింపజేయునట్లు అమోరీయుల చేతికి మమ్మును అప్పగించుటకు ఈ జనులను ఈ యొర్దాను నీ వెందుకు దాటించితివి? మేము యొర్దాను అవతల నివసించుట మేలు.
- 2 Kings 5:3 2 రాజులు 5:3అదిషోమ్రో నులోనున్న ప్రవక్తదగ్గర నా యేలినవాడుండవలెనని నేనెంతో కోరుచున్నాను; అతడు నా యేలినవానికి కలిగిన కుష్ఠరోగమును బాగుచేయునని తన యజమానురాలితో అనెను.
- Hebrews 5:2 హెబ్రీయులకు 5:2తానుకూడ బలహీనతచేత ఆవరింపబడియున్నందున అతడు ఏమియు తెలియనివారియెడలను త్రోవతప్పిన వారియెడలను తాలిమి చూపగలవాడై యున్నాడు.
- Acts 26:29 అపొస్తలుల కార్యములు 26:29అందుకు పౌలు సులభముగానో దుర్లభముగానో, తమరు మాత్రము కాదు, నేడు నా మాట వినువారందరును ఈ బంధకములు తప్ప నావలె ఉండునట్లు దేవుడనుగ్రహించుగాక అనెను.
- 2 Corinthians 12:11 2 కొరింథీయులకు 12:11నేనవివేకినైతిని, మీరే నన్ను బలవంతము చేసితిరి. నేను మీచేత మెప్పు పొందవలసినవాడను, ఏలయనగా నేను ఏమాత్రపువాడను కాకపోయినను మిక్కిలి శ్రేష్ఠులైన యీ అపొస్తలులకంటె నేను ఏ విషయములోను తక్కువ వాడను కాను.
- Matthew 17:17 మత్తయి 17:17అందుకు యేసువిశ్వాసములేని మూర్ఖతరమువారలారా, మీతో నేనెంత కాలము ఉందును? ఎంతవరకు మిమ్మును సహింతును? వానిని నాయొద్దకు తీసికొనిరండని చెప్పెను.