2 Corinthians · chapter 11 · verse 21
2 Corinthians 11:21 in Telugu
మేము బలహీనులమై యున్నట్టు అవమానముగా మాటలాడుచున్నాను. ఏ విషయమందు ఎవడైన ధైర్యము కలిగి యున్నాడో, ఆ విషయమందు నేనుకూడ ధైర్యము కలిగినవాడను; అవివేకముగా మాటలాడుచున్నాను సుమా.
Memu balaheenulamai yunnattu avamaanamugaa maatalaaduchunnaanu. E vishayamandu evadaina dhairyamu kaligi yunnaado, aa vishayamandu nenukooda dhairyamu kaliginavaadanu; avivekamugaa maatalaaduchunnaanu sumaa.
2 Corinthians 11:21 in English
- King James Version (KJV)
- I speak as concerning reproach, as though we had been weak. Howbeit whereinsoever any is bold, (I speak foolishly,) I am bold also.
- World English Bible (WEB)
- To my shame, I speak as though we had been weak. Yet in whatever way anyone is bold (I speak in foolishness), I am bold also.
- American Standard Version (ASV)
- I speak by way of disparagement, as though we had been weak. Yet whereinsoever any is bold (I speak in foolishness), I am bold also.
- Bible in Basic English (BBE)
- I say this by way of shaming ourselves, as if we had been feeble. But if anyone puts himself forward (I am talking like a foolish person), I will do the same.
- Darby Translation (DBY)
- I speak as to dishonour, as though we had been weak; but wherein any one is daring, (I speak in folly,) I also am daring.
- Webster's Bible (WBS)
- I speak as concerning reproach, as though we had been weak. But in whatever respect any is bold, (I speak foolishly) I am bold also.
- Young's Literal Translation (YLT)
- in reference to dishonour I speak, how that we were weak, and in whatever any one is bold — in foolishness I say [it] — I also am bold.
Read in context
- 19మీరు వివేకులైయుండి సంతోషముతో అవివేకులను సహించుచున్నారు.
- 20ఒకడు మిమ్మును దాస్యమునకు లోపరచినను, ఒకడు మిమ్ము మింగివేసినను, ఒకడు మిమ్ము వశపరచుకొనినను, ఒకడు తన్ను గొప్పచేసి కొనినను, ఒకడు ముఖముమీద మిమ్మును కొట్టినను మీరు సహించుచున్నారు.
- 21మేము బలహీనులమై యున్నట్టు అవమానముగా మాటలాడుచున్నాను. ఏ విషయమందు ఎవడైన ధైర్యము కలిగి యున్నాడో, ఆ విషయమందు నేనుకూడ ధైర్యము కలిగినవాడను; అవివేకముగా మాటలాడుచున్నాను సుమా.
- 22వారు హెబ్రీయులా? నేనును హెబ్రీయుడనే. వారు ఇశ్రాయేలీయులా? నేనును ఇశ్రాయేలీయుడనే. వారు అబ్రాహాము సంతానమా? నేనును అట్టివాడనే.
- 23వారు క్రీస్తు పరిచారకులా? వెఱ్ఱివానివలె మాటలాడు చున్నాను, నేనును మరి యెక్కువగా క్రీస్తు పరిచారకుడను. మరి విశేషముగా ప్రయాసపడితిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని; అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేకమారులు ప్రాణాపాయములలో ఉంటిని.
Cross references
- 2 Corinthians 10:10 2 కొరింథీయులకు 10:10అతని పత్రికలు ఘనమైనవియు బలీయమైనవియు నైయున్నవి గాని అతడు శరీరరూపమునకు బలహీనుడు, అతని ప్రసంగము కొరగానిదని యొకడు అనును.
- 2 Corinthians 11:17 2 కొరింథీయులకు 11:17నేను చెప్పుచున్నది ప్రభువు మాట ప్రకారము చెప్పుటలేదు గాని ఇట్లు అతిశయపడుటకు ఆధారము కలిగి అవివేకివలె చెప్పుచున్నాను.
- 2 Corinthians 10:1–2 2 కొరింథీయులకు 10:1–2మీ ఎదుట నున్నప్పుడు మీలో అణకువగలవాడనైనట్టియు, ఎదుట లేనప్పుడు మీయెడల ధైర్యము గలవాడనైనట్టియు, పౌలను నేనే యేసుక్రీస్తుయొక్క సాత్వికమును మృదుత్వమునుబట్టి మిమ్మును వేడుకొను చున్నాను. శరీరప్రకారము నడుచుకొనువారమని మమ్మునుగూర్చి కొందరనుకొనుచున్నారు కారా? అట్టి వారియెడల నేను తెగించి కాఠిన్యము చూపవలెనని తలంచుకొనుచున్నాను గాని, నేను వచ్చినప్పుడు అట్లు కాఠిన్యమును చూపకుండునట్లు చేయుడని నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను.
- 2 Corinthians 11:22–27 2 కొరింథీయులకు 11:22–27వారు హెబ్రీయులా? నేనును హెబ్రీయుడనే. వారు ఇశ్రాయేలీయులా? నేనును ఇశ్రాయేలీయుడనే. వారు అబ్రాహాము సంతానమా? నేనును అట్టివాడనే. వారు క్రీస్తు పరిచారకులా? వెఱ్ఱివానివలె మాటలాడు చున్నాను, నేనును మరి యెక్కువగా క్రీస్తు పరిచారకుడను. మరి విశేషముగా ప్రయాసపడితిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని; అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేకమారులు ప్రాణాపాయములలో ఉంటిని. యూదులచేత అయిదుమారులు ఒకటి తక్కువ నలువది దెబ్బలు తింటిని; ముమ్మారు బెత్తములతో కొట్టబడితిని; ఒకసారి రాళ్లతో కొట్టబడితిని; ముమ్మారు ఓడ పగిలి శ్రమపడితిని; ఒక రాత్రింబగళ్లు సముద్రములో గడిపితిని. అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదులవలననైన ఆపదలలోను, దొంగలవలననైన ఆపదలలోను, నా స్వజనులవలననైన ఆపదలలోను, అన్యజనుల వలననైన ఆపదలలోను, పట్టణములో ఆపదలలోను, అరణ్యములో ఆపదలలోను, సముద్రములో ఆపదలలోను, కపట సహోదరులవలని ఆపదలలోను ఉంటిని ప్రయాస తోను, కష్టములతోను, తరచుగా జాగరణములతోను, ఆకలి దప్పులతోను, తరచుగా ఉపవాసములతోను, చలి తోను, దిగంబరత్వముతోను ఉంటిని, ఇంకను చెప్ప వలసినవి అనేకములున్నవి.
- Philippians 3:3–6 ఫిలిప్పీయులకు 3:3–6ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసికొనక దేవునియొక్క ఆత్మవలన ఆరాధించుచు, క్రీస్తుయేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించువారము. కావలయునంటే నేను శరీరమును ఆస్పదము చేసికొనవచ్చును; మరి ఎవడైనను శరీరమును ఆస్పదము చేసికొనదలచినయెడల నేను మరి యెక్కువగా చేసికొనవచ్చును. ఎనిమిదవదినమున సున్నతి పొందితిని, ఇశ్రాయేలు వంశపువాడనై, బెన్యామీను గోత్రములో పుట్టి హెబ్రీయుల సంతానమైన హెబ్రీయుడనై, ధర్మశాస్త్రవిషయము పరిసయ్యుడనై, ఆసక్తివిషయము సంఘమును హింసించువాడనై, ధర్మ శాస్త్రమువలని నీతివిషయము అనింద్యుడనై యుంటిని.
- 2 Corinthians 13:10 2 కొరింథీయులకు 13:10కాబట్టి నేను మీయొద్దకు వచ్చినప్పుడు పడద్రోయుటకు కాక, మిమ్మును కట్టుటకే ప్రభువు నాకు అనుగ్రహించిన అధికారముచొప్పున కాఠిన్యము కనపరచకుండునట్లు దూర ముగా ఉండగానే యీ సంగతులు వ్రాయుచున్నాను.
Original words (Greek)
- speak · G3004λέγω légō
- concerning · G2596κατά katá
- reproach · G819ἀτιμία atimía
- as · G5613ὡς hōs
- though · G3754ὅτι hóti
- we · G2249ἡμεῖς hēmeîs
- weak · G770ἀσθενέω asthenéō
- Howbeit · G1161δέ dé
- whereinsoever · G3739ὅς hós
- any · G5100τὶς tìs
- bold · G5111τολμάω tolmáō
- speak · G3004λέγω légō
- foolishly · G877ἀφροσύνη aphrosýnē
- I · G2504κἀγώ kagṓ
- bold · G5111τολμάω tolmáō
- also · G2504κἀγώ kagṓ