2 Corinthians · chapter 11 · verse 17
2 Corinthians 11:17 in Telugu
నేను చెప్పుచున్నది ప్రభువు మాట ప్రకారము చెప్పుటలేదు గాని ఇట్లు అతిశయపడుటకు ఆధారము కలిగి అవివేకివలె చెప్పుచున్నాను.
Nenu cheppuchunnadi prabhuvu maata prakaaramu chepputaledu gaani itlu atishayapadutaku aadhaaramu kaligi avivekivale cheppuchunnaanu.
2 Corinthians 11:17 in English
- King James Version (KJV)
- That which I speak, I speak [it] not after the Lord, but as it were foolishly, in this confidence of boasting.
- World English Bible (WEB)
- That which I speak, I don’t speak according to the Lord, but as in foolishness, in this confidence of boasting.
- American Standard Version (ASV)
- That which I speak, I speak not after the Lord, but as in foolishness, in this confidence of glorying.
- Bible in Basic English (BBE)
- What I am now saying is not by the order of the Lord, but as a foolish person, taking credit to myself, as it seems.
- Darby Translation (DBY)
- What I speak I do not speak according to [the] Lord, but as in folly, in this confidence of boasting.
- Webster's Bible (WBS)
- That which I speak, I speak [it] not according to the Lord, but as it were foolishly, in this confidence of boasting.
- Young's Literal Translation (YLT)
- That which I speak, I speak not according to the Lord, but as in foolishness, in this the confidence of boasting;
Read in context
- 15గనుక వాని పరిచారకులును నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతికాదు. వారి క్రియల చొప్పున వారి కంతము కలుగును.
- 16నేను అవివేకినని యెవడును తలంచవద్దని మరల చెప్పు చున్నాను. అట్లు తలంచినయెడల నేను కొంచెము అతిశయపడునట్లు నన్ను అవివేకినైనట్టు గానే చేర్చు కొనుడి.
- 17నేను చెప్పుచున్నది ప్రభువు మాట ప్రకారము చెప్పుటలేదు గాని ఇట్లు అతిశయపడుటకు ఆధారము కలిగి అవివేకివలె చెప్పుచున్నాను.
- 18అనేకులు శరీర విషయములో అతిశయపడుచున్నారు గనుక నేనును ఆలాగే అతిశయపడుదును.
- 19మీరు వివేకులైయుండి సంతోషముతో అవివేకులను సహించుచున్నారు.
Cross references
- 1 Corinthians 7:12 1 కొరింథీయులకు 7:12ప్రభువు కాదు నేనే తక్కినవారితో చెప్పున దేమనగా ఏ సహోదరునికైనను అవిశ్వాసురాలైన భార్య యుండి, ఆమె అతనితో కాపురము చేయ నిష్టపడిన యెడల, అతడు ఆమెను పరిత్యజింపకూడదు.
- Philippians 3:3–6 ఫిలిప్పీయులకు 3:3–6ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసికొనక దేవునియొక్క ఆత్మవలన ఆరాధించుచు, క్రీస్తుయేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించువారము. కావలయునంటే నేను శరీరమును ఆస్పదము చేసికొనవచ్చును; మరి ఎవడైనను శరీరమును ఆస్పదము చేసికొనదలచినయెడల నేను మరి యెక్కువగా చేసికొనవచ్చును. ఎనిమిదవదినమున సున్నతి పొందితిని, ఇశ్రాయేలు వంశపువాడనై, బెన్యామీను గోత్రములో పుట్టి హెబ్రీయుల సంతానమైన హెబ్రీయుడనై, ధర్మశాస్త్రవిషయము పరిసయ్యుడనై, ఆసక్తివిషయము సంఘమును హింసించువాడనై, ధర్మ శాస్త్రమువలని నీతివిషయము అనింద్యుడనై యుంటిని.
- 2 Corinthians 9:4 2 కొరింథీయులకు 9:4మీరు సిద్ధపడని యెడల ఒకవేళ మాసిదోనియవారెవరైనను నాతోకూడ వచ్చి మీరు సిద్ధముగా ఉండకపోవుట చూచినయెడల, ఈ నమ్మిక కలిగియున్నందుకు మేము సిగ్గు పరచబడుదుము; మీరును సిగ్గుపరచబడుదురని యిక చెప్పనేల?
- 1 Corinthians 7:25 1 కొరింథీయులకు 7:25కన్యకల విషయమై, ప్రభువుయొక్క ఆజ్ఞ నేను పొందలేదు గాని నమ్మకమైనవాడనై యుండుటకు ప్రభువు వలన కనికరము పొందినవాడనై నా తాత్పర్యము చెప్పు చున్నాను.
- 1 Corinthians 7:6 1 కొరింథీయులకు 7:6ఇది నా హితోపదేశమేగాని ఆజ్ఞ కాదు; మనుష్యులందరు నావలె ఉండ గోరుచున్నాను.
- 2 Corinthians 11:18–27 2 కొరింథీయులకు 11:18–27అనేకులు శరీర విషయములో అతిశయపడుచున్నారు గనుక నేనును ఆలాగే అతిశయపడుదును. మీరు వివేకులైయుండి సంతోషముతో అవివేకులను సహించుచున్నారు. ఒకడు మిమ్మును దాస్యమునకు లోపరచినను, ఒకడు మిమ్ము మింగివేసినను, ఒకడు మిమ్ము వశపరచుకొనినను, ఒకడు తన్ను గొప్పచేసి కొనినను, ఒకడు ముఖముమీద మిమ్మును కొట్టినను మీరు సహించుచున్నారు. మేము బలహీనులమై యున్నట్టు అవమానముగా మాటలాడుచున్నాను. ఏ విషయమందు ఎవడైన ధైర్యము కలిగి యున్నాడో, ఆ విషయమందు నేనుకూడ ధైర్యము కలిగినవాడను; అవివేకముగా మాటలాడుచున్నాను సుమా. వారు హెబ్రీయులా? నేనును హెబ్రీయుడనే. వారు ఇశ్రాయేలీయులా? నేనును ఇశ్రాయేలీయుడనే. వారు అబ్రాహాము సంతానమా? నేనును అట్టివాడనే. వారు క్రీస్తు పరిచారకులా? వెఱ్ఱివానివలె మాటలాడు చున్నాను, నేనును మరి యెక్కువగా క్రీస్తు పరిచారకుడను. మరి విశేషముగా ప్రయాసపడితిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని; అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేకమారులు ప్రాణాపాయములలో ఉంటిని. యూదులచేత అయిదుమారులు ఒకటి తక్కువ నలువది దెబ్బలు తింటిని; ముమ్మారు బెత్తములతో కొట్టబడితిని; ఒకసారి రాళ్లతో కొట్టబడితిని; ముమ్మారు ఓడ పగిలి శ్రమపడితిని; ఒక రాత్రింబగళ్లు సముద్రములో గడిపితిని. అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదులవలననైన ఆపదలలోను, దొంగలవలననైన ఆపదలలోను, నా స్వజనులవలననైన ఆపదలలోను, అన్యజనుల వలననైన ఆపదలలోను, పట్టణములో ఆపదలలోను, అరణ్యములో ఆపదలలోను, సముద్రములో ఆపదలలోను, కపట సహోదరులవలని ఆపదలలోను ఉంటిని ప్రయాస తోను, కష్టములతోను, తరచుగా జాగరణములతోను, ఆకలి దప్పులతోను, తరచుగా ఉపవాసములతోను, చలి తోను, దిగంబరత్వముతోను ఉంటిని, ఇంకను చెప్ప వలసినవి అనేకములున్నవి.
Original words (Greek)
- which · G3739ὅς hós
- speak · G2980λαλέω laléō
- speak · G2980λαλέω laléō
- not · G3756οὐ ou
- after · G2596κατά katá
- Lord · G2962κύριος kýrios
- but · G235ἀλλά allá
- were · G5613ὡς hōs
- foolishly · G877ἀφροσύνη aphrosýnē
- in · G1722ἐν en
- this · G3778οὗτος hoûtos
- confidence · G5287ὑπόστασις hypóstasis
- boasting · G2746καύχησις kaúchēsis