2 Samuel · chapter 18 · verse 13
2 Samuel 18:13 in Telugu
మోసము చేసి నేను అతని ప్రాణమునకు ముప్పు తెచ్చిన యెడల అది రాజునకు తెలియకపోదు, రాజు సన్నిధిని నీవే నాకు విరోధివగుదువు గదా అని యోవాబుతో అనగా
Mosamu chesi nenu atani praanamunaku muppu techchina yedala adi raajunaku teliyakapodu, raaju sannidhini neeve naaku virodhivaguduvu gadaa ani yovaabuto anagaa
2 Samuel 18:13 in English
- King James Version (KJV)
- Otherwise I should have wrought falsehood against mine own life: for there is no matter hid from the king, and thou thyself wouldest have set thyself against [me].
- World English Bible (WEB)
- Otherwise, if I had dealt falsely against his life (and there is no matter hidden from the king), then you yourself would have set yourself against me.”
- American Standard Version (ASV)
- Otherwise if I had dealt falsely against his life (and there is no matter hid from the king), then thou thyself wouldest have set thyself against [me].
- Bible in Basic English (BBE)
- And if I had falsely put him to death (and nothing may be kept secret from the king), you would have had nothing to do with me.
- Darby Translation (DBY)
- Or I should have acted falsely against mine own life, for there is no matter concealed from the king, and thou wouldest have set thyself against [me].
- Webster's Bible (WBS)
- Otherwise I should have wrought falsehood against my own life: for there is no matter hid from the king, and thou thyself wouldst have set thyself against [me] .
- Young's Literal Translation (YLT)
- or I had done against my soul a vain thing, and no matter is hid from the king, and thou — thou dost station thyself over-against.'
Read in context
- 11యోవాబునీవు చూచి యుంటివే, నేల కూలునట్లు నీవతని కొట్టకపోతివేమి? నీవతని చంపినయెడల పది తులముల వెండియు ఒక నడికట్టును నీకిచ్చియుందునని తనకు సమాచారము చెప్పినవానితో అనెను.
- 12అందుకు వాడు¸యౌవనుడైన అబ్షాలోమును ఎవడును ముట్టకుండజాగ్రత్తపడుడని రాజు నీకును అబీషైకిని ఇత్తయికిని ఆజ్ఞ నిచ్చుచుండగా నేను వింటిని; వెయ్యి తులముల వెండి నా చేతిలో పెట్టినను రాజు కుమారుని నేను చంపను.
- 13మోసము చేసి నేను అతని ప్రాణమునకు ముప్పు తెచ్చిన యెడల అది రాజునకు తెలియకపోదు, రాజు సన్నిధిని నీవే నాకు విరోధివగుదువు గదా అని యోవాబుతో అనగా
- 14యోవాబునీవు చేయువరకు నేను కాచుకొని యుందునా? అని చెప్పి మూడు బాణములు చేత పట్టుకొని పోయి మస్తకివృక్షమున వ్రేలాడుచు ఇంకను ప్రాణముతో నున్న అబ్షాలోముయొక్క గుండెకు గురిపెట్టి
- 15తన ఆయుధములను మోయువారు పదిమంది చుట్టు చుట్టుకొని యుండగా అబ్షాలోమును కొట్టి చంపెను.
Cross references
- 2 Samuel 14:19–20 2 సమూయేలు 14:19–20అంతట రాజుయోవాబు నీకు బోధించెనా అని ఆమె నడిగినందుకు ఆమె యిట్లనెనునా యేలినవాడవైన రాజా, నీ ప్రాణముతోడు, చెప్పినదానిని తప్పక గ్రహించుటకు నా యేలిన వాడవును రాజవునగు నీవంటివాడొకడును లేడు; నీ సేవకుడగు యోవాబు నాకు బోధించి యీ మాటలన్నిటిని నీ దాసినగు నాకు నేర్పెను సంగతిని రాజుతో మరుగు మాటలతో మనవి చేయుటకు నీ సేవకుడగు యోవాబు ఏర్పాటు చేసెను. ఈ లోకమందు సమస్తమును ఎరుగుటయందు నా యేలినవాడవగు నీవు దేవ దూతల జ్ఞానమువంటి జ్ఞానము గలవాడవు.
- Hebrews 4:13 హెబ్రీయులకు 4:13మరియు ఆయన దృష్టికి కనబడని సృష్ఠము ఏదియు లేదు. మనమెవనికిలెక్క యొప్పచెప్పవలసియున్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది.
- 2 Samuel 4:10–12 2 సమూయేలు 4:10–12మంచి వర్తమానము తెచ్చితినని తలంచియొకడు వచ్చి సౌలు చచ్చెనని నాకు తెలియజెప్పగా వాడు తెచ్చిన వర్తమానమునకు బహుమానముగా సిక్లగులో నేను వానిని పట్టుకొని చంపించితిని. కావున దుర్మార్గులైన మీరు ఇష్బోషెతు ఇంటిలో చొరబడి, అతని మంచము మీదనే నిర్దోషియగువానిని చంపినప్పుడు మీచేత అతని ప్రాణదోషము విచారింపక పోవుదునా? లోకములో ఉండకుండ నేను మిమ్మును తీసివేయక మానుదునా? సకలమైన ఉపద్రవములలోనుండి నన్ను రక్షించిన యెహోవా జీవముతోడు మాననని చెప్పి, దావీదు తన వారికి ఆజ్ఞ ఇయ్యగా వారు ఆ మనుష్యులను చంపి వారి చేతులను కాళ్లను నరికి వారి శవములను హెబ్రోను కొలనుదగ్గర వ్రేలాడగట్టిరి. తరువాత వారు ఇష్బోషెతు తలను తీసికొనిపోయి హెబ్రోనులో అబ్నేరు సమాధిలో పాతి పెట్టిరి.
- 2 Samuel 1:15–16 2 సమూయేలు 1:15–16యెహోవా అభిషేకించిన వానిని నేను చంపితినని నీవు చెప్పితివే; నీ నోటి మాటయే నీ మీద సాక్ష్యము గనుక నీ ప్రాణమునకు నీవే ఉత్తరవాదివని వానితో చెప్పి తనవారిలో ఒకని పిలిచినీవు పోయి వాని చంపుమనగా అతడు వానిని కొట్టి చంపెను.